Genesis - ఆదికాండము 19 | View All

1. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవినియొద్ద కూర్చుండియుండెను. లోతు వారిని చూచి వారిని ఎదు ర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారముచేసి
హెబ్రీయులకు 13:2, లూకా 17:28, 2 పేతురు 2:7

1. The two angels came to Sodom in the evening while Lot was sitting in the city's gateway. When Lot saw them, he got up to meet them and bowed down with his face toward the ground.

2. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు ఆలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ల బుచ్చెదమని చెప్ప్పిరి.

2. He said, 'Here, my lords, please turn aside to your servant's house. Stay the night and wash your feet. Then you can be on your way early in the morning.' 'No,' they replied, 'we'll spend the night in the town square.'

3. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని యింట ప్రవేశించిరి. అతడు వారికి విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి.

3. But he urged them persistently, so they turned aside with him and entered his house. He prepared a feast for them, including bread baked without yeast, and they ate.

4. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కులనుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసి
యూదా 1:7

4. Before they could lie down to sleep, all the men both young and old, from every part of the city of Sodom surrounded the house.

5. లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా

5. They shouted to Lot, 'Where are the men who came to you tonight? Bring them out to us so we can have sex with them!'

6. లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి తన వెనుక తలుపువేసి

6. Lot went outside to them, shutting the door behind him.

7. అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి;

7. He said, 'No, my brothers! Don't act so wickedly!

8. ఇదిగో పురుషుని కూడని యిద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసికొని వచ్చెదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి.

8. Look, I have two daughters who have never had sexual relations with a man. Let me bring them out to you, and you can do to them whatever you please. Only don't do anything to these men, for they have come under the protection of my roof.'

9. ఈ మనుష్యులు నా యింటినీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారునీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు; కాగా వారికంటె నీకు ఎక్కువ కీడు చేసెదమని చెప్పి లోతు అను ఆ మనుష్యునిమీద దొమ్మిగాపడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి.

9. 'Out of our way!' they cried, and 'This man came to live here as a foreigner, and now he dares to judge us! We'll do more harm to you than to them!' They kept pressing in on Lot until they were close enough to break down the door.

10. అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసికొని తలుపు వేసిరి.

10. So the men inside reached out and pulled Lot back into the house as they shut the door.

11. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి.

11. Then they struck the men who were at the door of the house, from the youngest to the oldest, with blindness. The men outside wore themselves out trying to find the door.

12. అప్పుడా మనుష్యులు లోతుతో ఇక్కడ నీకు మరియెవరున్నారు? నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగినవారినందరిని వెలుపలికి తీసికొని రమ్ము;

12. Then the two visitors said to Lot, 'Who else do you have here? Do you have any sons-in-law, sons, daughters, or other relatives in the city? Get them out of this place

13. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితివిు; వారిని గూర్చిన మొర యె హోవా సన్నిధిలో గొప్పదాయెను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా

13. because we are about to destroy it. The outcry against this place is so great before the LORD that he has sent us to destroy it.'

14. లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడ నైయున్న తన అల్లుళ్లతో మాటలాడిలెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి; యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవు చున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువానివలె నుండెను.

14. Then Lot went out and spoke to his sons-in-law who were going to marry his daughters. He said, 'Quick, get out of this place because the LORD is about to destroy the city!' But his sons-in-law thought he was ridiculing them.

15. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టిలెమ్ము; ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండ నీ భార్యను ఇక్కడనున్న నీ యిద్దరు కుమార్తెలను తీసికొని రమ్మని చెప్పిరి.

15. At dawn the angels hurried Lot along, saying, 'Get going! Take your wife and your two daughters who are here, or else you will be destroyed when the city is judged!'

16. అతడు తడవు చేసెను. అప్పుడు అతనిమీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతనిచేతిని అతని భార్యచేతిని అతని యిద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి.

16. When Lot hesitated, the men grabbed his hand and the hands of his wife and two daughters because the LORD had compassion on them. They led them away and placed them outside the city.

17. ఆ దూతలు వారిని వెలుపలికి తీసికొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించి పోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా
లూకా 17:31-32

17. When they had brought them outside, they said, 'Run for your lives! Don't look behind you or stop anywhere in the valley! Escape to the mountains or you will be destroyed!'

18. లోతు ప్రభువా ఆలాగు కాదు.

18. But Lot said to them, 'No, please, Lord!

19. ఇదిగో నీ కటాక్షము నీ దాసునిమీద వచ్చినది; నా ప్రాణము రక్షించుటవలన నీవు నాయెడల కనుపరచిన నీ కృపను ఘనపరచితివి; నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను; ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో

19. Your servant has found favor with you, and you have shown me great kindness by sparing my life. But I am not able to escape to the mountains because this disaster will overtake me and I'll die.

20. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది గదా, నేను బ్రదుకుదునని చెప్పినప్పుడు

20. Look, this town over here is close enough to escape to, and it's just a little one. Let me go there. It's just a little place, isn't it? Then I'll survive.'

21. ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని;

21. 'Very well,' he replied, 'I will grant this request too and will not overthrow the town you mentioned.

22. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము; నీ వక్కడ చేరువరకు నేనేమియు చేయలేననెను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను.

22. Run there quickly, for I cannot do anything until you arrive there.' (This incident explains why the town was called Zoar.)

23. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను.

23. The sun had just risen over the land as Lot reached Zoar.

24. Then the LORD rained down sulfur and fire on Sodom and Gomorrah. It was sent down from the sky by the LORD.

25. ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరిని నేల మొలకలను నాశనము చేసెను.

