4:2 యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా.
4:7 నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతియైన సీసెరాను అతని రథములను అతని సైన్యమను కీషోను ఏటియొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించెదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియుండలేదా? అని దెబోరా చెప్పగా
4:17 హాసోరురాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్యయైన యాయేలు గుడారమునకు పారిపోయెను.
4:23 ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయులయెదుట కనాను రాజైన యాబీనును అణచెను.
4:24 తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించువరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచువచ్చెను.