Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. యెహోవా సేవకుడైన మోషే మృతినొందిన తరువాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను నా సేవకుడైన మోషే మృతినొందెను.
“చనిపోయిన”– ద్వితీయోపదేశకాండము 34:5. ద్వితీయోపదేశకాండం గ్రంథంలో ఇస్రాయేల్‌వారి చరిత్ర ముగిసిన చోటనుంచి యెహోషువ గ్రంథం ఆరంభం అవుతుంది. ఒక నాయకుడు తెర మరుగైపోతే దేవుడు మరొక నాయకుణ్ణి సిద్ధం చేశాడు. తన ఉద్దేశాల నెరవేర్పుకోసం ఆయన ఒక్క మనిషిని ఉపయోగించు కోలేదు.
2. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దానునది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి.
“నా సేవకుడు”– నిర్గమకాండము 14:31 ద్వితీయోపదేశకాండము 34:5హబక్కూకు 3:5. “యొర్దాను”– కనానుకు తూర్పు సరిహద్దు. దేవుడు వారికి అప్పటికే వాగ్దాన రూపంలో ఆ దేశాన్ని ఇచ్చేశాడు (వ 6; ఆదికాండము 12:6-7 ఆదికాండము 15:18-21 నిర్గమకాండము 3:8). ఇప్పుడు అక్షరాలా ఆ దేశాన్ని వారి స్వా
3. నేను మోషేతో చెప్పి నట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చు చున్నాను.
ద్వితీయోపదేశకాండము 11:24-25. దేవుడు వారికి ఆ దేశాన్ని ఇచ్చాడు గాని ఆక్రమించుకోవలసినది వారే.
4. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానదియైన యూఫ్రటీసు నదివరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహా సముద్రమువరకును మీకు సరిహద్దు.
“ఎడారి”– ఆ దేశానికి బాగా దక్షిణాన ఉన్న ప్రాంతం. “యూఫ్రటీసు”– దేశానికి బాగా ఉత్తరాన. “సముద్రం”– మధ్యధరా సముద్రం. “హిత్తి జాతి”– నిర్గమకాండము 33:2 నిర్గమకాండము 34:11. ఒకప్పుడు ఆ దేశంలో చాలా భాగం హిత్తివారి ఆధీనంలో ఉండేది. పురాతన కాలంలో ఆ దేశాన్ని వీరి పేరుతోనే పిలిచేవారు.
5. నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును.హెబ్రీయులకు 13:5
“నిలబడలేడు”– ద్వితీయోపదేశకాండము 7:24. లూకా 16:18-19 యాకోబు 4:7 పోల్చి చూడండి. “నీతో”– వ 9,17; ఆదికాండము 26:3 ఆదికాండము 39:2 ద్వితీయోపదేశకాండము 31:8 యెషయా 7:14 హెబ్రీయులకు 13:5-6.
6. నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు.
“నీవు చేస్తావు”– మోషే వారసునిగా యెహోషువను ఇంతకు ముందే ఎన్నుకోవడం జరిగింది (ద్వితీయోపదేశకాండము 31:1-8). దేవుడు ఆ నియామకాన్ని ఇక్కడ ఖాయపరుస్తున్నాడు. తన ప్రజలకు నాయకులను నియమించవలసినది దేవుడే. దీనికి ముందుగా పూనుకునేది ఆయనే. వారిని ఏ పనికైతే పిలిచాడో దాన్ని నెరవేర్చే సామర్థ్యం కూడా ఆయనే దయ చేస్తాడు.
7. అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞా పించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు.
