Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారానుకును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే.
1. ఇది ఇశ్రాయేలు ప్రజలకు మోషే యిచ్చిన సందేశం. వారు యొర్దాను నదికి తూర్పువైపుగల అరణ్యంల్లో ఉన్నప్పుడు అతడు ఈ విషయాలు వారితో చెప్పాడు. వారు అరాబా లోయలో ఉన్నారు. ఇది సూపుకు అవతల పారాను అరణ్యమునకు, తోపెలు, లాబాను, హజెరోతు, దీజాహాబు పట్టణాలకు మధ్యవుంది.
2. హోరేబు నుండి శేయీరు మన్నెపుమార్గముగా కాదేషు బర్నేయవరకు పదకొండు దినముల ప్రయాణము.
2. హోరేబు కాండనుండి (సీనాయి) కాదేఘ బర్నేయాకు శేయారు కొండలద్యారా ప్రయాణం పదకొండు రొజులు మాత్రమే పడుతుంది.
3. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనును అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయీలో హతము చేసినతరువాత
3. అయితే ఇశ్రాయేలీయులు ఈజిప్టును విడిచినప్పటినుండి ఈ స్థలంలో మోషే వీరితో మాట్లడినప్పటికి 40 సంవత్సరాలు పట్టింది. అది 40వ సంవత్సరం, 11వ నెల ఒకటవ తేది. వారితో చెప్పమని యోహొవా మోషేకు ఆజ్ఞాపించిన సంగతులన్నింటినీ మోషే వారితో మాట్లాడినప్పుడు చెప్పాడు.
4. నలుబదియవ సంవత్సరములో పదకొండవ నెల మొదటి తేదిని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తన కాజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను.
4. ఇది సీహోనును, ఓగును యెహోవా ఓడించిన తర్వాత జరిగిన సంగతి. సిహొను అమోరీయుల రాజు. సిహోను హెష్బోనులో నివసించాడు. ఓగు బాషాను రాజు. ఓగు అష్పారోతు, ఎద్రేయిలో నివసించాడు.
5. యొర్దాను ఇవతలనున్న మోయాబు దేశమున మోషే యీ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను
5. ఇప్పుడు వారు యోర్దాను నదికి తూర్పున మోయాబు దేశంలో ఉన్నారు, మరియు దేవుడు ఆజ్ఞాపించిన విషయాలను మోషే వివరించటం మొదలుబెట్టాడు. మోషే ఇలా చెప్పాడు:
6. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను ఈ పర్వతము నొద్ద మీరు నివసించిన కాలము చాలును;
6. “మన దేవుడైన యెహోవా హొరేబు (సీనాయి) కొండమీద మనతో మాట్లాడాడు. ఆయన అన్నాడు, ‘ఈ కొండ దగ్గర మీరు యిప్పటికి చాలా కాలంనుండి నిలిచి ఉన్నారు.
7. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబాలోను, మన్నెములోను, లోయలోను, దక్షిణదిక్కున సముద్రతీరములోనున్న స్థలములన్నిటికిని, కనానుదేశము నకును, లెబానోనుకును, మహానదియైన యూఫ్రటీసువరకును వెళ్లుడి.ప్రకటన గ్రంథం 9:14, ప్రకటన గ్రంథం 16:12
7. కదిలిపోయేందుకు సర్వ సిద్ధంగా ఉండండి. అమోరీయుల కొండ దేశానికి, దాని చుట్టూవున్న యొర్దాను లోయ, కొండ దేశం, పశ్చిమ పల్లపు ప్రాంతాలు, నెగెవు, సముద్రతీర ప్రాంతం అన్ని చోట్లకూ వెళ్లండి, కనానీ ప్రజల దేశానికి వెళ్లండి,యూఫ్రటిసు మహానది వరకు లెబానోనుకు వెళ్లండి.
8. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణముచేసిన దేశమును స్వాధీన పరచుకొనుడి.
8. చూడండి, ఈ దేశమంతా నేను మీకు ఇచ్చాను. మీరు అందులో ప్రవేశించి ఆ దేశాన్ని మీ స్వాధినం చేనుకోండి. మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకు నేను వాగ్దానం చేసిన దేశం యిదే. వారికి, వారి సంతతివారికి ఈ దేశాన్ని యిస్తానని నేను వాగ్దానం చేశాను.”
9. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మును భరింపలేను.
