3:2 యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులును లేచి, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రము నందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పిం చుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి.
3:8 యెరూషలేములోనుండు దేవునియొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో షయల్తీ యేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారు డైన యేషూవయును, చెరలోనుండి విడిపింపబడి యెరూష లేమునకు వచ్చినవారందరును పని ఆరంభించి, యిరువది సంవత్సరములు మొదలుకొని పై యీడుగల లేవీయులను యెహోవా మందిరముయొక్క పనికి నిర్ణయించిరి.
5:2 షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బా బెలును యోజాదాకు కుమారుడైన యేషూవయునులేచి యెరూషలేము లోనుండు దేవుని మందిరమును కట్టనారం భించిరి. మరియు దేవునియొక్క ప్రవక్తలు వారితోకూడ నుండి సహాయము చేయుచువచ్చిరి.
10:18 యాజకుల వంశములో అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యున్నట్లు కనబడినవారు ఎవరనగాయోజాదాకు కుమారుడైన యేషూవ వంశములోను, అతని సహోదరుల లోను మయశేయాయు, ఎలీయెజెరును, యారీబును గెదల్యాయును.