తెగువగల తలంపులు:
1 సమూయేలు 17:45 - "సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను".
పరిశుద్ధగ్రంథములో బలిష్టమైన గొలియాతునకు ఎదురు వెళ్ళిన లేతైన దావీదును మనము చూస్తాము. అందరూ దావీదునకు అంత శక్తి ఉందా అని చూసారుకానీ దావీదు సర్వోన్నతుడైన దేవునివైపు చూచాడు. మనలో కూడా చాలామంది శ్రమలను చూస్తాము కానీ యేసుని చూడము. శ్రమలలో ఆయనను చూచినప్పుడు మనము శ్రమలకు ఎదురెళ్ళగలము. గనుక దావీదు-గొలియాతు గాథ నుండి మనము ఈ సత్యమును గ్రహించాలి. ఎంతటి మహా శ్రమ కలిగినా సర్వోన్నతుడైన దేవుని శక్తి యందు నమ్మికయుంచితే విజయము మనదే.
ప్రార్థనా మనవి:
ప్రియమైన తండ్రి!!! దావీదు ధైర్యమును మాకు మాదిరిగా చూపినందుకు నీకు వందనములు. దావీదు వలె ధైర్యముగా శతృవుకు ఎదురెళ్ళే తెగువను మాకు అనుగ్రహించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.
Brave Thoughts:
1 Samuel 17:45- “ I come against you in the name of the LORD Almighty.” Here we see a young lad, David go against the mighty Goliath in faith. Everybody else saw David and his stature while David looked at the God Almighty. We too sometimes are like the people around and underestimate power of God"s people. We look at problems like people looked at Goliath. But today take inspiration from the faith the young David had to trust in God who is a deliverer. Stay brave no matter how big the problem might look. God is much more powerful and able.
Talk to The King:
Father God, I thank You for the example of David. Help me to be bold like him and be fearless I"m every troublesome issue. Fill me with a faithful Spirit like David. In Jesus name, I pray, Amen.