5:9 ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.
5:10 కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
5:12 కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను.
5:13 మహలలేలును కనిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
5:14 కేయినాను దినములన్నియు తొమ్మిదివందల పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
3:36 షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,
3:37 లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహల లేలుకు, మహలలేలు కేయినానుకు,
3:38 కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.