25. So he overthrew those cities and all that region, including all the inhabitants of the cities and the vegetation that grew from the ground.

26. అయితే లోతు భార్య అతని వెనుకనుండి తిరిగి చూచి ఉప్పు స్థంభమాయెను.
లూకా 17:31

26. But Lot's wife looked back longingly and was turned into a pillar of salt.

27. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి

27. Abraham got up early in the morning and went to the place where he had stood before the LORD.

28. సొదొమ గొమొఱ్ఱాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలె లేచుచుండెను.
ప్రకటన గ్రంథం 9:2

28. He looked out toward Sodom and Gomorrah and all the land of that region. As he did so, he saw the smoke rising up from the land like smoke from a furnace.

29. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడుచేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసికొని, లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండ అతని తప్పించెను.

29. So when God destroyed the cities of the region, God honored Abraham's request. He removed Lot from the midst of the destruction when he destroyed the cities Lot had lived in.

30. లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి.

30. Lot went up from Zoar with his two daughters and settled in the mountains because he was afraid to live in Zoar. So he lived in a cave with his two daughters.

31. అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలి వాడు; సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు.

31. Later the older daughter said to the younger, 'Our father is old, and there is no man anywhere nearby to have sexual relations with us, according to the way of all the world.

32. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగచేసికొందము రమ్మని చెప్పెను.

32. Come, let's make our father drunk with wine so we can have sexual relations with him and preserve our family line through our father.'

33. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.

33. So that night they made their father drunk with wine, and the older daughter came and had sexual relations with her father. But he was not aware that she had sexual relations with him and then got up.

34. మరునాడు అక్క తన చెల్లెలిని చూచినిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను.

34. So in the morning the older daughter said to the younger, 'Since I had sexual relations with my father last night, let's make him drunk again tonight. Then you go and have sexual relations with him so we can preserve our family line through our father.'

35. ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.

35. So they made their father drunk that night as well, and the younger one came and had sexual relations with him. But he was not aware that she had sexual relations with him and then got up.

36. ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి.

36. In this way both of Lot's daughters became pregnant by their father.

37. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.

37. The older daughter gave birth to a son and named him Moab. He is the ancestor of the Moabites of today.

38. చిన్నదికూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటివరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.

38. The younger daughter also gave birth to a son and named him Ben-Ammi. He is the ancestor of the Ammonites of today.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 19 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
సొదొమ నాశనం, మరియు లోతు విడుదల. (1-29) 
లోతు అనే ఒక మంచి వ్యక్తి ఉండేవాడు, కానీ అతను ఒక నగరంలో నివసించాడు, అక్కడ అందరూ చాలా చెడ్డవారు. దేవుడు లోతును మరియు అతని కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు, కాబట్టి నగరం నాశనం చేయబడకముందే వారిని విడిచిపెట్టమని హెచ్చరించాడు. లాట్ సంకోచంగా ఉన్నందున బయలుదేరడానికి చాలా సమయం పట్టింది, ఇది వ్యక్తులు మారాలని తెలిసినప్పుడు కానీ కోరుకోనప్పుడు వారికి ఇది జరగవచ్చు. మనం దేవుని దయతో రక్షింపబడ్డాము, మనం దానికి అర్హులైనందున కాదు. మన పాపపు మార్గాలను విడిచిపెట్టడానికి సహాయం చేయడంలో దేవుని శక్తిని మనం గుర్తించాలి. పాపం నుండి రక్షింపబడిన మనందరికీ ఇది ఒక ఆజ్ఞ, వెనక్కి తిరిగి చూడకుండా పారిపోవాలని లోతు చెప్పబడింది. మనం మన పాత పద్ధతులకు తిరిగి రాకూడదు లేదా ఈ ప్రపంచంలోని విషయాలతో సంతృప్తి చెందకూడదు. బదులుగా, మనం స్వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. దేవుడు పాపం పట్ల కోపంగా ఉన్నాడని మరియు అది నాశనానికి దారితీస్తుందని నగరం నాశనం చేయడం మనకు చూపిస్తుంది. దీని నుండి మనం పాఠాలు నేర్చుకుని పాపానికి దూరంగా ఉండాలి.


లోతు పాపం మరియు అవమానం. (30-38)
చాలా సురక్షితంగా భావించడం మరియు చెడు పనులు చేయకుండా మనం సురక్షితంగా ఉన్నామని అనుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ కథ మనకు చూపుతుంది. మంచిగా ఉండాలని ప్రయత్నించి, తన చుట్టూ జరుగుతున్న చెడు విషయాల గురించి కలత చెందిన లోతు కూడా, అతను ఒంటరిగా ఉన్నప్పుడు, శోదించబడతాడని ఆశించకుండా తప్పు చేశాడు. అతిగా మద్యం సేవించడం కూడా చాలా ప్రమాదకరం, ఎందుకంటే ప్రజలు తెలివిగా ఉన్నప్పుడు వారు ఎప్పటికీ చేయని పనులను చేయగలరు. మనం ప్రేమించే మరియు విశ్వసించే వ్యక్తులు కూడా కొన్నిసార్లు చెడు పనులు చేయడానికి మనల్ని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించవచ్చు, కాబట్టి మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి మరియు ప్రమాదం గురించి జాగ్రత్తగా ఉండాలి. మనుషులు చెడ్డపనులు చేసినప్పుడు, వారు మరచిపోతారని మరియు వారి మంచి పేరును పోగొట్టుకుంటారని కూడా ఈ కథ మనకు బోధిస్తుంది.


Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |