9:27 అయితే బర్నబా అతనిని దగ్గరతీసి అపొస్తలుల యొద్దకు తోడుకొనివచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమునుబట్టి ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను.
13:6 వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్‌యేసు అను ఒక యూదుని చూచిరి.
15:25 గనుక మనుష్యులను ఏర్పరచి, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను