నయోమి (నయోమి)


నోహరమైనది లేక నా సంతోషం

Bible Results

"నయోమి" found in 1 books or 21 verses

రూతు (21)

1:2 ఆ మనుష్యునిపేరు ఎలీమెలెకు, అతని భార్యపేరు నయోమి; అతని యిద్దరు కుమారుల పేళ్లు మహ్లోను కిల్యోను; వారు యూదా బేత్లెహేమువారైన ఎఫ్రాతీయులు; వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి.
1:3 నయోమి పెనిమిటియైన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె యిద్దరు కుమాళ్లును నిలిచియుండిరి.
1:8 నయోమి తన యిద్దరు కోడండ్రను చూచి మీరు మీ తల్లుల యిండ్లకు తిరిగి వెళ్లుడి; చనిపోయిన వారి యెడలను నా యెడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ యెడల దయచూపునుగాక;
1:11 నయోమి నా కుమార్తెలారా, మీరు మరలుడి; నాతోకూడ మీరు రానేల? మిమ్మును పెండ్లి చేసికొనుటకై యింక కుమారులు నా గర్భమున నుందురా?
1:18 తనతోకూడ వచ్చుటకు ఆమెకు మనస్సుకుదిరినదని నయోమి తెలిసి కొనినప్పుడు అందునుగురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరు బేత్లెహేమునకు వచ్చువరకు ప్రయాణము చేసిరి.
1:19 వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరివారందరు వారియొద్దకు గుంపుకూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా
1:20 ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి.
1:21 నేను సమృధ్దిగల దాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేల? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను.
1:22 అట్లు నయోమియు ఆమెతోకూడ మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబుదేశమునుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవలకోత ఆరంభములో బేత్లెహేము చేరిరి.
2:1 నయోమి పెనిమిటికి బంధువు డొకడుండెను. అతడు చాల ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపువాడై యుండెను, అతని పేరు బోయజు.
2:2 మోయాబీయురాలైన రూతు నీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కూమారీ పొమ్మనెను.
2:6 కోయువారిమీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబుదేశమునుండి నయోమితో కూడ తిరిగి వచ్చిన మోయాబీయురాలైన¸యౌవనురాలు.
2:20 నయోమి బ్రదికియున్న వారికిని చచ్చినవారికిని ఉపకారము చేయుట మానని యితడు యెహోవాచేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా
2:22 అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారీ, అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనిలోనివారికి నీవు కనబడక పోవుట మంచిదనెను.
3:1 ఆమె అత్తయైన నయోమి నా కుమారీ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసినదానను గదా.
4:3 అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార వినునట్లు నేనొకసంగతి తెలియజేయవలెనని యున్నాను.
4:5 బోయజు నీవు నయోమి చేతినుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయినవాని భార్యయైన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండియు దాని సంపాదింపవలెనని చెప్పగా
4:9 బోయజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతినుండి సంపాదించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై యున్నారు.
4:15 నిన్ను ప్రేమించి యేడుగురు కుమారులకంటె నీ కెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను; ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి.
4:16 అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసికొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను.
4:17 ఆమె పొరుగు స్త్రీలు నయోమికొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి యైన యెష్షయియొక్క తండ్రి.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
"నయోమి" found in 9 contents.

రూతు గ్రంథం
అధ్యాయాలు: 4, వచనాలు:85 గ్రంథ కర్త: సమూయేలు ప్రవక్త రచించిన తేది: దాదాపు 450 నుండి 425 సం. క్రీ.పూ. మూల వాక్యము: “నివు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నివు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు;” రూతు 1:16  ఉపోద్ఘాతం: రూతు గ్రంథం బ

ఎన్నిక
ప్రతి జీవికి ఒక ఆత్మ కథ వున్నట్టుగా, ప్రతి గ్రామానికీ, ప్రతి పట్టణానికీ ఒక ఆత్మ కథ వున్నది. యేసుని జననమునకు ముందు ఒక కుగ్రామం వుంది. అది చాలా స్వల్పమైన గ్రామం కాబట్టి దానికి ఎలాంటి విలువా లేదు. అదే బెత్లెహేము. అలాంటి బెత్లేహేమును దేవాదిదేవుడు ఏర్పరచుకున్నాడు. అందులోనుండే యూదుల రాజును ఉదయింపజేసేం

ఇశ్రాయేలీయుల పతనానికి కారణాలు
(కీర్తనలు 78, 106 అధ్యాయాలు) 1 ) దేవుని శక్తిని గ్రహించక పోవటం (78:19,20) (106:7) 2 ) దేవుని యందు విశ్వాసముంచకపోవడం (78:19,20) (106:7) 3 ) చేసిన మేలులు మరచిపోవడం (78:42,43) (106:13) 4 ) బహుగా ఆశించుట - దేవుని శోధించుట (78:18) (106:14)