9. అప్పుడు మోషే అన్నాడు: ‘ఆ సమయంలో నేను మీతో మాట్లాడినప్పుడు నేను ఒంటరిగా మీ విషయంలో శ్రద్ధ తీసుకోలేనని నేను చేప్పాను.
10. మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింప జేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రములవలె విస్తరించి యున్నారు.హెబ్రీయులకు 11:12
10. మీ దేవుడైన యెహోవా ఇంకా మరింతమంది ప్రజలను అధికం చేయటంతో నేడు మీరు ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉంటాయో అంతమంది ఉన్నారు.
11. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువచేసి, తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును గాక.
11. మీ పూర్వీ కుల దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇంకా 1000 రెట్లు పెంచునుగాక! ఆయన మీకు చేసిన వాగ్దానం ప్రకారమే ఆయన మిమ్మల్ని ఆశీర్వాదించుగాక!
12. నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను?
12. కానీ నేను మీ విషయం శ్రద్ధ తీసుకోలేను, నేనొక్కడనే మీ వివాదాలు తీర్చలేను.
13. జ్ఞానవివేకములు కలిగి, మీ మీ గోత్రము లలో ప్రసిద్ధిచెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి; వారిని మీమీద నియమించెదనని మీతో చెప్పగా
13. కనుక ‘ప్రతి వంశంనుండి కొందరు ప్రతినిధులను ఎన్నుకోండి, నేను వారిని మీమీద నాయకులుగా చేస్తాను. అవగాహన, అనుభవం ఉన్న జ్ఞానులను ఎన్ను కోండి’ అని మీతో చెప్పాను.
14. మీరు నీవు చెప్పిన మాటచొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి.
14. “దానికి అలా చేయటం మంచిదే అనుకొంటున్నాము’ అని మీరు అన్నారు’.
15. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని, మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై వెయ్యి మందికి ఒకడును, నూరుమందికి ఒకడును ఏబదిమందికి ఒకడును, పదిమందికి ఒకడును వారిని, మీమీద నేను నియమించితిని.
15. “కనుక మీరు మీ వంశాలనుండి ఎన్నుకొన్న అవగాహన, అనుభవమున్న జ్ఞానులను మీకు నాయకులుగా నేను చేసాను. వారిలో కొందరిని 1000 మందికి నాయకులుగాను, కొందరిని 100 మందికి నాయకులుగాను, కొందరిసి 50 మందికి నాయకులుగాను, కొందరిని 10 మందికి నాయకులుగాను నేను చేసాను. నేను వారిని మీ వంశాలకు అధికారాలుగా చేసాను.
16. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతోమీ సహోదరుల వ్యాజ్యెములను తీర్చి, ప్రతి మనుష్యునికిని వాని సహోదరునికిని వానియొద్దనున్న పరదేశికిని న్యాయమునుబట్టి మీరు తీర్పు తీర్చవలెను.యోహాను 7:51
16. “ఈ నాయకులను మీకు న్యాయమూర్తులుగా ఉండమని అప్పట్లో నేను వారితో చెప్పాను. ‘మీ ప్రజల వాదాలు వినండి. ఒక్కో వ్యాజ్యెమును సరిగ్గా విచారణ చేయండి. సమస్య ఇశ్రాయేలీయుల ఇద్దరి మధ్యకావచ్చును, లేక ఒక ఇశ్రాయేల వ్యక్తికీ, మరో పరాయి వ్యక్తికీ మధ్య అయినా సరే పర్వాలేదు. మీరు ప్రతి వ్యాజ్యమును సరిగ్గా విచారణ చేయాలి.
17. తీర్పు తీర్చు నప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతి గాని పక్షపాతములేకుండ వినవలెను; న్యాయపుతీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠినవ్యాజ్యెమును నాయొద్దకు తీసి కొని రావలెను; నేను దానిని విచారించెదనని వారి కాజ్ఞా పించితిని.యాకోబు 2:9
17. మీరు విచారణ జరిపేటప్పుడు ఒక వ్యక్తి మరో వ్యక్తికంటె ముఖ్యమైనవాడని మీరు తలచకూడదు. ప్రతివ్యక్తి పైనా ఒకె విధంగా విచారణ జరిగించాలి. మీ నిర్ణయం దేవుని నుండి వస్తుంది. కనుక, ఎవరిని గూర్చి భయపడవద్దు. అయితే మీరు విచారణ జరిపేందుకు ఒక వ్యాజ్యము కష్టతరంగా ఉంటే, దానిని నా దగ్గరకు తీసుకొని రండి. నేను దానిని విచారిస్తాను.’
