Genesis - ఆదికాండము 1 | View All

1. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
హెబ్రీయులకు 1:10, హెబ్రీయులకు 11:3

కీర్తనల గ్రంథము 33:6 కీర్తనల గ్రంథము 33:9 కీర్తనల గ్రంథము 102:25 యెషయా 42:5 యెషయా 45:18 యోహాను 1:2-3 కొలొస్సయులకు 1:16 హెబ్రీయులకు 1:2 ప్రకటన గ్రంథం 4:11 సృష్టి ఆరంభం ఎప్పుడో మనకు తెలియదు. కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమని కొందరంటారు. కొన్ని వేల సంవత్సరాలే అని మరి కొందరంటారు. బైబిలులో సృష్టి ఆరంభమైన సమయం ముఖ్యం కాదు గాని సృష్టి జరిగిందన్న సత్యమే ప్రధానం. ఈ జగత్తు శాశ్వతం కాదు. దేవుడొక్కడే శాశ్వతుడు (కీర్తనల గ్రంథము 90:2). జగత్తు ఉనికిలోకి రాకముందే దేవుడున్నాడు. ఆయన ఈ విశ్వాన్ని శూన్యంలోనుంచి తన వాక్కు ద్వారా, అపరిమితమైన తన శక్తిద్వారా చేశాడు. ఈ మహా సృష్టికర్త ఈ మొదటి వచనంలో కనిపిస్తున్నాడు. ఈ అధ్యాయంలో ఆయన గురించి 30 సార్లు రాసివుంది. బైబిలు గ్రంథమంతా ఆయనను గురించిన వృత్తాంతమే. ఆయన మహాకార్యాలూ, అద్భుత వాక్కుల గురించి ఈ గ్రంథం మనకు చెప్తున్నది. ముఖ్యంగా మానవజాతి పట్ల ఆయన వ్యవహారాలనూ తన గురించిన సత్యాన్నీ ఆయన వారికిలా వెల్లడి చేసినవాటినీ ఇది మనకు తెలియజేస్తుంది. ఆయన్నెలా చేరుకోవాలో, ఎలా ఆరాధించాలో ఆయన మనకు ఉపదేశిస్తున్నాడు. దేవుని ఉనికిని గురించిన రుజువులతో బైబిలు ఆరంభం కావడం లేదు. ఆయన జరిగిస్తున్న చర్యలతోనే ఇది మొదలైంది. ఆయన చర్యలు ఆయన ఉనికిని తెలియజేస్తున్నాయి. ఆయన చేసిన పనులను బట్టి ఆయనెలాటివాడో మనం కొంత నేర్చుకోవచ్చు. కీర్తనల గ్రంథము 19:1-2 యెషయా 40:25-26 రోమీయులకు 1:20 చూడండి.

2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.

“శూన్యంగా రూపం లేకుండా”- కీర్తనల గ్రంథము 104:30 యెషయా 45:18 యిర్మియా 4:23 అంటే ఆరంభంలో భూమి మానవ నివాసానికి యోగ్యంగా లేదని దీనిభావం అనుకోవచ్చు. అలా దానిని నివాసయోగ్యంగా చేసేందుకు దేవుని ఆత్మ అక్కడ నెలకొన్నాడు. కీర్తనల గ్రంథము 104:30 పోల్చిచూడండి. “దేవుని ఆత్మ”– బైబిలంతటిలో దేవుని ఆత్మ దేవుని కార్యాలు జరిగించడం చూడగలం (ఆదికాండము 6:3 ఆదికాండము 41:38 నిర్గమకాండము 31:3 సంఖ్యాకాండము 24:2 1 సమూయేలు 16:13 2 సమూయేలు 23:2 కీర్తనల గ్రంథము 51:11 కీర్తనల గ్రంథము 104:30 కీర్తనల గ్రంథము 143:10 యెషయా 11:2 యెషయా 61:1 మత్తయి 1:18 మత్తయి 3:16 మత్తయి 12:28 లూకా 11:13 యోహాను 3:5-6 యోహాను 14:17 యోహాను 15:26 యోహాను 16:7-15 అపో. కార్యములు 2:4 రోమీయులకు 8:9 1 కోరింథీయులకు 2:10 1 కోరింథీయులకు 6:19 గలతియులకు 3:2 ఎఫెసీయులకు 1:13 ఎఫెసీయులకు 2:22 2 పేతురు 1:19 ప్రకటన గ్రంథం 22:17 యోహాను 14:16-17 నోట్స్ చూడండి.

3. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
2 కోరింథీయులకు 4:9

“వెలుగు”– 2 కోరింథీయులకు 4:6 ఈ వెలుగు ఎక్కడినుంచి ప్రసరించిందో చెప్పలేదు. 14వ వచనం పోల్చిచూడండి. తన వాక్కు మహాత్యం వల్లే దేవుడు సృష్టిని చేశాడు (వ ఆదికాండము 1:6 ఆదికాండము 1:9 ఆదికాండము 1:11 ఆదికాండము 1:14 ఆదికాండము 1:20 ఆదికాండము 1:24 కీర్తనల గ్రంథము 33:6-9 హెబ్రీయులకు 11:3.

4. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.

యెషయా 45:7

5. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.

యోబు 38:19-20 కీర్తనల గ్రంథము 74:16. “సాయంకాలం...ఉదయం”– 3వ వచనంలోని వెలుగు సూర్యునినుంచి రాకపోతే ఈ ఉదయ సాయంకాలాలు ఇప్పటి అనుదిన ఉదయ సాయంత్రాలకు భిన్నమైనవై ఉండవచ్చు. “రోజు”– ఆదికాండము 2:2 ఆదికాండము 5:2 దగ్గర చూడండి.

6. మరియదేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను.
2 పేతురు 3:5

కీర్తనల గ్రంథము 104:1-2 యిర్మియా 10:12.

7. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను.

8. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను.

9. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను.

యోబు 38:8-11 కీర్తనల గ్రంథము 33:7 కీర్తనల గ్రంథము 95:5.

10. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను.

11. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను.
1 కోరింథీయులకు 15:38

జంతు సృష్టికి ముందే దేవుడు వృక్ష జాలాన్ని సృష్టించాడు. కీర్తనల గ్రంథము 104:14.

12. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను

13. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను.

14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు,

యెషయా 40:26 కీర్తనల గ్రంథము 74:16 కీర్తనల గ్రంథము 136:7-9. సూర్యుడు కాకుండా వెలుగుకు ఉత్పత్తిస్థానాలు ఇంకా ఉన్నాయి. 3వ వచనంలోని వెలుగు వేరొక ఉత్పత్తిస్థానం నుంచి వచ్చినదై ఉండవచ్చు. లేక కొంతమంది భావించినట్లు మొదట్లో దట్టమైన మేఘాలు, లేదా నీటియావిరి భూమిని కప్పడంవల్ల సూర్యకాంతి కొంతవరకే భూమిని చేరేదనీ, సూర్యబింబం మాత్రం కనిపించేది కాదనీ భావించవచ్చు. కాబట్టి ఇక్కడి అర్థం బహుశా సూర్యచంద్రులు భూమి పైనుండి మొదటిసారి కనిపించాయి అనుకోవచ్చు. ఇక్కడ “చేశాడు” (వ 16) అనే పదం మొదటి వచనంలో ఉన్న “సృజించాడు” అనే పదంవంటిది కాదు (హీబ్రూభాషలో). హీబ్రూ పదం వేరువేరు అర్థాలు గలది – “వస్తువు మీద పని చేయడం”, “సిద్ధం చేయడం”, “నియమించడం”, మొదలైనవి. ఈ సమయంలో దేవుడు వీటిని వాటి ప్రస్తుత స్థానాల్లో ఉంచాడని అర్థం చేసుకోవచ్చు. రాత్రినీ పగటినీ ఏలేందుకూ, రుతువులను వేరు చేసేందుకూ సూర్యచంద్రులను సృష్టించాడు దేవుడు. మనుషులు వాటిని పూజించాలని కాదు (ద్వితీయోపదేశకాండము 4:19 ద్వితీయోపదేశకాండము 17:3-5 యెహోషువ 8:16-18). వాటిని చేసిన సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి (నిర్గమకాండము 20:3 మత్తయి 4:10). మానవ జీవితాల్లో వాటికి ఎలాంటి ఆధ్యాత్మిక ప్రభావమూ లేదు. ఇవి మనుషులను పరిపాలించవు. అవి ఉండడం మూలంగా లేదా, లేకపోవడం మూలంగా ఈ భూమిపైని భౌతిక పరిస్థితులను క్రమబద్ధం చేయడం ద్వారా రాత్రింబవళ్ళను పరిపాలిస్తాయి. సూర్యచంద్ర నక్షత్రాదులను చూడడం ద్వారా దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి, మనుషులపైనా, తన సృష్టి అంతటిపైనా ఆయన ఎంత ఉన్నతంగా ఉన్నాడో కొంతవరకు అర్థం చేసుకోవాలి – కీర్తనల గ్రంథము 8:3-4 కీర్తనల గ్రంథము 102:25-27 యెషయా 40:12-17 యెషయా 40:25-26 యెషయా 44:24.

15. భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను.

16. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.

17. భూమిమీద వెలుగిచ్చుటకును

18. పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను.

19. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.

భూమిపై తిరుగాడే జంతుజాలం కంటే జలచరాలు ముందు వచ్చాయి.

20. దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను.

21. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను.

22. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను.

23. అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను.

24. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆప్రకారమాయెను.

భూమిపై జీవం నిర్జీవ పదార్థాలనుంచి మానవుడిదాకా పరిణామం చెందిందని ప్రతిపాదించే సిద్ధాంతం ఒక దాన్ని మానవులు సృష్టించారు. ఇందులో దేవునికి బొత్తిగా స్థానం లేదు. ఇది నాస్తిక జీవపరిణామ వాదం. దీన్ని ఇంతవరకు ఎవరూ నిరూపించలేదు. దీనిలో విజ్ఞానశాస్త్ర సంబంధమైన సమస్యలెన్నో ఉన్నాయి. ఉదాహరణకు నిర్జీవ పదార్థం నుంచి ఎవరి ప్రమేయం లేకుండా జీవం మొదట్లో ఎలా ఉద్భవించింది? అసలు ఆ నిర్జీవ పదార్థం ఎక్కడినుంచి వచ్చింది? మనస్సు, వ్యక్తిత్వం, నైతిక విలువలు, ఆధ్యాత్మికత ఇవేవీ లేని నిర్జీవ పదార్థం నుంచి ఇవన్నీ ఉన్న మానవుడు ఎలా రాగలిగాడు? మూర్ఖత్వం, భ్రష్టత్వం కరడు గట్టిన హృదయంలో నుండి నాస్తికవాదం వస్తుందని బైబిలు చెప్తున్నది (కీర్తనల గ్రంథము 14:1). ఇప్పుడున్న జీవులన్నిటినీ ఉనికిలోకి తెచ్చేందుకు దేవుడు ఈ జీవపరిణామం అనే పద్ధతిని ఉపయోగించాడని దేవుడంటే నమ్మకం ఉన్న కొందరంటారు. ఈ సిద్ధాంతాన్ని కూడా ఎవరూ రుజువు చేయలేదు. దేవుడు ఇలా చేశాడని బైబిలు కూడా ఏమీ చెప్పడం లేదు.

25. దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను.

26. దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.
ఎఫెసీయులకు 4:24, యాకోబు 3:9

ఈ వచనం ధోరణిని బట్టి చూస్తే మానవుడు జీవ పరిణామం వల్ల వచ్చినవాడు గాక ప్రత్యేక సృష్టి అనీ, ఇంతకు ముందు దేవుడు సృష్టించినవాటన్నిటి కంటే ప్రత్యేకమైనవాడనీ అర్థమౌతున్నది. బైబిలు ప్రకారం మానవుడు కేవలం జంతు ప్రపంచంలో చేరినవాడు కాదు. అతడు దేవుడూ కాదు, దేవునిలో ఒక భాగమూ కాదు. జంతువులన్నిటికంటే పైవాడు. జంతువులను దేవుని పిల్లలని ఎవరూ పిలవకూడదు. దేవుడు జంతువులను తన పోలికలో చేశాడని బైబిలు చెప్పడం లేదు. అయితే మానవుడు జంతువులకంటే ఎంతో ఎక్కువవాడైనప్పటికీ దేవుని కంటే బహు అల్పుడు. దేవుడు సృష్టికర్త. మనిషి సృష్టి. అయితే కొన్ని విషయాల్లో దేవుని పోలిక మనిషికి ఉంది. అతడికి వ్యక్తిత్వం ఉంది. ఇది ఒక ప్రధాన సత్యాన్ని వెల్లడిస్తుంది. అదేమంటే, మనిషిని చేసిన సృష్టికర్తకు కూడా వ్యక్తిత్వం ఉందన్నమాట. దేవుడొక వ్యక్తిత్వం లేని శక్తిరూపం కాదు. దేవుడు వెల్లడి చేసిన సత్యాలగురించి తలపోసేందుకు మనిషికి మనసుంది. మంచి చెడుల్లో ఏదో ఒకటి ఎంచుకునేందుకు సంకల్పబలం ఉంది. దేవుణ్ణి ప్రేమించి ఆరాధించ గలిగే సామర్థ్యం ఉంది. అతడు దేవుని పోలికలో తయారయ్యాడు (ఆదికాండము 5:1 ఆదికాండము 9:6 1 కోరింథీయులకు 11:7 ఎఫెసీయులకు 4:24). అంటే మనిషికి లాగా దేవునికి కూడా శరీరం ఉందని కాదు. దేవుడు ఆత్మ. యోహాను 4:24. ఈ వచనంలో “మనం”, “మన” అనే పదాలను గమనించండి. ఆదికాండము 3:22. “త్రిత్వం” అనే నిగూఢ సిద్ధాంతం తాలూకు ఛాయలు ఇక్కడ కనిపిస్తున్నట్టున్నాయి. ఈ సిద్ధాంతం బైబిల్లో క్రమేపీ వెల్లడి అయింది. ఈ వచనంలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవదూతలతోనా? కాదు. మానవుణ్ణి చేసినది దేవదూతల పోలికలో అని గానీ, మానవుణ్ణి చేయడంలో దేవదూతలు దేవునితో సహకరించారని గానీ బైబిల్లో ఎక్కడా రాసిలేదు. మరి, ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నట్టు? దేవుడు ఒక్కడే. అనేక మంది లేరు. బైబిల్లో ప్రతి చోటా ఈ సత్యం ఉంది – ద్వితీయోపదేశకాండము 4:35 ద్వితీయోపదేశకాండము 4:39 యెషయా 43:10-12 యెషయా 44:4-8 యెషయా 45:5-7 రోమీయులకు 3:29-30 1 కోరింథీయులకు 8:4 1 తిమోతికి 1:17 1 తిమోతికి 6:15-16 యూదా 1:25. కాబట్టి ఇక్కడ దేవుడు మరొక దేవునితో మాట్లాడలేదు. బైబిలు ప్రకారం ఒకే దేవుడు తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ అనే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు, ఒకే సంకల్పం, ఒకే మనస్సు, ఒకే స్వభావంతో సంపూర్ణ ఐక్యత కలిగి ఉన్నారు. ఈ ముగ్గురు కూడా సృష్టి కార్యంలో తమ పాత్రను నిర్వహించారు. 1వ వచనంలో తండ్రి, 2వ వచనంలో ఆత్మ కనిపిస్తున్నారు. సృష్టి కార్యమందంతటిలో కుమారుడు తండ్రితో ఉన్నాడు (యోహాను 1:1-3 కొలొస్సయులకు 1:16-17 హెబ్రీయులకు 1:10-12). త్రిత్వం గురించి మత్తయి 3:16. ఈ వచనంలో తండ్రి త్రిత్వంలోని మిగతా ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతున్నట్టు ఉంది.

27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
మత్తయి 19:4, మార్కు 10:6, అపో. కార్యములు 17:29, 1 కోరింథీయులకు 11:7, కొలొస్సయులకు 3:10, 1 తిమోతికి 2:13

మత్తయి 19:4-6

28. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.

కీర్తనల గ్రంథము 8:6-8 యిర్మియా 27:5 “దీవించి”– ఆదికాండము 12:1-3. సంఖ్యాకాండము 6:22-27 ద్వితీయోపదేశకాండము 28:1 కీర్తనల గ్రంథము 1:1 మత్తయి 5:3-12. మొదలైన చోట్ల దీనిపై నోట్స్ చూడండి.

29. దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును.
రోమీయులకు 14:2

ఆదికాండము 7,8 అధ్యాయాల్లో కనిపిస్తున్న జలప్రళయం తరువాత దేవుడు కొత్త ఆదేశాలు ఇచ్చాడు. ఆదికాండము 9:3-4. చూడండి.

30. భూమి మీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను.

31. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.
1 తిమోతికి 4:4

దేవుడు చేసినదంతా మనిషితో సహా చాలా బాగుంది. మనిషి పాపం లేనివాడు, పాపం చేయనివాడు. దేవునితో సహవాసం చేయగలిగినవాడు. ఆత్మతో సత్యంతో ఆయన్ను ప్రేమించి ఆరాధించగలిగినవాడు. ప్రత్యేకమైన నోట్ బైబిల్లోని సృష్టి సత్యం, విజ్ఞానశాస్త్రం గురించి ఒక మాట – ఈ అధ్యాయంలో కనిపిస్తున్న సృష్టి విధానానికీ ఆధునిక విజ్ఞానశాస్త్రం కనుగొన్న సత్యాలకూ విభేదమేదన్నా ఉందా? ఎంతమాత్రం లేదు. ఈ మొదటి అధ్యాయం (బైబిలు అంతా కూడా) సాక్షాత్తూ దేవుని నుంచి వెల్లడైన సత్యం. అందువల్ల ఇది కేవలం వాస్తవం. 2 తిమోతికి 3:16 2 పేతురు 1:21 మొ।। చూడండి. ఇక్కడ ఇవ్వబడిన సృష్టిక్రమం ఇలా ఉంది: ఆకాశాలు, నిరాకారమై ఉన్న భూమి, భూమిపై వెలుగు ప్రసరించడం, వృక్షజాలం తరువాత నీటిలో జలచరాలు, ఆ పైన భూచరాలు, చివరిగా మానవుడు. ఈ సృష్టిక్రమం సక్రమమేనని ఆధునిక విజ్ఞానశాస్త్రం అంగీకరిస్తున్నది. సృష్టి వాస్తవమని కూడా విజ్ఞానశాస్త్రం అంగీకరిస్తున్నది. అయితే దేవునితో ప్రమేయం లేకుండా ఈ సృష్టి ఉనికిలోకి వచ్చిందన్న సిద్ధాంతానికీ అలాంటి ఊహాగానాలకూ దేవుని వాక్కు వ్యతిరేకం. అయితే సైన్సు పేరుతో చేసే ఊహాగానాలు సైన్సు ధర్మాలు, సత్యాలు కావు. ఈ తేడా తెలియకుండా మనం అపార్థం చేసుకోరాదు. ఈ విశ్వం తనకు తానే ఉనికిలోకి వచ్చిందని చెప్పడం సరైన విజ్ఞానశాస్త్ర సమ్మతం కాదు. అప్పట్లో ఏమి జరిగిందో పరిశీలించేందుకు ఏ శాస్త్రజ్ఞుడూ అక్కడ లేడు. అలాంటివి జరుగుతాయని ప్రయోగ పూర్వకమైన ఏ సాక్ష్యాధారాలు లేవు. విశ్వానికి మూలమేదో చెప్పవలసి వస్తే శాస్త్రజ్ఞులు సామాన్యుల్లాగానే ఊహాగానాలన్నా చెయ్యాలి. లేదా, ఇక్కడ తన వాక్కులో దేవుడు ఇచ్చిన వివరణను నమ్మాలి. అన్నిటి ఆరంభం, మూలం గురించి బైబిల్‌లోని ఈ మొదటి అధ్యాయం హేతుబద్ధమయిన, సక్రమమైన, సమంజసమైన వివరణ ఇస్తున్నది. సైన్సు దీన్ని తప్పని ఇంతవరకు నిరూపించలేదు. అనేకమంది నేర్పరులైన విజ్ఞానవేత్తలు ఈ వివరణను దేవుడు వెల్లడించాడని స్వీకరించి నమ్ముతున్నారు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 1 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
దేవుడు ఆకాశమును మరియు భూమిని సృష్టిస్తాడు. (1,2) 

