John - యోహాను సువార్త 3 | View All
Study Bible (Beta)

1. యూదుల అధికారియైన నీకొదేమను పరిసయ్యు డొకడుండెను.

1. फरीसियों में से नीकुदेमुस नाम एक मनुष्य था, जो यहूदियों का सरदार था।

2. అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మే మెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను.

2. उस ने रात को यीशु के पास आकर उस से कहा, हे रब्बी, हम जानते हैं, कि तू परमेश्वर की आरे से गुरू हो कर अया है; क्योंकि कोई इन चिन्हों को जो तू दिखाता है, यदि परमेश्वर उसके साथ न हो, तो नहीं दिखा सकता।

3. అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

3. यीशु ने उस को उत्तर दिया; कि मैं तुझ से सच सच कहता हूं, यदि कोई नये सिरे से न जन्में तो परमेश्वर का राज्य देख नहीं सकता।

4. అందుకు నీకొదేము ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా

4. नीकुदेमुस ने उस से कहा, मनुष्य जब बूढ़ा हो गया, तो क्योंकर जन्म ले सकता है?

5. యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

5. यीशु ने उत्तर दिया, कि मैं तुझ से सच सच कहता हूं; जब तक कोई मनुष्य जल और आत्मा से न जन्मे तो वह परमेश्वर के राज्य में प्रवेश नहीं कर सकता।

6. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది.

6. क्योंकि जो शरीर से जन्मा है, वह शरीर है; और जो आत्मा से जन्मा है, वह आत्मा है।

7. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.

7. अचम्भा न कर, कि मैं ने तुझ से कहा; कि तुम्हें नये सिरे से जन्म लेना अवश्य है।

8. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువే గాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.
ప్రసంగి 11:5

8. हवा जिधर चाहती है उधर चलती है, और तू उसका शब्द सुनता है, परन्तु नहीं जानता, कि वह कहां से आती और किधर को जाती है? जो कोई आत्मा से जन्मा है वह ऐसा ही है।

9. అందుకు నీకొదేము ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా

9. नीकुदेमुस ने उस को उत्तर दिया; कि ये बातें क्योंकर हो सकती हैं?

10. యేసు ఇట్లనెను నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై యుండి వీటిని ఎరుగవా?

10. यह सुनकर यीशु ने उस से कहा; तू इस्त्राएलियों का गुरू हो कर भी क्या इन बातों को नहीं समझता।

11. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
యెషయా 55:4

11. मैं तुझ से सच सच कहता हूं कि हम जो जानते हैं, वह कहते हैं, और जिसे हम ने देखा है उस की गवाही देते हैं, और तुम हमारी गवाही ग्रहण नहीं करते।

12. భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోకసంబంధమైనవి మీతో చెప్పినయెడల ఏలాగు నమ్ముదురు?

12. जब मैं ने तुम से पृथ्वी की बातें कहीं, और तुम प्रतीति नहीं करते, तो यदि मैं तुम से स्वर्ग की बातें कहूं, तो फिर क्योंकर प्रतीति करोगे?

13. మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.
సామెతలు 30:4

13. और कोई स्वर्ग पर नहीं चढ़ा, केवल वहीं जो स्वर्ग से उतरा, अर्थात् मनुष्य का पुत्रा जो स्वर्ग में है।

14. అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో,
సంఖ్యాకాండము 21:9

14. और जिस रीति से मूसा ने जंगल में सांप को ऊंचे पर चढ़ाया, उसी रीति से अवश्य है कि मनुष्य का पुत्रा भी ऊंचे पर चढ़ाया जाए।

15. ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను.

15. ताकि जो कोई विश्वास करे उस में अनन्त जीवन पाए।।

16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

16. क्योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उस ने अपना एकलौता पुत्रा दे दिया, ताकि जो कोई उस पर विश्वास करे, वह नाश न हो, परन्तु अनन्त जीवन पाए।

17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.

17. परमेश्वर ने अपने पुत्रा को जगत में इसलिये नहीं भेजा, कि जगत पर दंड की आज्ञा दे परन्तु इसलिये कि जगत उसके द्वारा उद्धार पाए।

18. ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.