18. మరియు మీరు చేయవలసిన సమస్తకార్యములను గూర్చి అప్పుడు మీకాజ్ఞాపించితిని.
18. మీరు చేయాల్సిన ఇతర విషయాలన్నింటినీ ఆ సమయంలోనే నేను మీతో చెప్తాను.
19. మనము హోరేబునుండి సాగి మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహా రణ్యములోనుండి వచ్చి, అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితివిు.
19. “అప్పుడు మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మనం చేసాము. మనం హోరేబు (సీనాయి) కొండను విడిచి, ఆమోరీయుల కొండ దేశంవైవు ప్రయాణం చేసాము. మీరు చూసిన ఆ మహా భయంకర అరణ్యం అంతటి గుండా మనం వెళ్లాము. కాదేషు బర్నేయాకు మనం వచ్చాం.
20. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నెమునకు వచ్చియున్నాము.
20. అప్పుడు నేను మీతో చెప్పాను: ‘ఇప్పుడు మీరు అమోరీయుల కొండ దేశానికి వచ్చారు. మన యెహోవా దేవుడు ఈ దేశాన్ని మనకు ఇస్తాడు.
21. ఇదిగో నీ దేవుడైన యెహోవా యీ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచుకొనుము, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని.
21. చూడండి, అదిగో అదే ఆ దేశం. వెళ్లి ఆ దేశాన్ని మీ స్వంతం చేసుకోండి. మీరు ఇలా చేయాలని మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీతో చెప్పాడు. అందుచేత భయపడకండి, దేనిని గూర్చీ చింతపడ కండి!’
22. అప్పుడు మీరందరు నాయొద్దకు వచ్చి మనకంటె ముందుగా మనుష్యులను పంపుదము; వారు మనకొరకు ఈ దేశమును వేగు జూచి, తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్లవలసిన త్రోవను గూర్చియు, మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదు రంటిరి.
22. “అప్పుడు మీరంతా నా దగ్గరకు వచ్చి ‘ఆ దేశాన్ని చూసేందుకు మనకంటే ముందుగా మనుష్యుల్ని పంపిద్దాము, వారు తిరిగి వచ్చి మనం వెళ్లాల్సిన మార్గం మనకు చెబుతారు. మనకు వచ్చే పట్టణాలను గూర్చి కూడ వారు చెప్పగలుగుతారు అన్నారు.’
23. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రమొక్కంటికి ఒక మనుష్యుని చొప్పున పన్నిద్దరు మనుష్యులను పిలి పించితిని.
23. ‘అది మంచి తలంపు అని నేను అనుకొన్నాను. కనుక ఒక్కోవంశం నుండి ఒకరి చొప్పున మీలోనుండి పన్నెండు మందిని నేను ఎన్నుకొన్నాను.
24. వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగుజూచి ఆ దేశఫలములను చేత పట్టుకొని
24. అప్పుడు ఆ మనుష్యులు బయల్దేరి ఆ కొండ దేశానికి వెళ్లారు. వారు ఎష్కోలు లోయకు వచ్చి దానిని పరిశోధించారు.
25. మనయొద్దకు తీసికొని వచ్చిమన దేవుడైన యెహోవా మన కిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియ జెప్పిరి.
25. ఆ దేశంలోని ఫలాలు కొన్నింటిని తీసుకొని వారు మా దగ్గరకు తిరిగి తెచ్చారు. వారు మాకు సమాచారం అందిస్తూ ‘అది మన యెహోవా దేవుడు మనకు యిస్తున్న మంచి దేశం’ అని చెప్పారు.
26. అయితే మీరు వెళ్లనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి
26. కాని ఆ దేశంలో ప్రవేంశించటానికి మీరు నిరాకరించారు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞకు లోబడేందుకు మీరు నిరాకరించారు.
27. మీ గుడారము లలో సణుగుచు యెహోవా మనయందు పగపట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తుదేశములో నుండి మనలను రప్పించి యున్నాడు.
27. మీ గుడారాల్లో మీరు ఫిర్యాదులు చేసారు, మీరు అన్నారు: ‘యెహోవా మనలను ద్వేషిస్తున్నాడు. అమెరీయులు మనలను నాశనం చేసేటట్టు, వారికి మనలను అప్పగించటానికే ఆయన మనలను ఈజిప్టునుండి బయటకు రప్పించాడు.
