దేవుని చిత్తానుసారముగా ప్రార్థించుము


  • Author: UFC
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

~ మనము చేసే ప్రార్థన ప్రభువు మనకు నేర్పించిన విధంగా ఉన్నాయో లేదో పరిశీలించండి. ఆయన నేర్పిన ప్రార్థనా విధానాన్ని చూద్దాం...

~ తండ్రిని ఆరాధించుట:
అన్నింటికన్నా ముఖ్యంగా మనము దేవుని స్తుతించాలి. ఆయన యొక్క మహిమను బట్టి మనకు చేసిన గొప్ప కార్యములను బట్టి ఆయనను ఆరాధించాలి.

~ దేవుని రాజ్యమును అడగాలి:
ఆయన రాజ్యమునందు విశ్వాసముంచి అనుదినం ఆయన యొక్క రాజ్యమును గురించి అడగాలి.

~ దేవుని చిత్తాన్ని, నడిపింపును అడగాలి:
ప్రతీరోజూ మనము చేసే ప్రతీ పనిలో ఆయన యొక్క చిత్తమును మరియు నడిపింపును అడగాలి.

~ మన అవసరతల గురించి ప్రార్థించాలి:
నీ అవసరతలన్నీ ఆయనకు తెలుసు గనుక ఆయన అవన్నీ తీరుస్తాడని ఆయనయందు విశ్వాసముంచాలి.

~ క్షమాపణ కోరుట:
మనము ఎవరినైనా బాధపెట్టినా, ఏదైనా తప్పు చేసినా అవి ఆయన యెదుట ఒప్పుకొని క్షమించమని వేడుకోవాలి.

~ఆత్మీయ పోరాటం:
మనము అపవాది యత్నాలను, ఆటంకాలను, ఆకర్షణలను తట్టుకొని వాటిని జయించే శక్తిని ప్రసాదించుమని ప్రార్థించాలి.

ధ్యానించు:
1 యోహాను 5:14- “ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును.”

ప్రార్థన:
పరలోక తండ్రి!! నిన్ను తృప్తిపరిచేలా ఏ విధంగా ప్రార్థించాలో మాకు నేర్పినందుకు నీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము, ఆమేన్.