దేవునితో సమీపంగా ఉంటేనే నెమ్మది | God’s Presence Brings Peace


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

కీర్తన 34:18 - విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.

దేవునితో సమీపంగా ఉంటేనే నెమ్మది

మన జీవితం కొన్ని సార్లు భారంగా ఉంటుంది. కొన్ని సార్లు మన హృదయం పగిలిపోయినట్లు, లోలోతుల్లో బరువెక్కిన సందర్భాలు కూడా ఉంటాయు. కీర్తన 34:18 “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.” ఈ మాటను బట్టి మన లోతైన బాధలో మనం ఒంటరిగా లేమని మరలా గుర్తుచేస్తుంది. దేవుడు మనకు దూరంగా లేడు – అత్యంత సమీపంగా ఉన్నాడు. ఆయన మనకు సమీపంగా ఉంటేనే మనము బలం మరియు ఉత్సాహం పొందుకోవచ్చు.
గడచిన దినాలలో మనం కోల్పోయినవి మన కథకు ముగింపు కాదు. అంగలార్పును నాట్యముగా మార్చగల సమర్ధుడైన దేవుని కౌగిలిలో అట్టి ఆనందాన్ని అనుభవించడానికి ఈ వాక్యం ఆహ్వానం. కాబట్టి, ఈ రోజు మీరు అధైర్యంగా అనిపిస్తే, గుర్తుంచుకోండి: ఏడ్చిన ప్రతి కన్నీరు కనిపించింది, ప్రతి మూలుగు వినబడింది దేవుని ప్రేమ మిమ్మల్ని విడిచి పోలేదు.
ఇప్పుడున్న స్థితి ఓటమి కాదు; మనల్ని రక్షించగల దేవునితో లోతైన అనుబంధమే ఇది ప్రారంభ స్థితి. మన నలిగినా స్థితిని ప్రయోజనంగా మార్చడానికి దేవుణ్ణి ఈరోజే మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం. ఆమెన్.

Quote: జీవితం యొక్క గందరగోళంలో కూడా, దేవుని సన్నిధి మనకు శాంతి మరియు స్థిరత్వానికి హామీ ఇస్తుంది. ఆయన సాంగత్యం మన హృదయాలను ప్రశాంతపరుస్తుంది.

https://youtube.com/shorts/cHUQL-A4Tns

Psalm 34:18 - The LORD is close to the broken-hearted and saves those who are crushed in spirit.

God’s Presence Brings Peace

Life can be overwhelming, and there are moments when our hearts feel shattered, our spirits weighed down. Psalm 34:18 “The LORD is close to the broken-hearted and saves those who are crushed in spirit”. This verse reminds us that in our deepest pain, we are not alone. God is not distant or indifferent—He is close. His nearness is not passive; it’s active, bringing healing and restoration.
Your brokenness is not the end of your story. It’s an invitation to experience the gentle embrace of a God who specializes in making beauty out of ashes. So, if you feel crushed today, remember: every tear you’ve cried has been seen, every groan heard, and His love is moving toward you even now.
Take heart. Brokenness is not your defeat; it’s the starting point for a deeper connection with the One who saves. Allow Him to transform your pain into purpose. Amen.

Quote: Even in the chaos of life, God’s presence assures us of peace and stability. His companionship calms our hearts.