ప్రస్తుత రాజకీయ ఆర్ధిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యే వ్యవస్థలో మనమున్నాం. ఘణతంత్ర దేశాలు అగ్రరాజ్యం కోసం పోటీ పడుతుంటే, చిన్న రాజ్యాలు విచ్చిన్నమైపోతున్నాయి. రాజకీయాల ఆధిపత్యపోరు రోజు రోజుకి పెరిగే కుంభకోణాలలో రోజువారి మానవ జీవనం బలహీనమైపోతూ ఉంది. స్థూలదేశీయోత్పత్తి అంతకంతకు పడిపోతుంటే సామాన్య మానవుని పైనే భారం పడుతుంది.
ఒకవైపు సామాన్య మానవ సహజ జీవితాలు అధికార బానిసత్వంలో కొట్టుకుపోతుంటే, మరోవైపు సామాజిక హక్కులు భౌతికంగా నిర్మూలించాలానే పాలకుల వర్గం విచ్చలవిడైపోతుంది. అసహన విధ్వంస పారిస్థితులు ఒకవైపు అంచలంచలుగా పెరుగుతుంటే మరోవైపు ధిక్కార స్వరం నిర్బంధించే ప్రయత్నాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కనబడుతుంది.
యుద్ధరంగంలో నిలబడి మృత్యువు ఇవ్వళ్ళో రేపో తెలియని సందిగ్ధంలో మానవుని జీవన వ్యవస్థ; సౌకర్యాల భద్రమైన జీవితాలకు మన సామాజం ఏంతో దూరంగా ఉంది. ఆర్ధిక సామాజిక అసమానతులను సరిచేసే ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సంస్కృతి మనమెప్పుడు చూస్తామో కదా. విధ్వంసపు అంచులో నిలబడిన భారత దేశం ఆర్ధిక సామాజిక అసమానతులను చక్కపరిచేదెప్పుడో!
నేనంటాను, ప్రాచీన ఆధునిక జీవన వ్యవస్థల్లో ఎన్నీ వైరుధ్యాలున్నా క్రైస్తవ విశ్వాసంలో ఎటువంటి మార్పులు ఉండకూడదని నా అభిప్రాయం. ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే మన జీవితాల్లో రూపావళి మార్పు కావాలి. ప్రపంచాన్ని నడిపించడం కోసం మనం.. సూర్యచంద్రుల్లా పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతూనే ఉన్నాము. పొద్దున్న కోడి కూయక ముందే నిద్ర లేసి.. కష్టం తోవ పట్టి. పొద్దు పోయినాక రాత్రికి ఇంటికి తిరిగి వస్తే, మన కష్టం గుక్కెడు మెతుకులకోసమే కదా.
నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును. (కీర్తన 128 : 2). మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై యున్నారు. (కొలొస్స - 3 : 24). ఈ మాటలను జ్ఞాపకము చేసుకుంటే మనం పడిన కష్టానికి సంతోషాన్నిచ్చి, కష్టపడి పని చేసి రాత్రి నిద్రించాక, మనకు దాచి యుంచిన బహుమానాలు దేవుడిస్తాడట! ఆమేన్!
అందరికీ...ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు.