26:33 హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా.
27:1 అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై యుండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి.
27:6 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము.
36:2 ఆ దేశమును వంతు చీట్లచొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని యెహోవా మా యేలినవాని కాజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్య వలెనని మా యేలినవాడు యెహోవాచేత ఆజ్ఞనొందెను.
36:6 యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగావారు తమకు ఇష్టులైనవారిని పెండ్లి చేసికొనవచ్చును గాని వారు తమ తండ్రి గోత్రవంశ ములోనే పెండ్లి చేసికొనవలెను.
36:10 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి.
36:11 సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లిచేసికొనిరి.
7:15 మాకీరు, హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లి యాడెను. దాని సహోదరి పేరు మయకా, రెండవవానికి సెలోపెహాదని పేరు, ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి.