క్రీస్తుతో 40 శ్రమానుభవములు 16వ అనుభవం


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో శ్రమానుభవములు 16వ రోజు:

https://youtu.be/zM9h5fi9owM

అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును. మత్తయి 13:21

దేవుని ప్రణాళికలో, సంఘంలో నిలిచియున్న మనం; దేవుని వాక్యంలో స్థిరంగా ఉండాలి. సువార్త ద్వారా రక్షించబడి, బాప్తీస్మము ద్వారా సంఘంలో చేర్చబడిన మనం, సంఘంలోని బోధన విధానాల్లో కట్టుబడి, సంఘ నియమాల్లో జీవించినప్పుడు మన ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితాలు బలపడుతూ ఉంటాయి.

మరి ముఖ్యంగా, మన వ్యక్తిగత జీవితంలో వాక్యానుసారంగా జీవించుటకు ప్రయత్నించాలి. అనుదినం లౌకిక జీవితంలో వాక్యము నిమిత్తం శ్రమ కలుగుతూనే ఉంటుంది. చీకటి మనలను లోకములోనికి ఎప్పుడు లాగుతూనే ఉంటుంది. నామకార్ధ క్రైస్తవ విశ్వాసం మనలో లేకుండా చూసుకోవాలి. అనుదినం మనం చేసే పనిలో ఒత్తిడి దేవుని నుండి, వాక్యం నుండి దూరంకాకుండా చూసుకోవాలి. దేవుని ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చబడుటకు అనుదినం ప్రయత్నించాలి.

దేవుని వాక్యంలో వేరు పారిన అనుభవం...తుఫానువంటి అలజడి సంభవించినా కదల్చబడదు. ఎటువంటి శ్రమ వచ్చినా తట్టుకునే శక్తి దేవుడు దయజేస్తాడు. వాక్యమే దేవుడై యున్నాడు కాబట్టి, ఆ దేవుని మహత్తర శక్తి మనలను భద్రపరుస్తుంది.

ఏ విధమైన శ్రమలు ఎదురైనప్పటికి, ప్రతి క్రైస్తవ విశ్వాసి సువార్త కొరకు పని చేయాలి. మన గురి నూతన ఆత్మల రక్షణ కొరకైన ఆలోచనలతో నిండి యుండాలి. ఆత్మల కొరకైన భారం, స్త్రీ ప్రసవ వేదన పొందినంతగా ప్రయాసపడాలి. ఇట్టి ప్రయాస మనం పొందినప్పుడే సిలువలో క్రీస్తు శ్రమ పరిపూర్ణమవుతుంది.

ఆధ్యాత్మిక జీవితంలో లోతైన అనుభవాలు పొందుతూ, వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి పొందుతూ, అనేకులను క్రీస్తు వైపు నడిపించే భారమే... క్రీస్తుతో శ్రమానుభవము.

అనుభవం:
క్రీస్తుతో ప్రతి శ్రమ అనుభవంలో, వాక్యము నిమిత్తము శ్రమను ఎదుర్కొనగలమనే శక్తి ఉంది.

Experience the Suffering with Christ 16th Experience:

https://youtu.be/Ta5V8mJdWa4

But since they have no root, they last only a short time. When trouble or persecution comes because of the word, they quickly fall away. - Matthew 13:21.
We, who remain in God-s plan and the church, they must be consistent in the Word of God. Our spiritual lives are strengthened when we are saved by the Gospel and included in the church through baptism, adhering to the teaching methods of the church, and living in the church rules.

More importantly, we should strive to live our personal lives according to the word. In the mundane world of life, tribulations for the Word will continue. Darkness tries to drag us into the world. We need to make sure that the nominal Christian faith is not in us. Every day we must make sure that stress does not keep us away from God and the Word. We must strive for God-s plans to be fulfilled in our lives.

The experience of firm faith in the Word of God cannot be shaken by the storms of hardships. God grants us the strength to withstand any struggle because the Word is God, that great power of God will protect us.

Regardless of the tribulations, every Christian must work for the gospel. We must be filled with ideas for the salvation of souls. With the burden of soul’s salvation, we must struggle as much as the pain of a woman giving birth to a child. It is only when we receive this labor then Christ-s tribulation is completed.

My dear friends, experiencing the depth of spiritual life and developing in personal life also the burden of leading many people to Christ is nothing but partaking in tribulations with Christ.

Experience: In every tribulation experience with Christ, there is the power when suffering for the Word