24:3 దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.24:6 లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదు టను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరుల యిండ్లపెద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతా మారు పేరటను తీయబడెను.24:31 వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.