ప్రార్థన కొఱకు సమయాన్ని కేటాయించుము


  • Author:
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

యెడతెగక ప్రార్థనచేయుడి; 1 థెస్సలోనికయులకు 5:17

° దేవునితో మాట్లాడ్డానికి అత్యుత్తమమైన మార్గం మరియు ఆయనతో గడిపే శ్రేష్ఠమైన సమయం ప్రార్థన ఒక్కటే.

° ప్రార్థించేటప్పుడు శూన్యంతో మాట్లాడుతున్న వింత అనుభవం ఒక్కోసారి మనకు ఎదురవుతుంది. కానీ ప్రతీసారి అలా అనిపించదు.

° మొదటిసారి మనకు అలాంటి భావన కలిగించవచ్చు. కానీ ఎడతెగక ప్రార్థించుట ద్వారా మధురమైన అనుభూతి కలుగుతుంది. మనము ఎన్నడూ లేని రీతిగా దేవుని సన్నిధి అనుభవాన్ని పొందుకోగలము.

° మనమాయనతో ఎక్కువ సమయాన్ని గడిపేకొద్దీ మనము ఆయనవలె అవుతాము. ఆయనకు చేరువయ్యే కొద్దీ ఆయన యొక్క స్వరం వినగలము.

° పార్ధించక నష్టపోయేవారు అనేకులున్నారు గాని ప్రార్థించి నష్టపోయినవారులేరు.

ప్రార్థన:
పరలోక తండ్రి!!! నీకు మరింత చేరువయి నీవలె‌ అగుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.