4:4 సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలునుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానమువచ్చి నప్పుడు వాడు అయిదేండ్లవాడు; వాని దాది వానిని ఎత్తికొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెతు.9:6 సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదుమెఫీబోషెతూ అని అతని పిలిచి నప్పుడు అతడుచిత్తము, నీ దాసుడనైన నేనున్నాననెను.9:10 కాబట్టి నీవును నీ కుమారులును నీ దాసులును అతనికొరకు ఆ భూమిని సాగుబడిజేసి, నీ యజమానుని కుమారునికిభోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను; నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడును నా బల్లయొద్దనే భోజనము చేయునని సెల విచ్చెను. ఈ సీబాకు పదునైదుమంది కుమారులును ఇరువదిమంది దాసులును ఉండిరి.9:11 నా యేలినవాడగు రాజు తన దాసునికిచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసెదనని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్లయొద్దనే భోజనము చేయుచుండెను.9:12 మెఫీ బోషెతునకు ఒకచిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. మరియు సీబా యింటిలో కాపురమున్న వారందరు మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి.9:13 మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్లయొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్లు రెండును కుంటివి.16:1 దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్లిన తరువాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన రెండు గాడిదలను తీసికొని వచ్చెను; రెండు వందల రొట్టెలును నూరు ద్రాక్ష గెలలును నూరు అంజూరపు అడలును ద్రాక్షారసపు తిత్తి ఒకటియు వాటిమీద వేసి యుండెను.16:4 అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదేయని సీబాతో చెప్పగా సీబానా యేలినవాడా రాజా, నీ దృష్టియందు నేను అనుగ్రహము పొందుదునుగాక, నేను నీకు నమస్కారము చేయుచున్నాననెను.19:24 మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును నెదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటివరకు అతడు కాళ్లు కడుగుకొనకయు, గడ్డము కత్తిరించు కొనకయు బట్టలు ఉదుకుకొనకయు నుండెను.19:30 అందుకు మెఫీబోషెతునా యేలినవాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చియున్నావు గనుక అతడు అంతయు తీసికొన వచ్చుననెను.21:7 తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామ మునుబట్టి ప్రమాణము చేసియున్న హేతువుచేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక21:8 అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన యిద్దరు కుమారులగు అర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెయగు మెరాబు మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలునకు కనిన అయిదుగురు కుమారులను పట్టుకొని గిబియోనీయుల కప్పగించెను.