27:13 గ్రేకేయులును తుబాలువారును మెషెకువారును నీలో వర్తకవ్యాపారము చేయుచు, నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు,
32:26 అక్కడ మెషెకును తుబాలును దాని సమూహమును ఉన్నవి; దాని సమాధులు దాని చుట్టునున్నవి. వారందరు సున్నతిలేనివారు, సజీవుల లోకములో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి, ఆయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయిరి.
38:2 నరపుత్రుడా, మాగోగు దేశపువాడగు గోగు, అనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతియైన వానితట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట యెత్తి ప్రవచింపుము
38:3 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా రోషునకును మెషెకు నకును తుబాలునకును అధిపతియగు గోగూ, నేను నీకు విరోధినై యున్నాను.
39:1 మరియు నరపుత్రుడా, గోగునుగూర్చి ప్రవచనమెత్తి ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతివైన గోగూ, నేను నీకు విరోధినైయున్నాను.