మాసిదోనియ (మాసిదోనియ)


గ్రీసు దేశపు ఉత్తర ప్రాంతమందలి ఒక ప్రదేశము

Bible Results

"మాసిదోనియ" found in 7 books or 22 verses

అపో. కార్యములు (9)

16:9 అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచినీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను.
16:10 అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితివి
16:12 మాసిదోనియ దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్యపట్టణమును రోమీయుల ప్రవాసస్థానమునై యున్నది. మేము కొన్నిదినములు ఆ పట్టణములో ఉంటిమి.
18:5 సీలయు తిమోతియు మాసిదోనియనుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చు చుండెను.
19:21 ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియ అకయ దేశముల మార్గమునవచ్చి యెరూషలేమునకు వెళ్లవలెనని మన స్సులో ఉద్దేశించి నేనక్కడికి వెళ్లిన తరువాత రోమాకూడ చూడవలెనని అనుకొనెను.
19:22 అప్పుడు తనకు పరిచర్యచేయు వారిలో తిమోతి ఎరస్తు అను వారి నిద్దరిని మాసిదోనియకు పంపి, తాను ఆసియలో కొంతకాలము నిలిచియుండెను.
19:29 పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియ వారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి.
20:1 ఆ యల్లరి అణగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించినమీదట వారియొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్లుటకు బయలు దేరెను.
20:3 అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడయెక్కి సిరియకు వెళ్ల వలెనని యుండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియమీదుగా తిరిగి రావలెనని నిశ్చయించుకొనెను.

రోమీయులకు (1)

15:26 ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయవారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి.

1 కోరింథీయులకు (1)

16:5 అయితే మాసిదోనియలో సంచారమునకు వెళ్లనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియలో సంచారమునకు వెళ్లినప్పుడు మీయొద్దకు వచ్చెదను.

2 కోరింథీయులకు (7)

1:16 మీ యొద్దనుండి మాసిదోనియకు వెళ్లి మాసిదోనియనుండి మరల మీయొద్దకు వచ్చి, మీచేత యూదయకు సాగనంప బడవలెనని ఉద్దేశించితిని.
2:13 నా మనస్సులో నెమ్మది లేక వారియొద్ద సెలవు తీసికొని అక్కడనుండి మాసిదోనియకు బయలుదేరితిని.
7:5 మేము మాసిదోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను; వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను.
8:1 సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అను గ్రహింపబడియున్న దేవుని కృపనుగూర్చి మీకు తెలియ జేయుచున్నాము.
9:2 మీ మనస్సు సిద్ధమై యున్నదని నేనెరుగుదును. అందువలన సంవత్సరమునుండి అకయ సిద్ధపడియున్నదని చెప్పి, నేను మిమ్మును గూర్చి మాసిదోనియవారియెదుట అతిశయపడుచున్నాను; మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి.
9:4 మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియవారెవరైనను నాతోకూడ వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచినయెడల, ఈ నమ్మిక కలిగియున్నందుకు మేము సిగ్గు పరచబడుదుము; మీరును సిగ్గుపరచబడుదురని యిక చెప్పనేల?
11:9 మరియు నేను మీయొద్దనున్నప్పుడు నాకక్కర కలిగియుండగా నేనెవనిమీదను భారము మోపలేదు; మాసిదోనియనుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోను నేను మీకు భారముగా ఉండకుండ జాగ్రత్తపడితిని, ఇక ముందుకును జాగ్రత్త పడుదును

ఫిలిప్పీయులకు (1)

4:15 ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప నారంభించి మాసిదోనియలోనుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపువారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియును.

1 థెస్సలొనీకయులకు (2)

1:7 కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; ఎందుకనగా మీయొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను;
4:10 ఆలాగుననే మాసిదోనియ యందంతట ఉన్న సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు. సహో దరులారా, మీరు ప్రేమయందు మరియొక్కువగా అభి వృద్ధినొందుచుండవలెననియు,

1 తిమోతికి (1)

1:3 నేను మాసిదోనియకు వెళ్లుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనాకథలును మితము లేని వంశావళులును,

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
"మాసిదోనియ" found in 3 contents.

రోమా పత్రిక
అధ్యాయాలు : 16, వచనములు : 433గ్రంథకర్త : రోమా 1:1 ప్రకారం అపో. పౌలు ఈ పత్రిక రచయిత అని గమనించవచ్చు. రోమా 16:22లో అపో. పౌలు తెర్తియు చేత ఈ పత్రికను వ్రాయించినట్టు గమనిచగలం.రచించిన తేది : దాదాపు 56-58 సం. క్రీ.శమూల వాక్యాలు : 1:6వ ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమ

థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి పత్రిక
బాల ప్రాయమున నున్న థెస్సలొనీక సంమములో పౌలు గడిపిన దినములను సంతోషముతో స్మరించుచున్నాడు. వారి విశ్వాసము, నమ్మిక, ప్రేమ వంటివి, శ్రమల మధ్యను వారు చూపిన సహనమును మాదిరిగ నుండెను. రెక్కలు వచ్చి ఎగురుటకు ప్రయత్నించుచున్న పక్షి పిల్లవలె, క్రైస్తవ్యమందు వృద్ధి పొందుచున్న సంఘము కొరకు పౌలు భరించిన శ్రమలు, త

Day 172 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు (మార్కు 2:2). సముద్రం అడుగున పోలిప్లు కాల్షియం ధాతువులతో తమ కోసం బ్రహ్మాండమైన ప్రవాళాలను నిర్మించుకుంటాయి. ప్రవాళాలు అనేవి గవ్వల్లా విడివిడిగా ఉండకుండా మొత్తంగా కలిసిపోయి ఒక్కోసారి పెద్ద పెద్ద ద్వీపాలుగా సముద్రం మధ్య భాగంలో ఏర్పడుతుంటాయి. పోలిప్ల వంటి అ

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , గిద్యోను , బిలాము , యాకోబు , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , యెరూషలేము , మిర్యాము , అక్సా , ప్రేమ , సెల , అగ్ని , సౌలు , సాతాను , హనోకు , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , దేవ�%B , సొలొమోను , రాహాబు , రాహేలు , యూదా , సీయోను , యాషారు , బబులోను , లోతు , ఇస్కరియోతు , స్వస్థ , జక్కయ్య , సారెపతు , ఇస్సాకు , సమరయ , యెహోషాపాతు , ఐగుప్తు , అన్న , అతల్యా , నోవహు , యోకెబెదు , లేవీయులు , ఏశావు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , ఎలియాజరు , కెజీయా , తెగులు , బేతేలు , గిల్గాలు , మగ్దలేనే మరియ , యోబు , అబ్దెయేలు , రోగము , కూషు , వృషణాలు , అకుల , ఏలీయా , కనాను , ఆషేరు , తీతు , ఆసా , మార్త , దొర్కా , సీమోను , రక్షణ , బేతనియ , ఎఫ్రాయిము , బెసలేలు , సబ్బు , యెహోవా వశము , యొర్దాను , హిజ్కియా , తామారు , ఏఫోదు , పరదైసు , ఎలీషా , హాము , కయీను , అంతియొకయ , ఊజు , ఈకాబోదు , బర్జిల్లయి , రూతు ,

Telugu Keyboard help