28. మనమెక్కడికి వెళ్లగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటె బలిష్ఠులును ఎత్తరులునై యున్నారు; ఆ పట్టణములు గొప్పవై ఆకాశము నంటు ప్రాకారములతో నున్నవి; అక్కడ అనాకీయు లను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి.
28. ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్లగలము? మన సోదరులు (పన్నెండుమంది) తెచ్చిన సమాచారంతో వారు మనల్ని భయపెట్టారు. అక్కడి మనుష్యులు మనకంటే పెద్దవాళ్లు, ఎత్తయినవాళ్లు. పట్టణాలు పెద్దవి, వాటి గోడలు ఆకాశమంత ఎత్తు ఉన్నాయి. అక్కడ రాక్షసుల్లాంటి మనుష్యుల్ని మేము చూశాము’ అని వారు చెప్పారు.
29. అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి,
29. “అప్పుడు నేను మీతో చెప్పాను: ‘దిగులు పడకండి. ఆ మనుష్యుల విషయం భయపడవద్దు.
30. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నులయెదుట
30. మీ దేవుడైన యెహోవా మీకు ముందు వెళ్లి, మీ పక్షంగా పోరాడుతాడు. ఆయన ఈజిప్టులో చేసినట్టే దీన్నికూడ చేస్తాడు. ఆయన మీకు ముందుగా వెళ్లటం
31. ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని.అపో. కార్యములు 13:18
31. అరణ్య ములో మీరు చూశారు. ఒక మనిషి తన కుమారుని మోసినట్లు, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎలా మోసిందీ మీరు చూశారు. ఇంత దూరం ఈ స్థలానికి యెహోవా మిమ్మల్ని క్షేమంగా తీసుకొని వచ్చాడు.’ రాక్షసుల్లాంటి మనుష్యులు హీబ్రూ ప్రతుల్లో ‘ అనాకీయుల నెఫీలీయులు అని వ్రాయబడివుంది. సంఖ్యాకాండము 13:33 చూడండి.
32. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు
32. “అయినప్పటికీ మీరు యింకా మీ దేపుడైన యెహోవాను విశ్వసించలేదు.
33. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవాయందు మీరు విశ్వాస ముంచలేదు.
33. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ పాళెము కోసం స్థలం చూసేందుకు ఆయన మీకు ముందుగా వెళ్లాడు. మీరు ఏ మార్గాన వెళ్లాల్సిందీ మీకు చూపెట్టేందుకు రాత్రివేళ అగ్నిలోను, పగటివేళ మేఘములోను ఆయన మీకు ముందు వెళ్లాడు.
34. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలువిని
34. “మీరు చెప్పింది యెహోవా విన్నాడు, ఆయనకు కోపం వచ్చింది. ఆయన ఒక గట్టి ప్రమాణం చేసాడు. ఆయన చెప్పాడు:
35. బహుగా కోపపడినేను మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన యీ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలొ
35. ‘ఇప్పుడు జీవిస్తున్న దుష్టప్రజలైన మీలో ఎవ్వరూ, నేను మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఆ మంచి దేశంలో ప్రవేశించరు.
36. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతాన మునకును ఇచ్చెదనని ప్రమాణముచేసెను.
36. యెపున్నె కుమారుడైన కాలేబు మాత్రమే ఆ దేశాన్ని చూస్తాడు. కాలేబు నడిచిన భూమిని నేను అతనికియిస్తాను. ఆ భూమిని అతని సంతతివారికి నేను యిస్తాను. ఎందుకంటే నేను ఆజ్ఞాపించినది అంతా కాలేబు జరిగించాడు గనుక’.
37. మరియు యెహోవా మిమ్మునుబట్టి నామీద కోపపడినీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు.
37. “మీ వల్ల యెహోవా నా మీదకూడా కోపగించాడు. నాతో ఆయన చెప్పాడు: ‘నీవు కూడా ఆ దేశంలో ప్రవేశించజాలవు.
38. అతడు ఇశ్రాయేలీయులు దాని స్వాధీనపరచుకొన చేయును గనుక అతని ధైర్యపరచుము.
38. అయితే నీ సహాయకుడును నూను కుమారుడైన యెహోషువ ఆ దేశంలో నికి వెళ్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు అతడే వారిని నడిపిస్తాడు గనుక యెహోషువాను ప్రోత్సహించు.’