అన్ని లక్షణాల కంటే ముందుగా దేవునిపట్ల విధేయత అతి ముఖ్యం (ద్వితీయోపదేశకాండము 8:1 ద్వితీయోపదేశకాండము 11:8). ఇప్పటికీ ఇది సత్యమే. ధర్మశాస్త్రం సీనాయి పర్వతంపై దేవుడు మోషేద్వారా ఇచ్చినది (నిర్గమకాండము 20:1 నిర్గమకాండము 21:1 లేవీయకాండము 1:1 ద్వితీయోపదేశకాండము 4:5-8). అస్తమానమూ యెహోషువ దీనికి ఉన్నత ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి (ద్వితీయోపదేశకాండము 6:6-7). విజయ సాధనకూ, దేవుని దీవెనలు పొందేందుకూ ఏకైక మార్గం ఇదే. దేవుని దివ్యవార్తంతా ఇప్పుడు బైబిలులో మనకు ఉంది. ప్రతి విశ్వాసి జీవితంలోనూ దేవుని వాక్కుకు అత్యధిక ప్రాధాన్యత ఉండాలి (యోహాను 8:31-32 రోమీయులకు 15:4 కొలొస్సయులకు 3:16 2 తిమోతికి 3:16-17 యాకోబు 1:22-25). క్రైస్తవ జీవితంలో విజయానికి ఏకైక మార్గం దేవుని వాక్కుకు లోబడడమే. “ధైర్య స్థిరతలతో”– నాయకునికి ఉండవలసిన రెండు ముఖ్య లక్షణాలు. మానవ చరిత్రలోనే గొప్ప నాయకుల్లో ఒకడైన మోషే స్థానంలోకి వచ్చి, ఒక జాతిని ఒక కొత్త దేశంలోకి నడిపించి బలవంతులైన శత్రువులను ఓడించవలసిన బాధ్యతను స్వీకరించవలసి రావడం యెహోషువకు వణుకు పుట్టించి ఉండదా?
8. ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపో కూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.
9. నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.
భయం నిరుత్సాహాలకు దేవుడు మనతో ఉండడమే మందు (వ 5; ద్వితీయోపదేశకాండము 33:27 కీర్తనల గ్రంథము 23:4 కీర్తనల గ్రంథము 27:1-3 కీర్తనల గ్రంథము 46:1-3 కీర్తనల గ్రంథము 91:1-2 2 తిమోతికి 4:16-17 హెబ్రీయులకు 13:5-6).
10. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగు ఆజ్ఞాపించెను మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి
నిజమైన నాయకుడు దేవుని ఆదేశాలను పాటిస్తాడు. ప్రజలను కూడా పాటించమని ప్రోత్సహిస్తాడు.
11. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై మూడు దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను. గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి.
12. మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపువారికిని యెహోషువ యీలాగు ఆజ్ఞాపించెను.
సంఖ్యా 32వ అధ్యాయం; యెహోషువ 22:1-4.
13. యెహోవా సేవకుడైన మోషే మీ కాజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసికొనుడి, ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు; ఆయన ఈ దేశమును మీకిచ్చును.
14. మీ భార్యలును మీపిల్లలును మీ ఆస్తియు యొర్దాను అవతల మోషే మీకిచ్చిన యీ దేశమున నివసింపవలెనుగాని, పరాక్రమవంతులును శూరులునైన మీరందరు యుద్ధసన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా
15. నది దాటి, యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకొనువరకు మీరును సహాయము చేయవలెను. అప్పుడు తూర్పున యొర్దాను ఇవతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాని స్వాధీనపరచుకొందురు.
16. అందుకు వారు నీవు మా కాజ్ఞాపించినదంతయు మేము చేసెదము, నీవు మమ్ము నెక్కడికి పంపుదువో అక్కడికి పోదుము;
17. మోషే చెప్పిన ప్రతిమాట మేము వినినట్లు నీ మాట విందుము; నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుండును గాక.
యెహోషువ దైవసన్నిధిలో, ఆశీర్వాదంలో నిలిచి ఉండాలని ప్రజలకు గట్టిగా చెప్పడం మంచిదే. ఎందుకంటే దేవునితో సహవాసం పోగొట్టుకున్న నాయకుణ్ణి అనుసరించడం ప్రమాదంతో కూడుకొన్న పని.
18. నీమీద తిరుగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరు మరణశిక్ష నొందుదురు; నీవు నిబ్బరముగలిగి ధైర్యము తెచ్చుకొనవలెనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి.
“ధైర్యం”– ఇస్రాయేల్ ప్రజలు కనానును వశపరచుకొన్న వైనంలో నేటి విశ్వాసులు నేర్చుకోవలసిన పాఠాలనేకం ఉన్నాయి. ఆ సమయంలోని సంభవాలు నేటి మన ఆధ్యాత్మిక జీవనానికి పోరాటాలకు సాదృశ్యాలు. ఈ క్రింది వాటిని గమనించండి – (1) కనాను వాగ్దత్త దేశం. దేవుడు దాన్ని ఇస్రాయేల్ వారికి ఇచ్చాడు. ఇచ్చానని పదేపదే వారికి చెప్తూవున్నాడు. అది వారి వారసత్వం. దానిపై హక్కు వారిదే. ఇప్పుడు క్రీస్తులో నమ్మకం ఉంచిన వారికి దేవుడు ఒక అమూల్యమైన దానిని ఇచ్చాడు – క్రీస్తులో జీవం, దానికి చెందిన అనేక వాగ్దానాలు (2 పేతురు 1:4). క్రీస్తులో వారికి ఆధ్మాత్మిక వారసత్వం ఉంది (ఎఫెసీయులకు 1:3). దాన్ని స్వాధీనం చేసుకొని అనుభవించే హక్కు వారికి ఉంది. జీవితంలో అన్ని సందర్భాల్లోనూ ఆత్మ సంబంధమైన శత్రువులపై విజయం (రోమీయులకు 8:37), దేవుని ఆత్మ సంపూర్ణత (ఎఫెసీయులకు 5:18) తదితర దీవెనలు ఇచ్చాడు. కనానును ఇస్రాయేల్‌కు ఇవ్వడం దేవుని కృప అయినట్టే మనకు క్రీస్తులో జీవితాన్ని ఇవ్వడం కూడా కృపే (ఎఫెసీయులకు 2:8-10). (2) ఇస్రాయేల్‌కు వాగ్దత్తం చేసిన దాన్ని వారు వెళ్ళి స్వంతం చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో జయం చాలా మట్టుకు విశ్వాసంతో దేవుని వాగ్దానాలను స్వంతం చేసుకోవడం పైననే ఆధారపడి ఉంది. దేవుడిచ్చే దానిని మనుషులు స్వీకరించాలి. దేవుని నుంచి అనేక విషయాలను విశ్వాసులు తీసుకొని వాటికోసం పోరాడి, స్వంతం చేసుకొని అనుభవించగలరు. యెహోషువ గ్రంథంలో విశ్వాసం, నమ్మడం అనే మాటలు కనిపించకపోయినప్పటికి ఇస్రాయేల్‌వారు చేసిన సాహసాలన్నిటికీ పునాది నమ్మకమే. ఆ దేశాన్ని దేవుడు తమకు ఇచ్చాడని వారు నమ్మి ఉండకపోతే దాన్ని స్వాధీనపరచు కొనేందుకు వెళ్ళివుండేవారే కాదు. దేవుడు యెహోషువను నాయకుడుగా నియమించాడని నమ్మివుండకపోతే అతన్ని అనుసరించేవారే కాదు. దేవుని ఆదేశాల్లో వారికి నమ్మకం లేకపోతే యెరికోను పట్టుకోగలిగి ఉండేవారు కాదు (హెబ్రీయులకు 11:30 చూడండి) నమ్మికకూ, విజయానికి సంబంధం ఇప్పుడు క్రొత్త ఒడంబడిక గ్రంథంలో స్పష్టం అయింది – ఎఫెసీయులకు 6:16 1 తిమోతికి 6:12 2 తిమోతికి 4:7 హెబ్రీయులకు 6:12 హెబ్రీయులకు 10:35-36 1 పేతురు 5:9 1 యోహాను 5:4-5. నమ్మకం ద్వారానే మనం మనకు బల ప్రభావాలు ఇచ్చే పవిత్రాత్మను పొందుతాం (గలతియులకు 3:2 గలతియులకు 3:14); నమ్మకం వల్లే ముందుకు సాగిపోతాం (2 కోరింథీయులకు 5:7 గలతియులకు 3:11); నమ్మకం మూలానే పోరాడుతాం (ఎఫెసీయులకు 6:16 1 తిమోతికి 6:12). (3) ఇస్రాయేల్‌కు ఎదురు నిలిచిన శత్రువులు మహా బలమైనవారు. ఇస్రాయేల్‌వారు దేశాన్ని స్వాధీన పరచుకో నివ్వకుండా చూడాలని కృత నిశ్చయులై ఉన్నారు (ఉదాహరణగా యెహోషువ 11:1-5 