ప్రేమ యొక్క మార్గం | Way of Love


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

1 కోరింథీయులకు 14:1 ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి.

ప్రేమను కొనసాగించడం అంటే ఒకరికొకరు మంచి చేయడంలో వెనకాడకుండా మనతో పాటు మనతో ఉన్నవారిని కూడా కలుపుకుంటూ వెళ్ళడమే. ప్రేమ అనేది భావోద్వేగ భావన కంటే ఎక్కువ; ప్రేమించడం అనేది ఒకరి మేలు కోసం మరొకరు నిబద్ధత కలిగియుండడం. మనం ఒకరికొకరు సేవ చేయడానికి, ఒకరి కోసం మరొకరు త్యాగం చేయడానికి మరియు మనం కలిసి క్రీస్తును అనుసరిస్తున్నప్పుడు ఎటువంటి విషయాలు కూడా మనల్ని విభజించకుండా ఉండటానికి సిద్ధంగా ఉన్నామని దీని అర్థం. ప్రేమపూర్వక జీవితాన్ని గడపడం అంటే, మీరు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతారు, లేదా మీరు మీ ఆలోచనల శక్తిని ఎక్కడ పెట్టుబడి పెడతారు అనే విషయాలతో ఉద్దేశపూర్వకంగా ఉండాలి.

మీరు ఆచరణలో పెట్టగల కొన్ని ఆచరణాత్మక మార్గాలు, మన సంఘంలోని కొత్త వ్యక్తులతో సంభాషించడానికి సమయాన్ని వెచ్చించడం, క్రీస్తు శరీరంలో ఒకరికొకరు సేవ చేయడం మరియు ప్రార్థించడంలో సహాయపడుతూ, సంఘంలో ఏదైనా అవసరాలు ఉన్నాయో తెలుసుకోవడం మొదలగునవి మరెన్నో. ఆత్మీయ వరాలను కోరుకునే విషయానికి వస్తే; మీరు దేవుని దయ మరియు ప్రేమ యొక్క వాహికగా మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాలకు మిమ్మల్ని నడిపించమని మీరు దేవుని కోసం ప్రార్థించవచ్చు. 

సంఘంగా మనం కూడుకున్నప్పుడు మనలో దాగి యున్న ఆత్మీయ వరాలను తోటి విశ్వాసులకు తోడ్పడే ఉద్దేశాలు కలిగియుండేలా వినియోగించాలి. యేసుతో మీ సంబంధం విశ్వాసంలో మీ వృద్ధికి సంబంధించినది, అదే  మీ తోటి విశ్వాసిని క్రీస్తు స్వారూప్యంలోనికి నడిపిస్తుంది. ఆమెన్.

https://youtu.be/wCgIJa3zFKY

Way of Love

1 Corinthians 14:1 - Follow the way of love and eagerly desire spiritual gifts, especially the gift of prophecy.

To pursue love means that we put ourselves in places and spaces where we can grow in doing good for one another. Love is more than an emotional feeling; to love is a commitment to one another-s good. It means that we’re willing to serve each other, sacrifice for one another and to not allow secondary things divide us as we follow Christ together. To live a loving life is to be purposeful with who you spend time with, where you invest your energy and how you use your resources. 

Some practical ways you can put into practice would be to spend time interacting with new people in the church community, find out what needs are in the church that you can help serve and be praying for one another in the body of Christ. When it comes to desiring the spiritual gifts; you can pray for God to direct you to opportunities where you can be used by him as a conduit of his grace and love. 

Our desire when we gather for worship should be to purse love and to desire the spiritual gifts for the purpose of having something to contribute to one another’s faith. Your relationship with Jesus is about your growth in faith, as well as your fellow member’s growth into Christlikeness. Amen.

https://youtu.be/w7N4yMWIZTs