18. जो उस पर विश्वास करता है, उस पर दंड की आज्ञा नहीं होती, परन्तु जो उस पर विश्वास नहीं करता, वह दोषी ठहरा चुका; इसलिये कि उस ने परमेश्वर के एकलौते पुत्रा के नाम पर विश्वास नहीं किया।

19. ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.

19. और दंड की आज्ञा का कारण यह है कि ज्योति जगत में आई है, और मनुष्यों ने अन्धकार को ज्योति से अधिक प्रिय जाना क्योंकि उन के काम बुरे थे।

20. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.

20. क्योंकि जो कोई बुराई करता है, वह ज्योति से बैर रखता है, और ज्योति के निकट नहीं आता, ऐसा न हो कि उसके कामों पर दोष लगाया जाए।

21. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.

21. परन्तु जो सच्चाई पर चलता हैख् वह ज्योति के निकट आता है, ताकि उसके काम प्रगट हों, कि वह परमेश्वर की ओर से किए गए हैं।

22. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడ యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచు ఉండెను.

22. इस के बाद यीशु और उसके चेले यहूदिया देश में आए; और वह वहां उन के साथर रहकर बपतिस्मा देने लगा।

23. సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి.

23. और यूहन्ना भी शालेम् के निकट ऐनोन में बपतिस्मा देता था। क्योंकि वहां बहुत जल था और लोग आकर बपतिस्मा लेते थे।

24. యోహాను ఇంకను చెరసాలలో వేయబడియుండ లేదు.

24. क्योंकि यूहन्ना उस समय तक जेलखाने में नहीं डाला गया था।

25. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను.

25. वहां यूहन्ना के चेलों का किसी यहूदी के साथ शुद्धि के विषय में वाद- विवाद हुआ।

26. గనుక వారు యోహాను నొద్దకు వచ్చిబోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతో కూడ ఉండెనో, నీ వెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మ మిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి.

26. और उन्हों ने यूहन्ना के पास आकर उस से कहा, हे रब्बी, जो व्यक्ति यरदन के पार तेरे साथ था, और जिस की तू ने गवाही दी है देख, वह बपतिस्मा देता है, और सब उसके पास आते हैं।

27. అందుకు యోహాను ఇట్లనెను తనకు పరలోకమునుండి అనుగ్రహింపబడితేనేగాని యెవడును ఏమియు పొందనేరడు.

27. यूहन्ना ने उत्तर दिया, जब तक मनुष्य को स्वर्ग से न दिया जाए तब तक वह कुछ नहीं पा सकता।

28. నేను క్రీస్తును కాననియు, ఆయనకంటె ముందుగా పంపబడినవాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు.
మలాకీ 3:1

28. तुम तो आप ही मेरे गवाह हो, कि मैं ने कहा, मैं मसीह नहीं, परन्तु उसके आगे भेजा गया हूं।

29. పెండ్లికుమార్తెగలవాడు పెండ్లి కుమారుడు; అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును; ఈ నా సంతోషము పరిపూర్ణమైయున్నది.

29. जिस की दुलहिन है, वही दूल्हा है: परन्तु दूल्हे का मित्रा जो खड़ा हुआ उस की सुनता है, दूल्हे के शब्द से बहुत हर्षित होता है; अब मेरा यह हर्ष पूरा हुआ है।

30. ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది.

30. अवश्य है कि वह बढ़े और मैं घटूं।।

31. పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు; భూమి నుండి వచ్చువాడు భూసంబంధియై భూసంబంధమైన సంగతులనుగూర్చి మాటలాడును; పరలోకమునుండి వచ్చువాడు అందరికి పైగానుండి
కీర్తనల గ్రంథము 97:9

31. जो ऊपर से आता है, वह सर्वोत्तम है, जो पृथ्वी से आता है वह पृथ्वी का है; और पृथ्वी की ही बातें कहता है: जो स्वर्ग से आता है, वह सब के ऊपर है।

32. తాను కన్నవాటినిగూర్చియు విన్నవాటినిగూర్చియు సాక్ష్యమిచ్చును; ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు.
యెషయా 55:4

32. जो कुछ उस ने देखा, और सुना है, उसी की गवाही देता है; और कोई उस की गवाही ग्रहण नहीं करता।

33. ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసి యున్నాడు.

