16:3 అది బేతేలు నుండి లూజువరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దువరకు సాగి క్రింది బేత్‌హోరోనువరకును గెజెరు వరకును పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దువరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రమువరకు సాగెను.
16:5 ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్‌హోరోనువరకు తూర్పుగా వ్యాపించెను.
16:7 యానో హానుండి అతారోతువరకును నారాతావరకును యెరికోకు తగిలి యొర్దాను నొద్ద తుదముట్టెను.
18:13 అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపున, అనగా బేతేలను లూజు దక్షిణమువరకు సాగి క్రింది బెత్‌హోరోనుకు దక్షిణముననున్న కొండమీది అతారోతు అద్దారువరకు వ్యాపించెను.