క్రీస్తు ప్రేమ ప్రతిబింబాలు
అవి భారత దేశాన్ని బ్రిటీష్ పరిపరిపాలిస్తున్న రోజులు. ఒకవైపు ధిక్కార స్వరాన్ని ఆ ప్రభుత్వం అణగదొక్కుతుంటే మరోవైపు ప్రాణాలను కూడా లెక్కచేయని స్వతంత్రం కోసం మనం పోరాడుతున్న సందర్భంలో నిరుపేదవైపు జాలిచూపించే వారు కనుమరుగైపోయారు. స్వతంత్రమా లేక ప్రాణమా అనే దుస్థితి. క్రైస్తవ్యత్వం అంటే అధికారం కాదు నైతికత మరియు నీతి, పేదలకు సమానత్వం మరియు భారత దేశ ప్రజలకు వారి స్వాతంత్ర్యం వారికి ఇవ్వాలనే న్యాయం కోసం మన పోరాటంలో మనతో బ్రిటీష్ మిషనరీ చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్ (1871-1940) సహకరిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడిపరిచారు.
చార్లెస్ తాను నేర్చుకున్న క్రైస్తవ్యం పేదలకు సమానత్వం ఇవ్వాలనే తన ఆలోచనలను “నేను క్రీస్తుకు ఇవ్వవలసినది ఒకటి ఉన్నది” అనే పుస్తకంలో 1932లో తన ఆత్మకథను వివరించారు. దక్షిణ ఆఫ్రికా లో స్నేహితులైన మహాత్మాగాంధీతో మరియు కలకత్తాలో స్నేహితుడైన రవీంద్రనాథ్ ఠాగూర్ ను కలిసి మన దేశ స్వతంత్రం కోసం వారికి వివరిస్తూ తనదైన కృషి చేసాడు. అతనిని “దీనబంధు” అంటే పేదల పెన్నిది అని అర్ధమిచ్చే వానిగా పిలువబడ్డాడు. తన ఆత్మ కథలో తాను వివరించిన మాటలు నన్ను ఆశ్చర్యం కలుగజేశాయు. “నేను క్రీస్తు ప్రేమను లోతుగా అర్ధం చేసుకున్నప్పుడు, అది నన్ను మార్చడమే కాదు గాని ఇతరులను ఎలా క్షమించాలో కూడా నేర్చుకున్నాను” అని అన్నాడు. క్రైస్తవేతరులైన తన స్నేహితులు క్రీస్తుపై తనకున్న ప్రేమను మాత్రమే గుర్తించేలా జీవించి మాదిరిని చూపించాడు. పరలోకానికి ఆయన పిలుపునందుకునే రోజువరకు తన చుట్టూ ఉన్నవారితో దేవుని ప్రేమను గురించి ప్రకటించి, క్రీస్తు ప్రేమ ప్రతిబింబాలు వెదజల్లాడు.
మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్న ప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి యుండలేదు.(నిర్గమ 34:29). అయితే ఇశ్రాయేలీయులు మాత్రము మోషే దేవునితో మాట్లాడాడని చెప్పగలిగారు. అతడు దేవునితో కలుసుకొనుటకు తన సంభాషణను కొనసాగిస్తూ తన చుట్టూ ఉన్నవారిని ప్రభావితము చేస్తూ ఉన్నాడు.
దేవునితో మనకున్న అనుభవాలు సమయం గడిచే కొలది మనలో ఎటువంటి మార్పులు తీసుకువస్తాయో మనం గ్రహించలేకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనలో కలిగే మార్పు మోషే ముఖచర్మము ప్రకాశించినట్లు ఉండకపోవచ్చు. అయితే మనం దేవునితో సమయం గడిపే కొలది, ప్రతి దినము ఇంకా ఇంకా ఆయన వశము చేసుకునే కొలదీ, ఆయన ప్రేమను ప్రతిబింబింప చేయగలుగుతాము. ఆయన సన్నిధి మన ద్వారా వ్యక్తమయ్యే కొలదీ దేవుడు ఇతరులను ఆకర్షించగలుగుతాడు. దేవునితో సన్నిహితంగా మనం గడిపే క్షణాలు మనలను మార్చి ఇతరులను ఆయన ప్రేమదిశగా మళ్ళిస్తాయి. ఆమెన్.
https://www.youtube.com/watch?v=NB9N7qjb6G8