33. जिस ने उस की गवाही ग्रहण कर ली उस ने इस बात पर छाप दे दी कि परमेश्वर सच्चा है।

34. ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.

34. क्योंकि जिसे परमेश्वर ने भेजा है, वह परमेश्वर की बातें कहता है: क्योंकि वह आत्मा नाप नापकर नहीं देता।

35. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి యున్నాడు.

35. पिता पुत्रा से प्रेम रखता है, और उस ने सब वस्तुएं उसके हाथ में दे दी हैं।

36. కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.

36. जो पुत्रा पर विश्वास करता है, अनन्त जीवन उसका है; परन्तु जो पुत्रा की नहीं मानता, वह जीवन को नहीं देखेगा, परन्तु परमेश्वर का क्रोध उस पर रहता है।।



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
John - యోహాను సువార్త 3 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ఇది యేసుక్రీస్తు మరియు పరిసయ్యుడైన నికోదేము మధ్య జరిగిన సంభాషణను కలిగి ఉంది. ఈ అధ్యాయంలో తిరిగి జన్మించడం యొక్క ప్రాముఖ్యత, దేవుని ప్రేమ మరియు విశ్వాసం ద్వారా రక్షణ వంటి కీలకమైన క్రైస్తవ సిద్ధాంతాలు చర్చించబడ్డాయి.

ఈ అధ్యాయంలోని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి, వీటిని బైబిల్ అధ్యయనంలో పరిగణించవచ్చు:

1. నికోదేముతో సంభాషణ (యోహాను 3:1-21):

  • నికోదేము ఎవరు? అతను పరిసయ్యుడు, యూదుల నాయకుడు మరియు సన్హెడ్రిన్ సభ్యుడు (యోహాను 3:1). అతను యేసును రాత్రిపూట కలవడానికి వచ్చాడు, బహుశా అతని స్థానం లేదా ఇతరుల అభిప్రాయాల గురించి భయపడి ఉండవచ్చు.
  • యేసు యొక్క ప్రకటన: "నీవు క్రొత్తగా జన్మించితేనే కాని దేవుని రాజ్యమును చూడలేవు" (యోహాను 3:3). ఇది ఈ అధ్యాయంలోని కీలకమైన అంశం. యేసు కేవలం మెరుగుదల లేదా సంస్కరణ గురించి మాట్లాడటం లేదు, కానీ ఒక పూర్తి స్థాయి ఆధ్యాత్మిక తిరిగి జన్మించడం గురించి మాట్లాడుతున్నాడు.
  • నికోదేము యొక్క ప్రశ్న మరియు యేసు యొక్క వివరణ (యోహాను 3:4-8). నికోదేము భౌతికంగా తిరిగి జన్మించడం ఎలా సాధ్యమని అడుగుతాడు. యేసు ఆత్మానుసారమైన జననం గురించి వివరిస్తాడు - నీరు మరియు ఆత్మ ద్వారా జన్మించడం. ఇక్కడ "నీరు" బాప్తిస్మాన్ని సూచిస్తుందని కొందరు వ్యాఖ్యానించగా, ఇతరులు ఇది దేవుని వాక్యాన్ని సూచిస్తుందని భావిస్తారు, ఇది శుద్ధి చేస్తుంది. "ఆత్మ" పరిశుద్ధాత్మ యొక్క పనిని సూచిస్తుంది, ఇది హృదయాలను మారుస్తుంది మరియు కొత్త జీవితాన్ని ఇస్తుంది.
  • పరలోక విషయాల గురించి యేసు యొక్క అధికారం (యోహాను 3:11-13). యేసు తాను పరలోకం నుండి వచ్చానని మరియు దైవిక విషయాల గురించి మాట్లాడే అధికారం తనకు ఉందని నొక్కి చెబుతాడు.
  • ఎత్తబడిన సర్పంతో పోలిక (యోహాను 3:14-15). అరణ్యంలో మోషే ఎత్తిన రాగి సర్పం ప్రజలను కాపాడినట్లుగానే, యేసు కూడా విశ్వసించే ప్రతి ఒక్కరికీ నిత్యజీవం ఇవ్వడానికి ఎత్తబడాలి (సిలువ వేయబడాలి).
  • దేవుని ప్రేమ (యోహాను 3:16). ఇది బైబిల్లోని అత్యంత ప్రసిద్ధ వచనాలలో ఒకటి. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడంటే, ఆయన తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు, ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా నిత్యజీవం పొందుతారు.
  • తీర్పు గురించి (యోహాను 3:17-21). దేవుడు లోకాన్ని తీర్చడానికి తన కుమారుడిని పంపలేదు, కానీ ఆయన ద్వారా లోకం రక్షింపబడటానికి పంపాడు. విశ్వసించని వారు వారి స్వంత అంధకారమైన క్రియల ద్వారా తమను తాము తీర్చుకుంటారు, ఎందుకంటే వారు వెలుగును ద్వేషిస్తారు.

