Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపెతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.
1. These are the generations of the sonnes of Noah, Sem, Ham, and Iapheth: and vnto them were chyldren borne after the fludde.
2. యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
2. The children of Iapheth: Gomer, and Magog, and Madai, and Iauan, and Thubal, Mesech, and Thiras.
3. గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు.
3. The children of Gomer: Askenas, and Ripath, and Thogarma.
4. యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దాదోనీము అనువారు.
4. The children of Iauan: Elisa, & Tharsis, Kitthim, and Donanim.
5. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారము, వారివారి భాషలప్రకారము, వారివారి వంశముల ప్రకారము, ఆయా దేశములలో వారు వేరైపోయిరి.
5. Of these were the Iles of the gentiles deuided in their landes, euery one after his tongue, and after his kinrede, in their nations.
6. హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.
6. The children of Ham, Chus: and Mizraim, and Phut, and Chanaan.
7. కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు.
7. And the children of Chus: Seba, and Hauilah, and Sabthah, and Raamah, and Sabtheca.
8. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను.
8. The children of Raamah: Seba, and Dedan, Chus also begat Nimrod.
9. అతడు యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తి కలదు.
9. The same began to be mightie in the earth, for he was a mightie hunter before the Lorde: Wherfore it is sayde, Euen as Nimrod the mightie hunter before the Lorde.
10. షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.
10. The begynnyng of his kingdome was Babel, and Erech, & Arab, and Calueh, in the lande of Sinar.
11. ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును
11. Out of that lande came Assur, and builded Niniue, and the citie Rehoboth, and Calah,
12. నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్టణము.
12. Resen also betweene Niniue & Chalah, and it is a great citie.
13. మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను
13. Mizraim begat Ludim, and Anamim, and Lehabim, and Nephthuim,
14. పత్రుసీయులను కస్లూహీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూహీయులలోనుండి వచ్చినవారు.
14. Pathrusim also, and Casluhim, (out of whom came Philisthiim) & Capthorim.
15. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను
15. Chanaan begat Sidon his first borne sonne, and Heth,
16. హివ్వీయులను అర్కీయులను సినీయులను
16. And Iebusi, and Emori, and Girgasi,
17. అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను.
17. And Hiui also, and Arki, and Sini,
18. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.
18. And Aruadi, and Semari, and Hamathi: and afterwarde were the kinredes of the Chanaanites spread abrode.
19. కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజావరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిములకు వెళ్లు మార్గములో లాషా వరకును ఉన్నది.
19. The border of the Chanaanites was from Sidon as thou commest to Gerar vnto Azah, and as thou goest vnto Sodoma and Gomorra, and Adama, and Seboim, euen vnto Lesa.
20. వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషల ప్రకారము తమతమ దేశములనుబట్టియు జాతులను బట్టియు హాము కుమారులు.
20. These are the children of Ham in their kinredes, in their tongues, countreys, and in their nations.
21. మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.
21. Unto Sem also the father of all the children of Heber, and elder brother of Iapheth, there were chyldren borne.
22. షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.
22. The chyldren of Sem: Elam, and Assur, Arpharad, and Lud, and Aram.
23. అరాము కుమారులు ఊజుహూలు గెతెరు మాషనువారు.
23. The chyldren of Aram: Us, and Hul, Gether, and Mas.
24. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
24. Arphaxad begat Selah, and Selah begat Heber.
25. ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.
25. Unto Heber also were borne two sonnes: the name of the one was Peleg, for in his dayes was the earth deuided, and his brothers name was Iactan.
26. యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును
26. Iactan begat Almodad, and Saleph, Hazarmaueth, and Ierah,
27. హదోరమును ఊజాలును దిక్లాను
27. And Hadoram, and Uzal, and Dicla,
28. ఓబాలును అబీమాయెలును షేబను
28. Obal also, and Abimael, and Seba,
29. ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు.
29. And Ophir, and Hauilah, and Iobab, all these were the chyldren of Iactan.
30. మేషానుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలము.
30. And their dwelling was from Mesa, as thou goest vnto Sapher, a mount of the east.
31. వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషలప్రకారము తమతమ దేశములనుబట్టియు తమతమ జాతులనుబట్టియు షేము కుమారులు.
31. These are the chyldren of Sem after their kinredes and tongues, in their landes and nations.
32. వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను.
32. And so these are the kinredes of the chyldren of Noah after their generations in their peoples: and of these were the nations deuided in the earth after the flood.