39. ఆ దినమున మంచి చెడ్డల నెరుగని మీ కుమారులు, అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు; దానిని వారి కిచ్చెదను; వారు దానిని స్వాధీనపరచుకొందురు.
39. “మరియు యెహోవా మనతో చెప్పాడు; ‘మీ చిన్న పిల్లలను మీ శ్రతువులు ఎత్తికొనిపోతారని మీరు చెప్పారు గదా, కానీ ఆ పిల్లలే ఆ దేశంలో ప్రవేశిస్తారు. ఒక విషయం తప్పో? ఒప్పో? అని, తెలుసుకోలేనంత చిన్నవాళ్లు గనుక మీరు చేసిన తప్పుకు మీ పిల్లల్ని నేను నిందించను. కనుక వారికే ఆ దేశాన్ని నేను యిస్తాను. ఆ దేశాన్ని మీ పిల్లలే వారి స్వంతంగా తీసుకొంటారు.
40. మీరు తిరిగి ఎఱ్ఱసముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను.
40. కానీ మీరు మాత్రం వెనుకకు తిరిగి ఎర్రసముద్ర మార్గంలో అరణ్యానికే వెళ్లాలి.’
41. అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితివిు; మా దేవుడైన యెహోవా మా కాజ్ఞాపించిన మాటలన్నిటి ననుసరించి మేము పోయి యుద్ధము చేసెదమని నాతో ఉత్తరమిచ్చి, మీరందరు మీ ఆయుధములను కట్టుకొని, ఆలోచింపక ఆ మన్నెమునకు పోగా
41. “అప్పుడు మీరు, ‘మోషే, మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసాము. అయితే యిదివరకు యెహావా దేవుడు మాకు ఆజ్ఞాపిచిన ప్రకారం యిప్పుడు మేము వెళ్లి పోరాడుతాము’ అని అన్నారు. అప్పుడు మీరు ఒక్కోక్కరు యుద్ధ ఆయుధాలు ధరించారు. ఆ కొండ దేశంలో ప్రవేశించటం సులభం అని మీరు అనుకొన్నారు.
42. యెహోవా నాతో ఇట్లనెను యుద్ధమునకు పోకుడి; నేను మీ మధ్యనుండను గనుక వెళ్లకుడి; మీరు వెళ్లినను మీ శత్రువులయెదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము.
42. “అయితే, ‘అక్కడికి వెళ్లి యుద్ధం చేయవద్దని ప్రజలతో చెప్పు, ఎందుకంటే నేను వారికి తోడుగా ఉండను, వారి శత్రువులు వారిని ఓడించేస్తారు’ అని యెహోవా నాతోచెప్పాడు.’
43. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగబడి మూర్ఖులై ఆ మన్నెమునకు వెళ్లితిరి.
43. “కనుక నేను మీతో మాట్లాడాను. కాని మీరు వినలేదు. యెహోవా ఆజ్ఞకు లోబడేందుకు మీరు నిరాకరించారు. మీ స్వంత శక్తి ప్రయోగించవచ్చని మీరనుకొన్నారు.
44. అప్పుడు ఆ మన్నెములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి, కందిరీగలవలె మిమ్ము తరిమి హోర్మావరకు శేయీరులో మిమ్ము హతముచేసిరి.
44. అందుచేత మీరు ఆ కొండ దేశం మీదికి వెళ్లారు. అప్పుడు ఆ కొండ దేశంలో నివసిస్తున్న అమోరీయులు మీ మీద యుద్ధానికి వచ్చారు. తేనెటీగల దండు మనుష్యులను తరిమినట్టు వారు మిమ్ములను తరిమారు. శేయీరునుండి హోర్మా వరకు మిమ్మల్ని తరిమి, అక్కడ వారు మిమ్మల్ని ఓడించారు.
45. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని యేడ్వగా, యెహోవా మీ మొఱను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు.
45. అప్పుడు మీరు తిరిగివచ్చి యెహోవాకు మొర్ర పెట్టారు. కాని యెహోవా మీ మొర్ర వినలేదు. మీ మొర్ర వినటానికి ఆయన నిరాకరించాడు.
46. కాగా మీరు కాదేషులో బహు దినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి.
46. కనుక చాలా కాలం మీరు కాదేషులోనే ఉండిపోయారు.”