ప్రార్ధన అనేది ఒక సూత్రము, కాదు అది దేవునితో సంభాషణ. అయితే కొన్ని సార్లు మన ప్రార్ధనసమయాన్ని నూతనపరచుకోవటం కొరకు మనమొక “పద్దతిని” ఉపయోగించవలసిన అవసరం ఉంది. కీర్తనలతో లేదా వాక్యభాగాలతో లేదా ప్రభువు మనకు నేర్పిన ప్రార్ధన మాదిరిగా, లేదా ఆరాధనా, పశ్చాత్తాపం, కృతజ్ఞత
మరియు విజ్ఞాపనా పద్దతిలో మనం ప్రార్ధన చెయ్యవచ్చు. పరిశుద్ధ గ్రంథంలోని అనేక లేఖన భా
గాలు ఇతురులకొరకు ప్రార్ధన చేయమని ప్రోత్సాహిస్తుంది. ఇతరులకోరకు ప్రార్ధించుటలో మార్గదర్శకంగా ఉపయోగపడే ఈ “ఐదు వేళ్ళ ప్రార్ధన” నాకు సహాయపడినట్టు మీకును సహాయ పడుతుందని ఉద్దేశిస్తున్నాను.
ఈ “ఐదు వేళ్ళ ప్రార్ధన” ఐదు అంశాల ప్రార్ధనను సూచిస్తుంది. మన చేతులను ముడిచినప్పుడు దగ్గరగా ఉండేది బొటనవేలు. కాబట్టి, మీరు ప్రేమించే వారి కొరకు, సన్నిహితులకు, శ్రేయోభిలాశులకొరకు ప్రార్ధన చేద్దాం (
ఫిలిప్పీ 1:3-5). రెండవదిగా, చూపుడు వ్రేలు, అది “చూపిస్తుంది”. కాబట్టి, మనకు బోధించేవారి కొరకు, దైవ సేవకులకొరకు, ఉపదేశకులకొరకు, సండేస్కూలు టీచర్స్ కొరకు ప్రార్ధన చేద్దాం (1 థెస్స 5:25). మూడవ వ్రేలు
అన్నిటికన్నా పొడవైనది. కాబట్టి నీ పై అధికారులుగా ఉన్నవారి కొరకు – అనగా మన దేశము లేదా ప్రాంతీయ నాయకులకోరకు,
మరియు మనం పని చేసే స్థలంలో ఉన్న అధికారులకొరకు, యజమానులుగా ఉన్నవారి కొరకు ప్రార్ధంచమని గుర్తుచేస్తుంది. (1
తిమోతి 2:1-2). నాల్గవ వేలు సాధారణంగా బలహీనంగా ఉంటుంది. కష్టాల్లో ఉన్నవారికొరకు లేదా శ్రమ పడుతున్న వారి కొరకు ప్రార్ధన చేద్దాం (యాకొబు 5:13-16). చివరిగా ఐదవ వేలు, మన చిటికన వేలు. ఈ వేలు దేవునితో మన వ్యక్తిగత స్థితిని జ్ఞాపకము చేస్తుంది. దేవుని గొప్పతనం ముందు మన అల్పత్వాన్ని గుర్తుచేసి, అయన ముందు తగ్గించుకోమని సూచిస్తుంది. మనకు కావలసిన ప్రతి అవసరతలను ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకొనుటకు సహాయపడుతుంది. (
ఫిలిప్పీ 4:6-19).
ప్రార్ధనలో మనం ఏ పద్దతిని పాటించినా, మనం మాట్లాడేది మన పరలోకపు తండ్రితోనే కదా. ప్రార్ధనలో ప్
రాముఖ్యమైనది మన మాటలు కాదు మన హృదయ స్థితి. మన మనసులో ఏముందో అయన వినాలనుకుంటున్నాడు. ప్రార్ధిద్దాం ప్రతిఫలాన్ని ఆశిద్దాం. ఆమెన్.