అనుదిన అవసరతలు


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini Daily Devotions Telugu

అనుదిన అవసరతలు

అది 2010, ఆగస్టు 5వ తారీకున అటకామా ఎడారి ప్రాంతంలో కాపియాపో సమీపంలో ఒక సంఘటన జరిగింది. దాదాపు 2300 అడుగుల లోతున ఉన్న ఘనిలో, ఘనిని త్రవ్వే 33 మంది అకస్మాత్తుగా చిక్కుకొని పోయారు. ఆ రోజుల్లో ఎం జరగబోతుంది అని ప్రపంచం దృష్టంతా వారిపైనే ఉంది. ఘనిలో చిక్కుకున్న వారికి సహాయం దోర్కుతుందో లేదో అనే ఆలోచన కూడా లేకుండా పోయింది. పదిహేను రోజుల తరివాత వారిని రక్షించే సిబ్బంది, ఘని పై భాగంలో ఒక రంద్రం వేసి వారికి కావలసిన ఆహారం మరియు అవసరమైన వస్తువులను సరఫరా చేశారు. ఆహారం మాత్రమే కాదు, వారి ఆరోగ్యం, క్షేమం గూర్చి కుడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే వారు. అలా వారిని రక్షించే ప్రయత్నం 33 మందిని రక్షించడానికి, మరో మూడు రంద్రాలు చేసి, 69 రోజుల సుదీర్ఘమైన ప్రయత్నం తరువాత వారిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. ఈ వార్తను వీక్షించే వారు సంతోషించి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.

మన రోజువారి జీవితంలో మనం బ్రదికేది మనము సమకూర్చుకునే వసతులు, వస్తువుల్ల కాదు గాని. ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు మనకు అవసరమైన ప్రతీ దానిని మనకొరకు సమకూరుస్తాడు. చిక్కుకుపోయిన వారికి సహాయపడడానికి సహాయకులకు రంద్రాలు ఏ విధంగా సహాయపడ్డాయో, అదే విధంగా మనకు సమస్తాన్ని దయ చేసే దేవునితో మనలను అనుసంధానం చేస్తుంది ప్రార్ధన. యేసు క్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన కూడా ఇదే “మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము” (మత్త 6:11). అనుదిన జీవితానికి ఆహారం చాల అవసరం మరియు జీవనాధారం. కేవలం శారీరిక అవసరతల కోసమే ప్రార్ధన చేయమని కాదు గాని, మనకు అవసరమైన ప్రతీ దాని కొరకు ప్రార్ధన చేయమన్నాడు. అంటే, సౌఖ్యం, స్వస్థత, ధైర్యం, జ్ఞానం మొదలగువాటి కొరకు కూడా ప్రార్ధించమని నేర్పిస్తున్నాడు.

ప్రార్ధన ద్వారా దేవుణ్ణి ఏ క్షణంలోనైనా చేరుకోవచ్చు, మనం అడుగక ముందే మనకు ఏది అవసరమో ఆయనకు ముందే తెలుసు. ప్రార్ధన అంటే దేవునితో మాట్లాడడమే కదా. సర్వజ్ఞానియైన దేవుడు మనలను గూర్చి చింతిస్తున్నాడని విశ్వసించే విశ్వాస స్వరమే ప్రార్ధన. దేవుణ్ణి ప్రార్ధించి మనకు కావలసిన పతీ అవసరతలను గూర్చి అడిగినప్పుడు దానిని తప్పకుండా దయచేయగాలడని గమనించాలి. ఎందుకంటే, తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. (కీర్తన 145:18)
సర్వజ్ఞానియైన దేవుడు మనలను గూర్చి చింతిస్తున్నాడని విశ్వసించే విశ్వాస స్వరమే ప్రార్ధన.

https://www.youtube.com/watch?v=6nLsclr6Sbg