Day 292 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను (సంఖ్యా 10:33).

దేవుడు మనకు కొన్ని అభిప్రాయాలను ఇస్తూ ఉంటాడు. అవి దేవుడు ఇచ్చినవే. అయితే వాటి గురించి అనుమానం లేకుండా వాటిని స్థిరపరచడంకోసం కొన్ని సూచనలను ఇస్తాడు.

యిర్మీయా కథ ఎంత బాగుంటుంది! అనాతోతు పొలం కొనాలని అతనికి అభిప్రాయం కలిగింది. కాని ఆ తరువాతి రోజుదాకా అతడు ఆ అభిప్రాయాన్ని కార్యరూపంలో పెట్టలేదు. అయితే అతని తండ్రివల్ల పుట్టినవాని కుమారుడొకడు వచ్చి దాన్ని కొనమని అడగడం ద్వారా యిర్మీయాలో కలిగిన ఆ అభిప్రాయాన్ని స్థిరపరిచాడు. అప్పుడు యిర్మీయా అది యెహోవా వాక్కు అని తెలుసుకున్నాడు.

దేవుడు తాను ఇచ్చిన అభిప్రాయాన్ని బలపరిచేదాకా యిర్మీయా ఊరుకున్నాడు. ఆ తరువాతనే వాస్తవాలకు అనుగుణంగా తనకు, ఇతరులకు నమ్మకం కలిగిన తరువాతనే చర్య తీసుకున్నాడు. దేవుడు ఆయన ఇష్టప్రకారం మనం నడవాలని కోరుకుంటాడు. మనం కూడా పౌలు, అతని అనుచరులు త్రోయలో చేసినట్టు, మాట్లాడే అందరి అభిప్రాయాలు విని అన్ని పరిస్థితులనుండి దేవుని పూర్తి సంకల్పాన్ని గ్రహించుకోవాలి.

దేవుని ప్రేలు ఎటువైపుకైతే చూపిస్తున్నదో అటువైపుకే ఆయన చెయ్యి మనలను నడిపిస్తుంది.

"ఇది చేస్తాను, ఇది చేయ్యను" అని నీ మనస్సులో మీమాంస పడవద్దు. దేవుడు తన మార్గాన్ని పూర్తిగా తెలియజెప్పేదాకా కనిపెట్టు. ఎటు వెళ్ళవలసిందీ స్పష్టంగా తెలిసేదాకా కదలనక్కరలేదు. అలా ఆయన చిత్తం చొప్పున నువ్వు ఉన్న చోటే ఉండిపోతే ఆ ఫలితాలన్నిటి గురించీ ఆయనే జాగ్రత్త తీసుకుంటాడు.

మనమెరుగని మార్గాల ద్వారా తన వారిని నడిపిస్తాడు.