రూతు
న్యాయాధిపతుల యొక్క అంధకార యుగములో కల్తీలేని ప్రేమతో, నిష్కపట భక్తికి వర్ణకాంతులు విరజిమ్ముచున్న ఒక ఆదర్శ స్త్రీ చరిత్ర రూతు గ్రంథము. ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు దేవుని ప్రేమించడానికి తన స్వజాతితో ఉన్న సంబంధములను, ఆచారములను త్రోసివేసి బెత్లెహేముకు వచ్చిన ఒక మోయాబు స్త్రీయే ఈ పుస్తకము యొక్క కథానాయ

వివాహ బంధం 1
దేవుని జీవ వాక్యమైన బైబిలు లో ‘వివాహము’ నకు అత్యధిక ప్రాముఖ్యము ఇవ్వబడింది. మొదటి పుస్తకమైన ఆదికాండము లో వివాహముతో అనగా ఆదాము, హవ్వలు జతపరచబడుటతో ప్రారంభించబడి, చివరి పుస్తకమైన ప్రకటన గ్రంధంలో గొఱ్ఱెపిల్ల వివాహోత్సవముతో ముగించబడుతుంది. “వివాహము అన్ని విషయములలో ఘనమైనది” అని హెబ్రీ 13:4 లో వ్రాయబడి

విధవరాలి పక్షమున న్యాయము తీర్చే దేవుడు
ఆయన తండ్రిలేనివారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయయుంచి అన్నవస్త్రములు అనుగ్రహించువాడు. ద్వితీయోపదేశకాండము 10:18 ప్రభువునందు ప్రియమైన పాఠకులకు ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు నామమున శుభములు.ఈ లోకములో భూమి మీద జీవించే మనుషులు ఎంతోమంది ఉన్నారు. వారిలో అనేకమంది పేదవ

పద వాహిని - Telugu Bible Crossword - 1
అడ్డం:1. ఒక పత్రిక (6)4. దేవుని రాజ్యం - కుడి నుండి (4)7. మొదటి కాండము (2)8. అతని రక్తం కుక్కలు (3)9. అభిషిక్తుడు (2)10. ఆది జేష్టుడు (3)13. కడపటి భూర ధ్వని ____ లో (5)14. సమా

బైబిలు చరిత్ర | Biblical History in Telugu
బైబిలు చరిత్ర బైబిల్ చరిత్ర అనేది శతాబ్దాలుగా అధ్యయనం చేయబడిన మరియు చర్చించబడిన మనోహరమైన మరియు సంక్లిష్టమైన అంశం. ఆదికాండములోని సృష్టి కథ నుండి ప్రకటనలోని ప్రవచనాల వరకు, బైబిల్ మానవత్వం మరియు మనతో దేవుని సంబంధాన్ని గుర

దేవుని మంచితనం
దేవుని మంచితనంరూతు 2:12 యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను.బోయజు తన పొలములో పరిగె ఏరుకోడానికి వచ

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , కృప , దావీదు , క్రీస్తు , యేసు , యోసేపు , అల్ఫా , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , బిలాము , గిద్యోను , యాకోబు , ప్రేమ , ఆత్మ , కోరహు , అహరోను , మరియ , యెరూషలేము , అబ్రాహాము , పౌలు , మిర్యాము , అగ్ని , ప్రార్థన , ఇశ్రాయేలు , సౌలు , అక్సా , హనోకు , లోతు , సాతాను , సొలొమోను , యూదా , సీయోను , రాహేలు , బబులోను , సెల , రాహాబు , దేవ�%B , ఐగుప్తు , యెహోషాపాతు , ఇస్సాకు , జక్కయ్య , నోవహు , ఇస్కరియోతు , స్వస్థ , అతల్యా , లేవీయులు , ఏలీయా , ఏశావు , కోరెషు , రక్షణ , యాషారు , హిజ్కియా , అన్న , సమరయ , యోకెబెదు , గిలాదు , ఆకాను , సారెపతు , బేతేలు , కూషు , ఎలియాజరు , కనాను , ఎఫ్రాయిము , ఆషేరు , గిల్గాలు , ప్రార్ధన , యెఫ్తా , మగ్దలేనే మరియ , కెజీయా , యోబు , పేతురు , ఆసా , తామారు , తీతు , అబ్దెయేలు , యొర్దాను , ఏఫోదు , రిబ్కా , బేతనియ , తెగులు , అకుల , జెరుబ్బాబెలు , సీమోను , రోగము , కయీను , హాము , రూబేను , వృషణాలు , యెహోవా వశము , దొర్కా , మార్త , ఆదాము , మోయాబు , ఎలీషా , బెసలేలు ,

Telugu Keyboard help