సువార్త నిమిత్తం క్రీస్తు హతసాక్షి - జెలోతే అనబడిన – సీమోను


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days - Day 8 
సువార్త నిమిత్తం క్రీస్తు హతసాక్షి - జెలోతే అనబడిన – సీమోను

జెలోతే అనబడిన సీమోను, కొత్త నిబంధన గ్రంధంలో తరచుగా పట్టించుకోని పేరు. అయినప్పటికీ, పన్నెండు మందిలో అతనిని చేర్చుకోవడం యేసు పట్ల ఆయనకున్న భక్తిని తెలియజేస్తుంది.
రోమీయుల పాలనకు వ్యతిరేకంగా, ఒక బలమైన ప్రసిద్ధి చెందిన ఉద్వేగభరితమైన యూదా  జాతీయవాదుల సమూహం, జెలోతే అనబడిన సీమోను అట్టి ఉద్యమంలో భాగమై ఉండవచ్చని చరిత్రలో గ్రహించగలం. 

తన కాలంలోని గందరగోళం మరియు తిరుగుబాట్ల మధ్య యేసు అనుచరుడిగా మారడానికి సీమోను ధైర్యంగా అడుగులు ముందుకు వేసాడు. ఆ దినాలలో రాజకీయ సామాజిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, నిజమైన రాజు మెస్సీయగా యేసుపై సీమోను యొక్క అచంచలమైన విశ్వాసం భూసంబంధమైన విధేయతలను నమ్మకాలను అధిగమించింది.

ఇతర అపొస్తలులతో పోలిస్తే జెలోతే అనబడిన సీమోను సువార్త విషయంలో ప్రముఖమైన ఉనికిని కలిగి ఉండకపోయినప్పటికీ, యేసు పట్ల అతని అచంచలమైన నిబద్ధత, సువార్తను వ్యాప్తి చేయడంలో అతని పాత్ర కాదనలేనిది. ఇతర అపొస్తలులతో పాటు, సీమోను - యేసు యొక్క అద్భుతాలను చూశాడు, అతని బోధనలను గ్రహించాడు మరియు వ్యక్తిగతంగా అతని అనంతమైన ప్రేమను అనుభవించాడు. 

మత్తయి 16: 24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను. ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో తన జీవితంలో తీసుకున్న తీర్మానం ఐగుప్తు ప్రాంతాలలో సువార్త ప్రకటించాడు, క్రీ.శ. 65లో లేబానోను ప్రాంతంలో, అతను రంపంతో సగానికి నరికి చంపబడ్డాడు.

ప్రియ స్నేహితులారా, సీమోను జీవితం మనలోని విధేయతలు మరియు విలువలను ప్రతిబింబించేలా చేస్తుంది. యేసును హృదయపూర్వకంగా అనుసరించడానికి భూసంబంధమైన ప్రాచిన స్థితిని విడిచిపెట్టగలమా? జనాదరణ పొందడం కొరకు విభిన్న మార్గాలను వెతకడం కంటే, సీమోను వలే దేవుని రాజ్యాన్ని పూర్తిగా స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా?

నేనంటాను, యేసు యొక్క నిజమైన అనుచరుడిగా ఉండటం వలన, తీవ్రమైన విధేయత మరియు మన స్వంత నిర్ణయాలను, ఆయనకు సమర్పించడానికి, సంసిద్ధత అవసరమని, సీమోను జీవితం మనకు గుర్తుచేస్తుంది. మనం, సీమోను వలే, మన స్వంత కోరికలు, లక్ష్యాలు మరియు నమ్మకాలను - యేసుకు లోబడి, ఆయన ఆధిపత్యాన్ని మరియు మన జీవితాల కోసం ఆయన దోషరహితమైన ప్రణాళికలను విశ్వసిస్తూ అన్నింటినీ వదులుకోవడానికి సిద్ధంగా ఉందాం. అట్టి ఆలోచనలు దేవుడు మనందరికీ దయజేయును గాక. ఆమెన్. 

Telugu Audio: https://youtu.be/2dZ_wv5a_PQ
40 Days - Day 8.
Simon the Zealot: Embracing Kingdom Beyond Earthly Commitments

 "Jesus said to him, -If anyone would come after me, let him deny himself and take up his cross and follow me.-" - Matthew 16:24

Simon, also referred to as Simon the Cananaean, is a name often overlooked among the New Testament apostles. Yet, his inclusion among the twelve speaks volumes of his devotion to Jesus. 

It has been speculated that Simon may have been a part of the Zealot movement, a group of passionate Jewish nationalists known for their strong resistance against Roman rule. If this is true, Simon-s journey alongside Jesus would have required a dramatic transformation of his beliefs and values.

Simon-s bold choice to become a follower of Jesus amidst the chaos and upheaval of his time speaks volumes about his openness to a new reign—one that revolves around the person of Jesus Christ rather than earthly power or principles. Despite the political and social pressures of his era, Simon-s unwavering faith in Jesus as the true King and Messiah surpassed any earthly loyalties and beliefs. 

Although Simon may not have a prominent presence in the Gospel accounts compared to some of the other apostles, his unwavering commitment to Jesus and his role in spreading the Good News are undeniably significant. Along with the other apostles, Simon witnessed Jesus- miracles, absorbed His teachings, and personally experienced His boundless love. While on a mission journey for the Gospel in Egypt, later during 65 AD in Lebanon, he was martyred by being cut in half with a saw,

Simon-s journey prompts us to reflect on our own loyalties and values. Will we forsake our predetermined beliefs and earthly pursuits in order to wholeheartedly follow Jesus? Are we ready to fully embrace His kingdom and His principles, even if it means going against the popular current? 

Simon-s life reminds us that being a true follower of Jesus demands a radical obedience and a readiness to submit our own agendas to His. May we, like Simon, be willing to lay down everything - our own desires, goals, and convictions - in submission to Jesus, trusting in His supremacy and His flawless blueprint for our lives.

English Audio: https://youtu.be/Urg3yprnFa0

SajeevaVahini.com