బైబిల్ మొదటి భాగం ప్రపంచాన్ని శక్తివంతమైన దేవుడు ఎలా సృష్టించాడని చెబుతుంది. తెలివైన వ్యక్తులకు దాని గురించి భిన్నమైన ఆలోచనలు ఉన్నప్పటికీ, వినయపూర్వకమైన క్రైస్తవులు దానిని బాగా అర్థం చేసుకుంటారు. మనం ప్రపంచాన్ని చూసినప్పుడు, దేవుడు ఎంత అద్భుతమైనవాడు మరియు బలవంతుడో మనం చూడవచ్చు. ఇది ఎల్లప్పుడూ ఆకాశముగురించి ఆలోచించాలని మరియు క్రైస్తవులుగా సరైనది చేయాలని మనకు గుర్తుచేస్తుంది. దేవుని కుమారుడు ప్రపంచాన్ని సృష్టించడంలో సహాయం చేసాడు మరియు మనం ప్రార్థించే వ్యక్తి ఆయనే. ప్రజలు మంచిగా మారడానికి సహాయపడే ప్రత్యేక ఆత్మ గురించి కూడా బైబిలు మాట్లాడుతుంది. మొదట, ప్రపంచం ఖాళీగా మరియు గందరగోళంగా ఉంది, కానీ దేవుడు దానిని అందంగా మార్చాడు. అదే విధంగా, దేవుణ్ణి నమ్మని వ్యక్తులు కోల్పోయినట్లు మరియు సంతోషంగా ఉండగలరు. కానీ దేవుని సహాయంతో, వారు మంచిగా మరియు ఆనందాన్ని పొందవచ్చు.

కాంతి సృష్టి. (3-5)

దేవుడు, "వెలుగు ఉండనివ్వండి" అని చెప్పాడు, ఆపై వెలుగు వచ్చింది! దేవుని మాటలు ఎంత శక్తివంతంగా ఉన్నాయో ఆశ్చర్యంగా ఉంది. మనం విశ్వాసులుగా మారినప్పుడు, పరిశుద్ధాత్మ మనలో పని చేస్తుంది మరియు విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మనము దేవుణ్ణి తెలుసుకోకముందు, మనం చీకటిలో ఉన్నట్లుగా ఉన్నాము, కానీ ఇప్పుడు యేసు కారణంగా మనకు వెలుగు ఉంది. 1 యోహాను 5:20 దేవుడు వెలుగును ఇష్టపడి చీకటి నుండి వేరు చేసాడు ఎందుకంటే అవి కలిసి ఉండవు. ఆకాశము కాంతితో నిండి ఉంది మరియు చీకటి లేదు, నరకం పూర్తిగా చీకటిగా ఉంది. దేవుడు పగలు మరియు రాత్రి రెండింటినీ సృష్టించాడు మరియు మనం పగటిపూట అతనికి మంచి పనులు చేయడానికి మరియు అతని బోధనల గురించి ఆలోచిస్తూ రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి వాటిని ఉపయోగించాలి.

దేవుడు భూమిని నీటి నుండి వేరు చేసి, దానిని ఫలవంతం చేస్తాడు. (6-13) 

ప్రారంభంలో, భూమి ఖాళీగా ఉంది. కానీ దేవుడు మాట్లాడాడు మరియు అతనికి చెందిన అద్భుతమైన విషయాలతో దానిని నింపాడు. మొక్కలు మరియు పండ్ల వంటి వాటిని మనం ఉపయోగించుకోవచ్చు, కానీ మనం దేవుణ్ణి గౌరవించడానికి మరియు ఆయనను సేవించడానికి వాటిని ఉపయోగించాలి. యేసు (దేవుడు) మనం ఆనందించడానికి భూమిని ఈ వస్తువులను ఉత్పత్తి చేస్తాడు, అయితే అవి ఆయన నుండి వచ్చాయని మరియు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మన దగ్గర ఈ విషయాలు లేకపోయినా, మనం దేవుడిని ప్రేమిస్తే మనం ఇంకా సంతోషంగా ఉండగలం ఎందుకంటే ఆయన అన్ని మంచి విషయాలకు మూలం.

దేవుడు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలను ఏర్పరుస్తాడు. (14-19) 

సృష్టి యొక్క నాల్గవ రోజున, దేవుడు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలను సృష్టించాడు. ఇవన్నీ మనకు ఆకాశంలో కనిపించేవి. అవి దేవునిచే సృష్టించబడ్డాయి మరియు అవి మనకు సహాయం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. మనం కూడా దేవునికి సేవ చేయాలి, కానీ కొన్నిసార్లు మనం మంచి పని చేయలేము. మనము నక్షత్రములవలె ఉండి దేవుని కొరకు ప్రకాశవంతముగా ప్రకాశింపజేయుటకు ప్రయత్నించవలెను.

