క్రీస్తుతో 40 శ్రమానుభవములు 29వ అనుభవం


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 29వ అనుభవం

మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 1 కొరింథీయులకు 11:26

దేవుడు మనలను ఈ లోకంలో పుట్టించుటకు గల కారణం, ఈ లోకసంబంధమైన శ్రమలను జయించి, ఆత్మసంబంధమైన శ్రమలపై విజయంపొంది, పరిశుద్ధులముగా నీతిమంతులముగా ఈ లోకములో తీర్చబడి, మహిమలో ఆయనను ఎదుర్కోవాలనేదే తండ్రి ఉద్దేశం.

క్రీస్తు సిలువకు అప్పగింపక మునుపు... సిలువలో అయన పొందబోతున్న శ్రమలను గూర్చి వివరిస్తూ, సిలువలో మనకొరకు అర్పించనున్న తన శరీరానికి-రక్తానికి సాదృశ్యమైన రొట్టె-ద్రాక్షారసమును భుజించమని నేర్పించాడు. రక్షణ పొంది, ప్రభువు బల్లలో పాలుపంపులు కలిగియున్న మనం క్రీస్తు సిలువ మరణమును జ్ఞాపకము చేసుకోవలసిన వారమై యున్నాము.

"నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచి యుందుము" (యోహాను 6:56).
అయనయందు మనం మనయందు ఆయన నిలిచి ఉన్నప్పుడే, అనగా ప్రభువు బల్లలో పాలుపొందిన అనుభవమే పరిశుద్ధులముగా నీతిమంతులుగా చేయబడి పరలోకాన్ని చేరుకోగలుగుతాము.

ప్రభువు బల్లలో పాలుపొందడం సిలువ మరణానుభవం. ఈ అనుభవం అపో. పౌలు వివరిస్తూ "నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి యున్నాము" అని వివరించారు. లోకమును జయించినప్పుడే ఇట్టి సిలువ మరణానుభవమును పొందగలం. లోకమాలిన్యము అంటకుండా జీవించి, అనగా ఇహలోక జీవితం మరణించి, పరలోక జీవితాన్ని అనుభవించే వారముగా రూపాంతరం చెందాలి.

అంతేకాదు, క్రీస్తు శరీరానికి సాదృశ్యం సంఘం, ఆత్మీయ పాఠశాలైన ఆ సంఘములో చేర్చబడి, ఎవరైతే పరిశుద్ధమైన బల్లను పరిశుద్ధముగా భుజిస్తారో వారు క్రీస్తు మరణాన్ని జ్ఞాపకము చేసుకొని ఆయన మరణమును ప్రచురించేవారవుతారు. ఇట్టి అనుభవం సిలువలో క్రీస్తు మరణంపై విజయం పొందినరీతిగా, శారీరికంగా ఈ లోకంలో మరణించినా...ఆత్మీయ సంఘముగా ఎత్తబడి, క్రీస్తుతో లేపబడినవారమై మరణంపై విజయం పొందగలుగుతాము.

నేనంటాను, క్రైస్తవుని త్యాగ పూరితమైన జీవితం క్రీస్తుతో శ్రమానుభవం. లోకమును జయిస్తూ జీవించడం సిలువ మరణానుభవం. ప్రభువు బల్లలో చేయివేసి క్రీస్తు మరణమును జ్ఞాపకము చేసుకొని, ఆయన మరణాన్ని ప్రచురించే జీవితమే క్రీస్తుతో సమానానుభవం.

అనుభవం:
త్యాగపూరిత జీవితం క్రీస్తుతో సమానానుభవం.
బల్లలో పాలుపొందడం క్రీస్తుతో మరణానుభవం,
ఆయన మరణమును ప్రచురించడం క్రీస్తుతో శ్రమానుభవం.

https://youtu.be/rb4awZYA8u0

 

Experience the Suffering with Christ 28th Experience:

For whenever you eat this bread and drink this cup, you proclaim the Lord-s death until he comes. - 1 Corinthians 11:26.

The reason why God has made us into this world is that the Father intends us to conquer the worldly afflictions and triumph over the spiritual afflictions, and we need to be judged as believers and righteous in this world, to face Him in the glory.

Before Christ was handed over to the cross, He taught us to eat the bread and wine of His body, which is to be offered to us on the cross and He explain the sufferings that He would receive on the cross. We must remember the death and suffering of Christ when we partake in the Lord-s table.

Whoever eats my flesh and drinks my blood remains in me, and I in Him. (John 6:56). That is when we are in Him and He in us, the experience of participating in the Lord-s table will be justified as believers and be able to reach Him to heaven.

Taking part in the Holy communion is the experience of the cross. This experience is explained by Apostle Paul, that "the world has been crucified to me, and I to the world". This experience can be gained only when we conquer the world. We need to live a Godly life, which means the worldly life must be transformed into immortal life, that is, the death of the worldly life and the enjoyment of heavenly life.

Moreover, the body of Christ is the church, the spiritual school, and whoever takes part in Holy communion sacredly and cleanly remembers Christ-s death and publishes His death. This experience is the victory over Christ-s death on the cross. Though we physically leave this world, since we are a part of the living church, we can now enter the kingdom of God when we are in the Glory.

I believe that a Christian-s sacrificial life is the tribulation with Christ. The experience of the crucifixion is to conquer the world. The life that takes part in Holy communion commemorating Christ-s death and proclaiming His death is alike to Christ.

Experience: The sacrificial life is empathy with Christ. Partaking of the Holy communion is the experience of death with Christ, the publication of His death is suffering with Christ.

https://youtu.be/6qNAcafU5OU