అద్భుతం కావాలా?
Audio: https://youtu.be/SjUGMeqgl5g
లూకా 8:47 అందుకాయనకుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవైపొమ్మని ఆమెతో చెప్పెను.
మన అవసరతలలో దేవుని దగ్గరనుండి ఒక గొప్ప అద్భుతం జరుగుతే బాగుండని అనేకసార్లు ఆశపడ్తాము కానీ, కొన్ని సార్లు నిరాశ ఎదురవుతుంది.
దేవుని దగ్గర నుండి అద్భుతమును ఎలా పొందుకోగలము?
ఇక్కడున్న స్త్రీ ఎలా అంత గొప్ప అద్భుతం పొందుకుందో గమనిస్తే అర్ధంచేసుకోగలము.
పండ్రెండేండ్లనుండి రక్తస్రావరోగముగల యొక స్త్రీ యెవనిచేతను స్వస్థతనొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపుచెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను.
ఇంత గొప్ప కార్యం ఆ స్త్రీకి ఎలా జరిగింది?
లేవి 15:25-33 లో రక్తస్రావం కలిగిన స్త్రీ అపవిత్రురాలు అని వ్రాయబడింది. ఆమె వస్తువులు ముట్టుకున్న వారు కూడా అపవిత్రమైపోతారు. యేసు ప్రభువు భూమి మీద ఉన్న దినములలో ఈ చట్టం అమలులో ఉంది. ఈ చట్టం అమలులో ఉన్న సమయంలో యేసు ప్రభువుకు ఎదురు వచ్చి స్వస్థత అడిగితే, ఒకవేళ యేసు ప్రభువు ముట్టుకుంటే, యేసయ్య అపవిత్రమైపోతాడేమోనని వెనకనుండి వస్త్రపు చెంగు ముట్టుకుంది ఆ స్త్రీ.
ఈ స్త్రీ తన హృదయంలో యేసుని ఘనపరిచింది, తన క్రీయాల ద్వారా యేసుని అవమానపరుచుటకు ఇష్టపడలేదు. ఎవరు బాగు చేయలేకపోయిన తన విశ్వాసం యేసయ్య స్వస్థపరచగలడు.
తన క్రీయాల ద్వారా యేసు ప్రభువుని ఘనపరుస్తే అద్భుతం తనను ఆవరించింది.
ఈరోజు దేవుని దగ్గర నుండి అద్భుతం కొరకు నీవు ఎదురు చూస్తున్నవా?
కీర్తన 118:8 మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
దేవుని దగ్గర నుండి అద్భుతం కోరుకునే వారు మొదట మనుష్యుల సహాయం విడిచి దేవుని దగ్గరకు రావాలి. దేవుని దగ్గరకు వచ్చి మన క్రీయాలతో ఆయనను మహిమపరచాలి అనగా, మన లక్షణాలు, అలవాట్లు, మాటలు దేవుని మహిమపరిచేవిగా ఉండాలి. అప్పుడు అద్భుతాలను మన జీవితములో చూడగలుగుతాము.
SajeevaVahini.com