జంతువులు సృష్టించబడ్డాయి. (20-25) 

చేపలు, పక్షులు ఉండాలని దేవుడు చెప్పాడు, వాటిని తానే సృష్టించాడు. అతను కీటకాలను కూడా చేసాడు, అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి మరియు వాటిలో చాలా ఉన్నాయి. దేవుడు చాలా తెలివైనవాడు మరియు శక్తివంతుడు, మరియు అతను ప్రపంచంలోని ప్రతిదీ చూసుకుంటాడు. విషయాలు ఫలవంతమైతే, దేవుడు వారిని ఆశీర్వదించాడు కాబట్టి.

మనిషి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. (26-28) 

దేవుడు మానవులను చివరిగా చేసాడు, ఇది ఒక ముఖ్యమైన మరియు ప్రత్యేకమైన విషయం. అయితే, మానవులు జంతువులతో ఒకే రోజున సృష్టించబడ్డారు మరియు అదే భూమి నుండి సృష్టించబడ్డారు. మనం ఒకే భూమిని మరియు శరీరాన్ని జంతువులతో పంచుకున్నప్పటికీ, మన శారీరక కోరికలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని జంతువులలాగా ప్రవర్తించకూడదు. భౌతిక మరియు ఆధ్యాత్మిక అంశాలను కలపడం ద్వారా మానవులు తాను సృష్టించిన అన్నిటికంటే భిన్నంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు, "మనం మనిషిని తయారు చేద్దాం" అని చెప్పినప్పుడు, మానవులు తండ్రిని, కుమారుడిని మరియు పరిశుద్ధాత్మను మహిమపరచాలని ఆయన ఉద్దేశించారు. మన ఆత్మలు మనలను ప్రత్యేకమైనవిగా మరియు దేవుని పోలినవిగా చేస్తాయి. మానవులు మంచి మరియు నిటారుగా ఉండేలా సృష్టించబడ్డారు. ప్రసంగి 7:29. ఆదాము మరియు హవ్వ పరిపూర్ణంగా మరియు పవిత్రంగా ఉండేలా దేవుడు సృష్టించాడు. వారు దేవుని మార్గాలను సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు మరియు తెలుసుకున్నారు మరియు ఎల్లప్పుడూ ఆయనకు విధేయత చూపారు. వారు మంచి భావాలు మరియు ఆలోచనలు కలిగి ఉన్నారు మరియు ఎప్పుడూ చెడు చేయాలని కోరుకోలేదు. వారు చాలా సంతోషంగా ఉన్నారు మరియు దేవునితో ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు. కానీ పాపం, పాపం కారణంగా, మనలో ఉన్న దేవుని యొక్క ఈ పరిపూర్ణ చిత్రం ఇప్పుడు విచ్ఛిన్నమైంది. మనల్ని మళ్లీ పవిత్రంగా మార్చడానికి దేవుని సహాయం కావాలి.

ఆహారం నియమించబడింది. (29,30) 

భూమి నుండి వచ్చే మొక్కలు, పండ్లు మరియు మొక్కజొన్న వంటి వాటిని ప్రజలు తినాలి. మనం ఏమి తింటామో అని చింతించనవసరం లేదు, ఎందుకంటే దేవుడు పక్షులను ఎలా చూసుకుంటాడో అలాగే మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు మరియు మనకు అందిస్తాడు.

సృష్టి యొక్క పని ముగిసింది మరియు ఆమోదించబడింది. (31)

మనం చేసిన పనులను పరిశీలిస్తే, మనం తప్పులు చేశామని తరచుగా తెలుసుకుంటాం. కానీ దేవుడు తాను సృష్టించిన ప్రతిదానిని చూసినప్పుడు, అతను ప్రతిదీ చాలా మంచిదని భావించాడు. అతను ప్రతిదీ తనకు కావలసిన విధంగా చేసాడు. అతను పాలించే అన్ని ప్రదేశాలలో ప్రతిదీ అతనిని స్తుతిస్తుంది. కాబట్టి మనం కూడా యేసు గురించిన శుభవార్త కోసం దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడు ఎంత శక్తిమంతుడో మనం ఆలోచించినప్పుడు, మనం చెడు పనుల నుండి దూరంగా ఉండాలి మరియు బదులుగా ఆయనలా ఉండేందుకు ప్రయత్నించాలి. మనం దేవునిలా పవిత్రులమైతే, చివరికి అంతా మంచి మరియు సరైనది అయిన కొత్త ప్రపంచంలో జీవించగలుగుతాము.




Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |