జీవితంలో ఆనందాన్ని ఎలా పొందగలం?
ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మన జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటాము. కొన్ని దినములు, నెలలు, సంవత్సరముల నుండి కొనసాగుతున్న సమస్యకు అనుకోకుండా పరిష్కారం దొరికినప్పుడు వెంటనే సంతోషాన్ని పొందే వారంగా ఉంటాము. అనేక సార్లు చిన్న చిన్న సమస్యలపై పొందే విజయాలు, రోజువారి జీవితంలో ఉత్సాహాన్ని కలుగజేస్తుంటాయి. ప్రత్యేకంగా, ఒక 24 గంటలు ఎటువంటి సమస్య ఎదురవ్వకపోతే “ఈ రోజు చాలా మంచిరోజు” అని చెప్పుకోవడం సహజమే కదా.
అంతేకాదు, మనం సంతోషంగా రోజులు గడుపుతూ, ఆనందంగా ఉదయాన్నే లేచి నూతన దినాన్ని చూడగలుగుతున్నాం అంటేనే దేవుని కృప. అందును బట్టి దేవుని స్తుతించబద్దులమై యున్నాము. దేవుడు, మన పట్ల తన అపారమైన ప్రేమ, కరుణ, దయ, వాత్సల్యత ప్రత్యేకంగా అయన ఉద్దేశం మన యెడల కలిగియున్నదని గ్రహించినప్పుడు క్రీర్తనలు 126:3 లో ఓ సంగతి నిఘూడముగా దాచబడియుంది. “యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు మనము సంతోషభరితులమైతివిు”. క్రీస్తు సిలువలో మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకము చేసుకొని హృదయంలో భద్రపరచుకోవడంకంటే గొప్పదైనది ఏది లేదు. గడచిన దినాల్లో దేవుడు మనకు చేసిన మేళ్లను జ్ఞాపకము చేసుకొనగలిగితే మరింత ఆనందాన్ని పొందగలం.
ఈ అనుభవంలో జీవించే మనకు ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే “ఆయన కృప నిరంతరముండును (క్రీర్తనలు 136:1)” అనే మాట రెట్టింపు ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలుగజేసి ప్రతి సమస్యను ఎదుర్కొన్నప్పుడు పరిష్కారం దొరుకుంతుందనే నమ్మకం కలుగుతుంది. ఆ పరిస్థితిలగుండా వెళుతున్నప్పుడు, దేవుడు ఎలా సహాయం చేస్తాడో మనకు తెలియకపోవచ్చు కాని, గతంలో ఆయన మనపట్ల చూపిన కనికరాన్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు, దేవుడు మనల్ని గట్టెక్కిస్తాడని నమ్మేలా సహాయపడుతుంది. ఇటువంటి విశ్వాసం కలిగినప్పుడు మన జీవితంలో గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని పొందగలం. ఆమెన్.
Audio : https://www.youtube.com/watch?v=JmZURbXw0Tk