మొఱ్ఱపెట్టు తలంపులు:
యిర్మీయా 33:3 - "నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును".
దేవునితో సుస్పష్టమైన, ఖచ్చితమైన సన్నిధిని కలిగియుండడం చాలా సవాళ్ళతో కూడుకొన్నది. ఎందుకంటే మనం మనం చెప్పేదానికి ఆచరించేదానికి వ్యత్యాసాన్ని గ్రహించడంలో మరియు దేవుని వాగ్దానములను అర్థం చేసుకోవడానికి వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి మధ్య తేడాను గ్రహించుటలో
విఫలమవుతున్నాం. నిజాయితీగల నమ్మకముగల ప్రార్థనా జీవితం మనకు ఎంతో అవసరం. ఆ ప్రార్థనా జీవితాన్ని సరిగా కలిగియుండుక పోవడానికి కారణం మనం అనుదినం ప్రార్థించలేకపోవడం. మనం అనుదినం వాక్యమును ధ్యానించము, ప్రార్థించమూ కానీ మన భావావేశాలతో మనలను మనమే తీర్పు తీర్చుకుంటాము. అది సరైనది కాదు గనుక నేడే అటువంటి జీవితాన్ని విడిచి దేవునితో సన్నిధిని కలిగియుండుటకు మొదట ఆయనకు చెవియొగ్గుటకు నిశ్చయించుకొందుము.
ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!! నా ప్రతీ పరిస్థితులో నీయందు నమ్మికయుంచి నీ చిత్తానుసారముగా నడుచుకొనుటకు నీ అనుదినము సన్నిధిని కలిగియుండుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.
Communicating Thoughts:
Jeremiah 33:3-“Pray to me, and I will answer you. I will tell you important secrets you have never heard before.” Clear and accurate communication is challenging for all of us in the way we communicate with God. Because we fail to differentiate between what we believe and how we act, between our understanding of the promises of God and our actual experience with Him. Honest and trusted conversation with Him is essential.The reason our lack of communication with God is problematic is because we fail to communicate with Him. We don""t read our Word regularly or we don""t pray. We let our emotions judge our actions instead of God. Today let your mind be clear and start communicating with God by listening first.
Talk to The King:
Father help me communicate with You and listen to You in every situation. Let me not break that connection with You for only You can guide me right. In Jesus name, Amen.