(యెహోవా ఇల్లు కట్టించనియెడల … కీర్తనలు 127:1)
1:27 ఆది - స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
1:27 లూకా – యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక (మరియ)
1:27 I దిన – అబ్రాహాము అని పేరు పెట్టబడిన అబ్రాము.
12:7 సంఖ్యా – నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు (మోషే)
12:7 ద్వితీ – మీ దేవుడైన యెహోవా ... మీకు కలుగ జేసిన కుటుంబములు.
12:7 సామె – నీతిమంతుల ఇళ్ళు నిలుచును.
I పేతురు 2:7 – ఇళ్ళు కట్టువారు నిషేధించిన ... తలరాయి.
127 – శారా బ్రదికిన ఏండ్లు.
127 – ఎస్తేరు కాలములో సంస్థానములు.
ఆదికాండం లో ఆది దంపతుల ఆది కుటుంబమే 1:27. సజీవమైన రాళ్లుగా కట్టబడిన ఆ ప్రధమ కుటుంబం పరిశుద్ధ గ్రంథంలో ఎంత క్రమంగా లిఖించబడిందో గమనించదగ్గ విషయం. 1 దేవాది దేవుని సూచిస్తుండగానూ, 2 మొదటి కుటుంబాన్ని సూచిస్తుండగానూ, 7 సృష్టి సంపూర్ణతను తెలుపుతుండగానూ. ఈ క్రమం ఎలా సాగిందో గమనించాలి.
3 దేవుని త్రిత్వానికి, 7 పరిశుద్ధతకు, 10 నియమావళికి మరియు 666 సాతాను సంపాధ్యముకు ఎలా ప్రత్యేక సంఖ్యలుగా ఉన్నాయో అలాగే పరిశుద్ధ గ్రంథం మొదటి నుండి చివరి వరకు కుటుంబ సంఖ్య 127గా ఉన్నట్లు బయలుపరచబడింది.
పై విషయాలు గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో కూర్చబడిన ప్రతి పుస్తకానికి, ప్రతి అధ్యాయానికి, ప్రతి వచనానికి ఒక క్రమం ఉంది. అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని చదవవలసిన క్రమం కూడా ఉంది. ప్రియ చదువరీ, పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన నీ కుటుంబానికి యే క్రమం ఉంది? ఉదయం కుటుంబ ప్రార్ధన ఉందా? రాత్రి కుటుంబ ప్రార్ధన ఉందా? సంఘ కార్యక్రమాలకు కుటుంబంగా వెళుతున్నావా?... అలా ఉంటేనే కదా అది యెహోవా కట్టిన ఇల్లు.