2. బాప్తీస్మమిచ్చు యోహాను యొక్క సాక్ష్యం (యోహాను 3:22-36):

  • యేసు మరియు ఆయన శిష్యులు యూదయ ప్రాంతానికి వెళ్లి అక్కడ బాప్తిస్మం ఇవ్వడం ప్రారంభించారు.
  • బాప్తీస్మమిచ్చు యోహాను కూడా ఏనోనులో బాప్తిస్మం ఇస్తున్నాడు.
  • బాప్తీస్మమిచ్చు యోహాను శిష్యులు యేసు యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యత గురించి ఆందోళన చెందుతారు.
  • బాప్తీస్మమిచ్చు యోహాను యొక్క వినయపూర్వకమైన సమాధానం (యోహాను 3:27-30). అతను తన పాత్రను వివరిస్తాడు - అతను కేవలం పెళ్లి కుమారుడి స్నేహితుడు (యేసు). పెళ్లి కుమారుడు (యేసు) పెరగాలి, తాను తగ్గాలి.
  • పరలోకం నుండి వచ్చినవాడు అందరికంటే గొప్పవాడు (యోహాను 3:31-36). బాప్తీస్మమిచ్చు యోహాను యేసు యొక్క దైవత్వాన్ని మరియు ఆయన మాటల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాడు. కుమారుడిని విశ్వసించేవాడికి నిత్యజీవం ఉంటుంది, అవిధేయుడైనవాడు దేవుని ఉగ్రతను పొందుతాడు.

బైబిల్ అధ్యయనంలో పరిగణించవలసిన ప్రశ్నలు:

  • నికోదేము యేసు వద్దకు ఎందుకు వచ్చాడు? అతని ఉద్దేశాలు ఏమిటి?
  • "క్రొత్తగా జన్మించడం" అంటే ఏమిటి? ఇది ఎలా జరుగుతుంది?
  • నీరు మరియు ఆత్మ ద్వారా జన్మించడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
  • యోహాను 3:16 దేవుని గురించి మరియు మానవత్వం పట్ల ఆయనకున్న ప్రేమ గురించి ఏమి చెబుతుంది?
  • వెలుగు మరియు చీకటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? ప్రజలు వెలుగును ఎందుకు ద్వేషిస్తారు?
  • బాప్తీస్మమిచ్చు యోహాను యొక్క వినయం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • యేసు యొక్క అధికారం మరియు ఆయన సాక్ష్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
  • విశ్వసించడం మరియు అవిధేయత యొక్క పరిణామాలు ఏమిటి?

ఈ అధ్యాయాన్ని లోతుగా అధ్యయనం చేయడం ద్వారా, మనం రక్షణ యొక్క స్వభావం, దేవుని ప్రేమ యొక్క లోతు మరియు యేసుక్రీస్తు యొక్క ప్రాముఖ్యత గురించి మరింత తెలుసుకోవచ్చు. 



Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |