సందేహించేవాడు హతసాక్షి అయ్యాడు – తోమా


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days - Day 9 
సందేహించేవాడు హతసాక్షి అయ్యాడు – తోమా

"సందేహించువాడు" అని కూడా పిలువబడే తోమా, తన స్ఫూర్తిదాయకమైన విశ్వాస ప్రయాణంతో విశ్వాసులపై శాశ్వతమైన ముద్ర వేశారు. యేసు పునరుత్థానం తర్వాత అతని సందేహం యొక్క క్షణం మన మనస్సులలో నిలిచిపోయినప్పటికీ, తోమా కథ సందేహంతో పోరాటం మరియక్రీస్తు యొక్క అపరిమితమైన కృప యొక్క శక్తివంతమైన గుర్తింపు.

సువార్తలలో, తోమా యేసు యొక్క నమ్మకమైన ఉద్వేగభరితమైన శిష్యుడిగా చిత్రీకరించబడ్డాడు. యూదయకు తిరిగి రావాలని యేసు తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా, " ఆయనతో కూడ చనిపోవుటకు మనమును వెళ్లుదము" (యోహాను 11:16) అనే మాటల ద్వారా ఎటువంటి ప్రమాదాలు తెలెత్తినప్పటికీ అతను మరణం వరకు కూడా యేసును అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాడని గ్రహించగలం.

యోహాను 20:29 యేసు - నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను. తోమా జీవితంలో, యేసు పట్ల అతనికి బలమైన విశ్వాసం ఉన్నప్పటికీ, అతను యేసును ప్రత్యక్షంగా చూసి ఆయన గాయాలను తాకే వరకు పునరుత్థానాన్ని పూర్తిగా విశ్వసించాలనుకున్నాడు. అతని అనిశ్చితులు విశ్వాసం లేకపోవడం వల్ల కాదు, భౌతిక సాక్ష్యం కోసం ఆరాటపడటం వల్ల కాదు. అయినప్పటికీ, యేసు అతనికి కనిపించి, అతని గాయాలను తాకమని ఆహ్వానించినప్పుడు, తోమా విశ్వాసం యొక్క శక్తివంతమైన ఒప్పుకోలుతో ప్రతిస్పందిస్తూ, "నా ప్రభువా, నా దేవా!" (యోహాను 20:28) అని అన్నాడు. తోమా, క్రీ.శ 52లో భారతదేశానికి మొట్టమొదటి మిషనరీగా, కేరళ తీర ప్రాంతంలో అడుగులు పెట్టి, నాడు నేడు మనల్ని చీకటి నుండి వెలుగుదిశగా నడిపించిన తోమా,  క్రీ.శ 72 జూలై 3న భారతదేశంలోని, నేను నివసిస్తున్న మద్రాసులోని “సెయింట్ థామస్ మౌంట్” వద్ద తోమా ఈటెతో చంపబడ్డాడు. తన భౌతికగాయాన్ని మైలాపూర్‌ అనే ప్రాంతంలో సమాధి చేయబడింది.

నేనంటాను, సందేహాల క్షణాల్లో, కంటికి కనిపించని విశ్వాసంపై విశ్వసించాలంటే, కీస్తు శరీరంలోని గాయాలను తాకిన అనుభవం కావలి. తోమా కథ మన విశ్వాస ప్రయాణంలో సందేహం నిజమైన అంశం అని ఒక పదునైన ఆలోచనదిశగా పనిచేస్తుంది. ఇది మనలో బలహీనత కాదు కానీ, వృద్ధికి మరియు లోతైన అవగాహనకు అవకాశంగానే పరిగణించాలి. తోమా తన అనిశ్చితి స్థితిలో యేసును కలుసుకున్నట్లే, అతను నమ్మడానికి అవసరమైన సాక్ష్యాలను అతనికి అందించినట్లే, మనలో ప్రతి ఒక్కరినీ మన సందేహాలలో కూడా కలుసుకుంటాడు, తన నమ్మకత్వంలో కృపను దయజేస్తాడు.

ప్రియ స్నేహితులారా, తోమా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, మనం కూడా మన సందేహాలు మరియు ప్రశ్నలతో, ఆయన ఆహ్వానించే పిలుపుకు ప్రతిస్పంచింది మన విశ్వాసాన్ని బలపరచుకోవాలని ఆకాంక్షిస్తూ అడుగులు ముందుకు వేద్దాం. మన సందేహాల మధ్య మనం క్రీస్తును ఎదుర్కొన్నప్పుడు, తోమా వలే, మనము కూడా మనస్పూర్తిగా లొంగిపోయి ప్రతిస్పందిస్తాము, ఆయనను మన ప్రభువుగా మన దేవుడిగా అంగీకరిస్తాము. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/iRlnCE3EmxM

40 Days - Day 9.
Thomas: From Doubt to Declaration - Showcasing Faith in the Face of Uncertainty

"Jesus said to him, -Have you believed because you have seen me? Blessed are those who have not seen and yet have believed.-" - John 20:29

Thomas, also known as "Doubting Thomas," has left a lasting impression on believers with his inspiring journey of faith. Although his moment of doubt after Jesus- resurrection stays in our minds, Thomas- story is a powerful reminder of the struggle with doubt and the limitless grace of Christ.

Throughout the Gospels, Thomas is portrayed as a loyal and passionate disciple of Jesus. He was willing to follow Jesus even to the point of death, as evidenced by his famous declaration, "Let us also go, that we may die with him" (John 11:16), in response to Jesus- decision to return to Judea despite the danger.

Despite his strong devotion to Jesus during His time on earth, Thomas faced difficulty in fully believing in the resurrection until he was able to witness Jesus firsthand. His uncertainties did not stem from a lack of trust, but rather from a yearning for physical evidence. Yet, when Jesus appeared to him and invited him to touch His wounds, Thomas responded with a powerful confession of faith, declaring, "My Lord and my God!" (John 20:28). In 52AD Thomas stepped in the cost of Kerala as the first Missionary to India. Thomas was killed with a spear at St. Thomas Mount in Chennai, India on 3 July in AD 72, and his body was interred in Mylapore, Chennai, India.

Thomas- story serves as a poignant reminder that doubt is a natural component of our faith journey. It should not be viewed as a source of shame, but rather as an opportunity for growth and deeper understanding. Just as Jesus met Thomas in his state of uncertainty and provided him with the evidence he needed to believe, He meets each one of us in our doubts, offering reassurance and grace. 
In light of Thomas- experience, let us also come before Jesus with our doubts and questions, confident in His welcoming nature and longing for us to strengthen our faith. And when we encounter Jesus amidst our doubts, may we, like Thomas, respond with wholehearted surrender and worship, acknowledging Him as our Lord and our God. Amen

English Audio:https://youtu.be/Em7eeZZI9mk

SajeevaVahini.com