పరిచర్యను గూర్చిన తలంపులు :
మత్తయి 20:28 - మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు వచ్చెను".
మనం జీవితంలో మనం చేసే గొప్ప పనుల్లో ఒకటి ఇతరులను గూర్చి ఆలోచించడం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనే విషయం కన్నా ముందు ఇతరులను గూర్చి ఆలోచించడంలోనే మన గొప్పతనం ఆధారపడి ఉంటుంది. మనమెలాంటి శ్రమలలో ఉన్నా తోటివారికి సహాయం చేసేందుకు మనకు అవకాశం ఉంటుంది. గనుక మనం నిస్వార్థంగా ఉండాలి. ఈలాటి మనస్తత్వం మనం కలిగియుండాలని మనం పుట్టకముందే ఉద్దేశించాడు. తోటివారి గురించి ఆలోచించినప్పుడు దేవుడు మనయందు కలిగిన ఉద్దేశాన్ని మనం పోగొట్టుకోలేము. నీ జీవితం ఎంత ప్రతికూలంగా ఉన్నా నిన్ను నీవు పక్కన పెట్టి సహాయము చేసినప్పుడు అది నీ జీవితానికి సార్థకతను తీసుకువస్తుంది.
ప్రార్థనా మనవి:
ప్రియమైన తండ్రి!!! తోటివారిని ప్రేమించి వారికి సహాయం చేసే గుణమును మాకు మాదిరిగా చూపించినందుకు నీకు వందనములు. మేము అటువంటి స్వభావమును కలిగియుండుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.
Serving Thoughts:
Matthew 20:28 - “Son of Man did not come to be served, but to serve.” I think one of the great things we can do in life is think about others. How much greater are we when we put others before our circumstances—regardless of what those circumstances are? It's been said that no matter how bad things are for you personally, there’s always an opportunity to help someone else get ahead. It’s also been said that the best way up is to first get down. We must think in terms of being selfless rather than selfish. This mindset was what God had purposed before we were even born. You could say then, if we’re not being "others" minded, we’re missing out on what God had planned from the very beginning. When you set aside yourself, despite how adverse your life might seem, it will change the very nature of your life.
Talk to The King:
Lord Jesus, thank you for the way You showed an example of serving, humbling and putting others before ourselves in your life on earth. Help me follow You and shine as Your child lifting many. In Jesus name, Amen.