3:27 యోదా యోహన్నకు, యోహన్న రేసాకు, రేసా జెరుబ్బాబెలుకు, జెరుబ్బాబెలు షయల్తీ యేలుకు, షయల్తీయేలు నేరికి,8:2 పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడ ఉండిరి.24:10 ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు యోహన్నయు యాకోబు తల్లియైన మరియయు వారితో కూడ ఉన్న యితర స్త్రీలును.