Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Our Daily Bread
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
10
Monday, February 2025
Change Date :
Previous
|
Next
Organized from Old Testament, New Testament, Psalms & Proverbs. Read and Complete Telugu Bible in One Year!
Exodus 6
13. మరియు యెహోవా మోషే అహరోనులతో నిట్లనెను ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్లవలెనని వారి కాజ్ఞాపించెను.
14. వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మీ; వీరు రూబేను కుటుంబములు.
15. షిమ్యోను కుమారులు యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావూలు; వీరు షిమ్యోను కుటుంబములు.
16. లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.
17. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ.
18. కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.
19. మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు.
20. అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.
21. ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రీ
22. ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రీ.
23. అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషెబను పెండ్లిచేసికొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను.
24. కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబీయా సాపు; వీరు కోరహీయుల కుటుంబములు.
25. అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒకతెను పెండ్లిచేసికొనెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను; వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు.
26. ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు.
27. ఇశ్రాయేలీయలను ఐగుప్తులోనుండి వెలుపలికి రప్పించవలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాటలాడిన వారు వీరు; ఆ మోషే అహరోనులు వీరే.
28. ఐగుప్తు దేశములో యెహోవా మోషేతో మాటలాడిన దినమున
29. యెహోవా నేను యెహోవాను; నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా
30. మోషే చిత్తగించుము; నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.
Exodus 7
1. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను. ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని; నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును.
2. నేను నీ కాజ్ఞాపించునది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్యవలెనని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పును;
3. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి, ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను.
4. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పులచేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెదను.
5. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రా యేలీయులను వారి మధ్యనుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.
6. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, ఆలాగుననే చేసిరి.
7. వారు ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు ఎనుబదియేండ్లు, అహరోనుకు ఎనుబది మూడు ఏండ్లు.
8. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పునప్పుడు
9. నీవు అహరోనును చూచి నీ కఱ్ఱను పట్టుకొని ఫరో యెదుట దాని పడవేయుమనుము; అది సర్పమగును.
10. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమ కాజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పడవేయగానే అది సర్పమాయెను.
11. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రుకూడ తమ మంత్రములచేత ఆలాగే చేసిరి.
12. వారిలో ప్రతివాడును తన కఱ్ఱను పడవేసినప్పుడు అది సర్పమాయెను గాని అహరోను కఱ్ఱ వారి కఱ్ఱలను మింగివేయగా
13. యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను.
14. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను - ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనియ్యనొల్లడాయెను
15. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్లుము, ఇదిగో అతడు ఏటిదరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటియొడ్డున నిలిచి పాముగా చేయబడిన కఱ్ఱను చేతపట్టుకొని
16. అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకుగాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇదివరకు వినకపోతివి.
17. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీనిబట్టి నీవు తెలిసి కొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న యీ కఱ్ఱతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును.
18. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపుకొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను.
19. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను - నీవు అహరోనుతో నీకఱ్ఱను పట్టుకొని ఐగుప్తు జలములమీద, అనగా వారి నదులమీదను వారి కాలువలమీదను, వారి చెరువుల మీదను, వారి నీటిగుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము; అవి రక్తమగును; ఐగుప్తు దేశమందంతటను మ్రానుపాత్రలలోను రాతిపాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను.
20. యెహోవా ఆజ్ఞా పించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పైకెత్తి ఏటినీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నియు రక్తముగా మార్చబడెను.
21. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపుకొట్టెను, ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేక పోయిరి, ఐగుప్తుదేశమందంతట రక్తము ఉండెను.
22. ఐగుప్తు శకునగాండ్రుకూడ తమ మంత్రములవలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను.
23. జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన యింటికి వెళ్లెను.
24. అయితే ఐగుప్తీయులందరు ఏటినీళ్లు త్రాగలేక త్రాగు నీళ్లకొరకు ఏటిప్రక్కలను త్రవ్విరి.
Exodus 8
1. యెహోవా ఏటిని కొట్టి యేడు దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను - నీవు ఫరో యొద్దకు వెళ్లి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము;
2. నీవు వారిని పోనియ్యనొల్లని యెడల ఇదిగో నేను నీ పొలి మేరలన్నిటిని కప్పలచేత బాధించెదను.
3. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును; అవి నీ యింట నీ పడకగదిలోనికి నీ మంచముమీదికి నీ సేవకుల యిండ్లలోనికి నీ జనులమీదికి నీ పొయిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును;
4. ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరిమీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమ నెను.
5. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనును చూచి నీ కఱ్ఱ పట్టుకొని యేటిపాయల మీదను కాలువలమీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశముమీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా
6. అహరోను ఐగుప్తు జలములమీద తన చెయ్యి చాపెను; అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను.
7. శకునగాండ్రు కూడ తమ మంత్రములవలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి.
8. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా యొద్దనుండి నా జనులయొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదననెను.
9. అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ యిండ్లలోను ఉండకుండ చంపబడునట్లును నీ కొరకును నీ సేవకులకొరకును నీ ప్రజలకొరకును నేనెప్పుడూ వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను.
10. అందుకతడు మా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలిసికొనునట్లు నీ మాట చొప్పున జరుగును;
11. అనగా కప్పలు నీ యొద్ద నుండియు నీ యిండ్లలో నుండియు నీ సేవకుల యొద్ద నుండియు నీ ప్రజలయొద్దనుండియు తొలగి పోవును; అవి యేటిలోనే ఉండుననెను.
12. మోషే అహరోనులు ఫరో యొద్దనుండి బయలు వెళ్లినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతనికొరకు మొఱపెట్టగా
13. యెహోవా మోషే మాటచొప్పున చేసెను గనుక ఇండ్లలో నేమి వెలుపల నేమి పొలములలో నేమి కప్పలు ఉండకుండ చచ్చిపోయెను.
14. జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపుకొట్టెను.
15. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినకపోయెను.
16. అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి.
17. అహరోను తన కఱ్ఱను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండెను; ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను¸
18. శకునగాండ్రు కూడ పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరి గాని అది వారివలన కాకపోయెను. పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండగా
19. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారిమాట వినకపోయెను.
20. కాబట్టి యెహోవా మోషేతొ నీవు ప్రొద్దున లేచి ఫరో యెదుట నిలువుము, ఇదిగో అతడు ఏటియొద్దకు పోవును. నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.
21. నీవు నా ప్రజలను పోనియ్యని యెడల చూడుము నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజలమీదికిని నీ యిండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను; ఐగుప్తీయుల యిండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును.
22. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనునట్లు, ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెనుదేశమును వినాయించెదను, అక్కడ ఈగల గుంపులుండవు.
23. నా ప్రజలను నీ ప్రజలనుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెననెను.
24. యెహోవా ఆలాగు చేసెను. బాధకరమైన ఈగలగుంపులు ఫరో యింటిలోకిని అతని సేవకుల యిండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపులవలన చెడిపోయెను.
25. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్లి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా
26. మోషే అట్లు చేయతగదు; మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల యెదుట అర్పించిన యెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా.
27. మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి నర్పించుదుమనెను.
28. అందుకు ఫరోమీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు; మరియు నాకొరకు వేడుకొనుడనెను.
29. అందుకు మోషే - నేను నీ యొద్దనుండి వెళ్లి రేపు ఈ యీగల గుంపులు ఫరో యొద్దనుండియు అతని సేవకుల యొద్దనుండియు అతని జనుల యొద్ద నుండియు తొలగి పోవునట్లు యెహోవాను వేడుకొందును గాని, యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనియ్యక ఇకను వంచన చేయకూడదని చెప్పి
30. ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.
31. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండియు అతని సేవకుల యొద్ద నుండియు అతని ప్రజల యొద్దనుండియు తొలగిపోయెను; ఒక్కటియైనను నిలువలేదు.
32. అయితే ఫరో ఆ సమయమున కూడ తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనియ్యడాయెను.
Matthew 26
47. ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండు మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితోకూడ బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకులయొద్దనుండియు ప్రజల పెద్దలయొద్ద నుండియు వచ్చెను.
48. ఆయనను అప్పగించువాడు నేనెవ రిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి
49. వెంటనే యేసు నొద్దకు వచ్చిబోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.
50. యేసు చెలికాడా, నీవు చేయవచ్చి నది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి.
51. ఇదిగో యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను.
52. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.
53. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొను చున్నావా?
54. నేను వేడుకొనిన యెడల ఈలాగు జరుగ వలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను.
55. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచిబందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు.
56. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి.
57. యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి.
58. పేతురు ప్రధానయాజకుని యింటి ముంగిటివరకు, ఆయనను దూరమునుండి వెంబడించి లోపలికి పోయిదీని అంత మేమవునో చూడవలెనని బంట్రౌతులతోకూడ కూర్చుండెను.
59. ప్రధానయాజకులును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని
60. అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు.
61. తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చివీడు దేవాలయమును పడగొట్టి, మూడు దినములలో దానిని కట్ట గలనని చెప్పెననిరి.
62. ప్రధానయాజకుడు లేచినీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను.
63. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచినీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు– నీవన్నట్టే.
64. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వ శక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘా రూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా
65. ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని - వీడు దేవ దూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు;
66. మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారువీడు మరణమునకు పాత్రుడనిరి.
67. అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి;
68. కొందరు ఆయనను అర చేతులతో కొట్టిక్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపు మనిరి.
Psalms 19
7. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.
8. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవిహృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును.
9. యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.
10. అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి.
11. వాటివలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును.
12. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్నునిర్దోషినిగా తీర్చుము.
13. దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహముచేయకుండ నిందా రహితుడనగుదును.
14. యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక.