10:3 అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడినవాడై యిరువదిరెండు సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను.10:4 అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు.10:5 అవి గిలాదు దేశములో నున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను.