ఈ ప్రశ్నలు మౌళికమైన అపార్థము పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలో బహిర్గతమైన దేవుని స్వభావము విషయమై ఈ ఆలోచనను మరో విధంగా వ్యక్తపరుస్తూ ప్రజలు పలికే మాటలు ఏవనగా పాత నిబంధనలో దేవుడు ఉగ్రత కలిగినవాడు. అయితే క్రొత్త నిబంధనలోనున్న దేవుడు ప్రేమకలిగిన దేవుడు. బైబిలు దేవుడు తన్ను తాను చారిత్రక సంఘటనలద్వార, మనుష్యులతో తనకున్న సంభంధంద్వార క్రమక్రమేణా తన్నుతాను బయలుపరచుకుంటున్నాడు అన్న వాస్తవం. దేవుడు ఏమయి యున్నాడు అన్న అపోహకు పాత నిబంధనలోనున్న దేవుడ్ని, క్రొత్త నిబంధనలోనున్న దేవుడ్ని పోల్చులోడానికి దోహదపడ్తుంది. ఒక వ్యక్తి పాత, క్రొత్త నిబంధనలను చదివినట్లయితే దేవుని వ్యత్యాసములేదని ఆయన ప్రేమ ఉగ్రతలు రెండింటిలోను బహిర్గతమౌవుతున్నాయని అర్థమవుతుంది.
ఉదాహరణకు, పాత నిబంధనలోని దేవుడు కనికరము, దయ మరియు కృపాసత్యములుగలవాడు, కోపించుటకు నిదానించువాడు, విస్తారమైన ప్రేమ, నమ్మకత్వములుగలవాడు, (నిర్గమకాండం 34:6; సంఖ్యాకాండం 14:18; ద్వితియోపదేశకాండం 4:31; నెహేమ్యా 9:17; కీర్తనలు 86:5, 15; 108:4; 145:8; యోవేలు 2:13) మరియు కృపాతిశయము గలవాడని ప్రకటిస్తుంది. అయితే క్రొత్త నిబంధనలో ఆయన ప్రేమ మరియు దయ పరిపూర్ణముగా వెళ్ళడయ్యేయనటానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగ ఆయన తన అద్వీతీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవముపొందునట్లు ఆయనను అనుగ్రహించెను (యోహాను 3:16). పాత నిబంధన అంతటిలో దేవుడు ఇశ్రాయేలీయులను ఒక ప్రేమకలిగిన తండ్రి తన బిడ్డలతో వ్యవహరించునట్లు వ్యవహరించాడు. అయితే వారు తమ ఇష్టానుసారముగా పాపముచేసి విగ్రహాలను ఆరాధించినపుడు దేవుడు వారిని శిక్షించేవాడు. అయితే ప్రతి సారి కూడ వారి విగ్రహారాధనవిషయమై పశ్చాత్తాపపడినపుడు వారిని విమోచించేవాడు. క్రొత్త నిబంధనలో క్రైస్తవులతో దేవుడు ఇదేవిధంగా వ్యవహరించేవాడు. ఉదాహరణకు హెబ్రీయులకు 12:6 ఈ విధంగా చెప్తుంది, ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును.
ఇదేవిధంగా పాత నిబంధనంతటిలో కూడ పాపముపై దేవునియొక్క తీర్పును ఉగ్రతయు చూపబడటం గమనించగలం. అదేవిధంగా క్రొత్త నిబంధనలో దేవునియొక్క ఉగ్రత దుర్నీతిచేత సత్యము అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను దుర్నీతిమీదను బయలుపరుబడుచున్నది. కాబట్టి స్పష్టముగా పాత నిబంధనలోనున్నటువంటి దేవుడు క్రొత్త నిబంధనలోనున్న దేవుని కంటే వ్యత్యాసం ఏమిలేదు. దేవుడు స్వతహాగా మార్పులేనివాడు. కొన్ని కొన్ని వాక్యభాగాలలో పరిస్థితులును బట్టి ఆయన గుణలక్షణములు ప్రస్ఫుటముగా అగుపడునప్పటికి దేవుడు స్వతహాగా మార్పులేనివాడు.
