4:5 అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి యుండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి అది ఏమియైనది, ఎందుకైనది తెలిసి కొనుటకు మొర్దెకైయొద్దకు వెళ్లుమని ఆజ్ఞ నిచ్చెను.4:6 హతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండు మొర్దెకైయొద్దకు పోగా4:8 వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూసి తెలుపుమనియు, ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతనియొద్దకు పోవలె నని చెప్పుమనియు దాని నతని కిచ్చెను. హతాకు వచ్చి మొర్దెకైయొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను.4:9 అంతట ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చిన దేమనగా