పాత్రగా తయారవ్వడం వెనుకవుండే కొన్ని రహస్యాలను, స్థితిగతులను గమనిద్దాం:
మట్టిపాత్రగా తయారవ్వలంటే ముందుగా తను ఉన్న స్థలమునుండి వేరుచేయబడుతుంది. ప్రత్యేకపరచబడి, నలగగొట్టబడి, నీళ్ళలో నాని ముద్దగా ఆయ్యేంతవరకు పిసగబడుతుంది లేదా తొక్కబడుతుంది. వీటన్నిటిల్లో దాగివున్న శ్రమ కొంచెమైనదేమీ కాదు. ముద్దగా చేయబడినంత మాత్రాన్న పాత్రగా మారిపోదు కానీ పాత్రగా మలచడానికి సంసిద్దమౌతుంది.
ఇక కుమ్మరి చేతిపనికి, ఆలోచనానేర్పుతో పాత్రగా మలచబడుతుంది. కుమ్మరి తన నైపుణ్యానంతా వుపయోగించి పాత్రలను ఎంతో ఓర్పుతోనూ, నేర్పుతోను చేస్తాడు. పాత్రలో దాగివున్న తడిని పోగొట్టేందుకు ఆరబెట్టబడుతుంది. ఆరిన పాత్ర కాల్చబడుతుంది. కాల్చితీసిన తరువాత ఆ పాత్రకొచ్చిన సొగసును, పటుత్వాన్ని చూసి కుమ్మరి ఆనందిస్తాడు. ఇక ఆపాత్ర ఉపయోగకరంగా మారుతుంది.
అనుదినం నన్ను సరిచేస్తూ..నీ కొరకు ప్రయోజనకరమైన పాత్రగా చేయుము తండ్రీ. ఆమేన్.
Jer 18:6 మీరు నా చేతిలో ఉన్నారు.