మనము బైబిలు చదివి ధ్యానించే కొద్ది దేవుడు పాత, క్రొత్త నిబంధనలో ఒకే రీతిగా నున్నాడని స్పష్టమవుతుంది. బైబిలు 66 వ్యక్తిగత పుస్తకాలు రెండు (సుమారు మూడు) ఖండాలలో రచించినప్పటికి, మూడు భాషలలో, సుమారు 1500 సంవత్సారాలు, 40కంటే ఎక్కువమంది రచయితలున్నప్పటికి ఆది నుండి చివరవరకు పరస్పరము, వ్యత్యాసములేని ఒకే పుస్తకముగానున్నది. యిందులో ప్రేమ, దయ, నీతికలిగినటువంటి దేవుడు పాపములోనున్నటువంటి మనుష్యులతో ఏ విధంగా మసలుతాడో చూడగలుగుతాం. బైబిలు దేవుడు మానవులకు నిజంగా రాసిన ప్రేమ లేఖ. స్పష్టముగా దేవుని దయ మరియు ముఖ్యముగా మానావాళిపట్ల లేఖనములో అగుపడుచున్నది. బైబిలు అంతటిలో దేవుడు ప్రేమతో దయతో ప్రజలు తనతో ప్రత్యేక సంభంధము కలిగియుండాలని ఆహ్వానిస్తునాడు. ఈ ఆహ్వానానికి మనుష్యులు యోగ్యులనికాదు, గాని దేవుడు కృపగలవాడు, దయగలిగినవాడు,కోపించుటకు నిదానించువాడు, దీర్ఘశాంతపరుడు, కృపాతిశయముకలిగినవాడు కాబట్టి అంతేకాదు ఆయన పరిశుధ్ధుడు, నీతిమంతుడైన దేవుడుగా మనము చూస్తున్నాం. ఆయన మాటకు అవిధేయుడై, ఆయనను ఆరాధింపక, తాము సృష్టమును చూస్తూ సృష్టమునే దేవుళ్ళుగా ఆరాధించే వాళ్ళని తీర్పుతీరుస్తాడు (రోమా మొదటి అధ్యాయము).
దేవుడు నీతిమంతుడు, పరిశుధ్ధుడు కాబట్టి ప్రతీపాపము- భూత, వర్తమాన, భవిష్యత్తుకాలములలోనివి తీర్పులోనికి తీసుకురావాలి. అయితే
దేవుడు తన అనంతమైన ప్రేమలో పాపమునకు ప్రాయశ్చిత్తముననుగ్రహించి, పాపియైన మానవుడ్ని ఉగ్రతమార్గమునుండి తప్పించాడు. ఈ అధ్భుతసత్యాన్ని 1
యోహాను 4:10 మనము దేవుని ప్రేమించితమని కాదు; తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. పాత నిబంధనలో బలుల ద్వారా పాపమునకు ప్రాయశ్చిత్తము అనుగ్రహించాడు.అయితే ఈ బలుల తాత్కాలికమైనవే.
మరియు
క్రీస్తుయొక్క రాకడకు మానవుల పాపమునకు ప్రాయశ్చిత్తార్థమై ఆయన సిలువపై పొందేమరణానికి సూచనప్రాయముగా నున్నది. పాత నిబంధనలో దర్శనాత్మకంగా వున్న పరిపూర్ణమైనదేవుని ప్రేమ.
యేసుక్రీస్తు ని ఈ లోకములో పంపించటము ద్వారా నూతన నిబంధనలో ప్రత్యక్షమవుతుంది. పాత
మరియు క్రొత్త నిబంధనలు మన రక్షాణార్థమై జ్ఞానము కలిగించుట విషయమై అనుగ్రహించబడ్డాయి(2
తిమోతి 3:15). రెండు నిబందనలు ధ్యానించినట్లయితే ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనా గమనమువలన కలుగు ఏ ఛాయయైనను లేదు (
యాకోబు 1:17).