చూడండి). క్రీస్తు విశ్వాసుల శత్రువులు కనానువారి కంటే బలవంతులు, మరింత పట్టుదల గలవారు (ఎఫెసీయులకు 6:10-12). ఈ శత్రువులు తమకు చేతనైతే మనం పరమ స్థలాలలో మనకు చెందిన వాటిని పొందనీయకుండా అడ్డుపడతారు. (4) శత్రువులున్నారు గనుక ఇస్రాయేల్‌వారు యుద్ధం చెయ్యవలసి వచ్చింది. తమకు పట్టనట్లు కూర్చుంటే చాలా నష్టం కలిగివుండేది. ఇప్పటి విశ్వాసులు కూడా యుద్ధ రంగంలో ఉన్నారు. ఇది వారికి ఇష్టమున్నా లేకపోయినా తప్పదు. ఈ యుద్ధం ఆత్మ సంబంధమైనది (2 కోరింథీయులకు 10:4 ఎఫెసీయులకు 6:12 1 పేతురు 5:8-9). మందకొడిగా ఉండడమంటే ఓడిపోవడమే. (5) తమ వారసత్వాన్ని పొందాలంటే ఇస్రాయేల్‌వారు దేవుడు తమ కోసం నియమించిన నాయకుణ్ణి అనుసరించాలి. ఆ నాయకుడు యెహోషువ. ఇప్పటి విశ్వాసులు కూడా దేవుడు వారికి నియమించిన నాయకుణ్ణి అనుసరించాలి. లేదా ఓటమి తప్పదు. ఈ నాయకుడు యేసు. యెహోషువ అంటే “యెహోవా రక్షిస్తాడు” అని అర్థం. కొత్త ఒడంబడిక గ్రంథంలోని గ్రీకు భాషలో ఈ పేరు యేసు అయింది. అర్థం అదే. మహిమలోకి మనలను నడిపించే మన నాయకుడు యేసే. జీవిత యుద్ధంలో మన సైన్యాధిపతి ఆయనే (హెబ్రీయులకు 2:10 హెబ్రీయులకు 12:1-3). (6) కనానులో విజయ సాధనకు ఇస్రాయేల్‌వారికి కొన్ని లక్షణాలు చాలా అవసరం – ధైర్యం, బలం, లోబడే హృదయం, దేవుని వాక్కును ధ్యానిస్తూ ఉండే మనసు. విశ్వాసుల ఆధ్యాత్మికమైన పోరాటంలో కూడా ఈ లక్షణాల ప్రాముఖ్యత ఏమీ తక్కువ కాదు. (7) దేవుడు ఇస్రాయేల్‌వారికి విజయాన్నిస్తానని మాట ఇచ్చాడు (యెహోషువ 1:5). నేటి విశ్వాసుల విషయం కూడా ఇంతే (యోహాను 8:31-36 యోహాను 16:33 రోమీయులకు 8:37 1 కోరింథీయులకు 15:57). (8) దేవుడు ఇస్రాయేల్‌వారిని విడిచిపెట్టక ఎప్పుడూ వారితో ఉంటానని చెప్పాడు. వారి విజయ రహస్యం ఇదే (యెహోషువ 1:5). ఇప్పుడూ అంతే (మత్తయి 28:20 మొ।।). (9) శత్రువులను జయించడం ద్వారా ఇస్రాయేల్‌వారు ఆ దేశాన్ని స్వంతం చేసుకొని అందులో నివసించారు. ప్రకటన గ్రంథం 21:7 పోల్చిచూడండి. (10) దేశాన్ని వశపరచుకోవడం క్రమంగా జరిగింది. ఒక్క రోజులో అయిపోలేదు (యెహోషువ 11:18). నేటి విశ్వాసులు కూడా క్రీస్తులో వారికోసం ఉన్న వాటన్నిటినీ ఇప్పుడే ఒకేసారి అర్థం చేసుకొని స్వంతం చేసుకుని అనుభవించడం కుదరదు. ఎఫెసీయులకు 1:15-19 ఎఫెసీయులకు 3:14-19 లో పౌలు ప్రార్థనలు చూడండి. (11) యెహోషువ వృద్ధుడై పోయిన తరువాత కూడా కనానులో చాలా భాగం ఇస్రాయేల్‌వారి పరం కాకుండా మిగిలి ఉంది (యెహోషువ 13:1 యెహోషువ 23:4-5). క్రీస్తులోని భాగ్యాల్లో చాలా కొద్ది భాగాన్ని మాత్రమే చాలామంది విశ్వాసులు తమ జీవితాల్లో స్వంతం చేసుకుని అనుభవిస్తారు. అది గాక ఇంకెంతో ఉంది (మత్తయి 25:31-34 1 పేతురు 1:4).