4:17 హాసోరురాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్యయైన యాయేలు గుడారమునకు పారిపోయెను.4:18 అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొన బోయి అతనిని చూచి నా యేలినవాడా నాతట్టు తిరుగుము, తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను.4:21 పిమ్మట హెబెరు భార్యయైన యాయేలు గుడారపు మేకు తీసికొని సుత్తె చేతపట్టు కొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగియుండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా4:22 అతడు చచ్చెను బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొన వచ్చి రమ్ము, నీవు వెదకుచున్న మనుష్యుని నీకు చూపించెదననగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చి పడియుండెను, ఆ మేకు అతని కణతలలో నుండెను.5:6 అనాతు కుమారుడైన షవ్గురు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారు లాయెను ప్రయాణస్థులు చుట్టుత్రోవలలోనే నడిచిరి.5:24 కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననొందును గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును.