14:21 యెరూషలేమునందును యూదాదేశమందును ఉన్న పాత్రలన్నియు సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్టితములగును; బలిపశువులను వధించువారందరును వాటిలో కావలసినవాటిని తీసికొని వాటిలో వండు కొందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు.