1:15 అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు, రాజ్యమందు ప్రథమపీఠముల మీద కూర్చుండు పారసీకులయొక్కయు మాదీయుల యొక్కయు ఏడుగురు ప్రధానులు ఎవరనగాకర్షెనా షెతారు అద్మాతా తర్షీషు మెరెను మర్సెనా మెమూకాను అనువారు.
1:16 మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల యెదుటను ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను రాణియైన వష్తి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలోనుండు అధిపతులందరి యెడలను జనులందరియెడలను నేరస్థురాలాయెను.
1:21 ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను.