2:16 తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది.23:1 తూరునుగూర్చిన దేవోక్తి తర్షీషు ఓడలారా, అంగలార్చుడి తూరు పాడైపోయెను ఇల్లయినను లేదు ప్రవేశమార్గమైనను లేదు కిత్తీయుల దేశమునుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను.23:6 తర్షీషునకు వెళ్లుడి సముద్రతీరవాసులారా, అంగలార్చుడి.23:10 తర్షీషుకుమారీ, నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను నైలునది ప్రవహించునట్లు దానిమీద ప్రవహించుము.23:14 తర్షీషు ఓడలారా, అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయెను.60:9 నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.66:19 నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకొనినవారిని విలుకాండ్రైన తర్షీషు పూలులూదు అను జనుల యొద్ద కును తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపెదను నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహి మను చూడనట్టియుదూరద్వీపవాసులయొద్దకు వారిని పంపెదనువారు జనములలో నా మహిమను ప్రకటించెదరు.