అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతఙ్ఞతలు
నేను దేవుణ్ణి ఎల్లప్పుడూ ఏ సందర్భాలోనైనా స్తుతిస్తాను అని ఒక స్నేహితునికి చెప్తూ ఉండేవాణ్ణి. అనుకోకుండా ఒకరోజు వేరే ఊరికి వెళుతున్నానని వీడ్కోలు చెప్పి బస్టాండ్ కు వెళ్ళాను. నేను ఆలస్యంగా వెళ్లేసరికి బస్సు ముందే వెళ్ళిపోయింది. ప్రయాణాన్ని వాయిదా వేసుకొని ఇంటికి తిరిగివచ్చిన నన్ను చూసి నా స్నేహితుడు నాకు సూటిగా ఒక ప్రశ్న వేశాడు. ఈ సందర్భాల్లో కూడా మీరు దేవుణ్ణి స్తుతిస్తారా అని నన్ను అడిగితే, నేను అవుననే చెప్పను.
ఎలాగైతేనేం అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతఙ్ఞతలు చెల్లించాలన్న నా నమ్మకానికి ఒక క్రొత్త అర్ధం చేకూరింది. ఆరోజు బస్సు మిస్సయింది అనుకున్నాను కాని మరుసటి రోజు వార్తల్లో యాక్సిడెంటుకు గురైందని వార్తా పత్రికలో చదివినప్పుడు మేము ఆశ్చర్యపోయాము. ఈ సందర్భం మాలో గొప్ప అనుభూతిని కలుగజేసింది.
మనం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో “ప్రభువా నీకు వందనాలు” అని చెప్పడం కష్టమనిపిస్తుంది. దేవుని ఉద్దేశాలు మనం చూడగలిగినా, లేకపోయినా ప్రతి పరిస్థితిలో దేవునిపై సంపూర్ణ నమ్మకం కలిగి ఆయనకు కృతఙ్ఞతలు చెల్లించడం అనుదిన జీవితంలో అలవాటు కలిగి యుండాలి. దేవుడు మననుండి కూరుకునేది కూడా ఇదే “ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము” (1 థెస్స 5:18).
క్రైస్తవ విశ్వాసం లో ఈ అనుభవం మన విశ్వాసాన్ని బలపరచడమే కాకుండా రోజువారి జీవితంలో సానుకూల ఆలోచనను కలుగజేసి అనుదిన జీవితానికి సానుకూల వైఖరిని సృష్టిస్తుంది. దేవుని చిత్తమైన ప్రణాళికలో నేను కూడా ఉన్నాను అనే నిశ్చయతలో కృతజ్ఞత కలిగిన జీవితాలకు అంతా మంచే జరుగుంది అనే నమ్మకాన్ని బలపరుస్తుంది. ఆమెన్.
Audio: https://www.youtube.com/watch?v=wso1W1tiRUQ