1. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసికొని, మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను.
1. laabaanu kumaarulu mana thandriki kaliginadhi yaavatthunu yaakobu theesikoni, mana thandriki kaligina daanivalana ee yaavadaasthi sampaadhinchenani cheppukonina maatalu yaakobu vinenu.
2. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతనియెడల ఉండలేదు.
2. mariyu athadu laabaanu mukhamu chuchinappudu adhi ninna monna undinatlu athaniyedala undaledu.
3. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా
3. appudu yehovaa nee pitharula dheshamunaku nee bandhuvula yoddhaku thirigi vellumu; nenu neeku thoodaiyundedhanani yaakobuthoo cheppagaa
4. yaakobu polamulo thana mandayoddhaku raahelunu leyaanu piluvanampi vaarithoo yitlanenu.
5. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడైయున్నాడు;
5. mee thandri kataakshamu ninna monna naameeda undinatlu ippudu naameeda nundaledani naaku kanabaduchunnadhi; ayithe naa thandriyokka dhevudu naaku thoodaiyunnaadu;
6. మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసే యున్నది.
6. mee thandriki naa yaavacchakthithoo koluvu chesithinani meeku telise yunnadhi.
7. మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను; అయినను దేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు.
7. mee thandri nannu mosapuchi padhimaarlu naa jeethamu maarchenu; ayinanu dhevudu athani naaku haanicheya niyyaledu.
8. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలుగలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లల నీనెను.
8. athadu podalu galavi nee jeethamagunani cheppinayedala appudu mandalanniyu podalugala pillalaneenenu. chaaralugalavi nee jeethamagunani cheppinayedala appudu mandalanniyu chaaralugala pillala neenenu.
9. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.
9. atlu dhevudu mee thandri pashuvulanu theesi naakicchenu.
10. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్న మందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై యుండెను.
10. mandalu choolukattu kaalamuna nenu svapna mandu kannuletthi choodagaa gorrelanu daatu pottellu chaaralainanu podalainanu macchalainanu galavai yundenu.
11. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని.
11. mariyu aa svapnamandu dhevuni dootha yaakoboo ani nannu piluvagaa chitthamu prabhuvaa ani cheppithini.
12. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱెలను దాటుచున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని
12. appudu aayana nee kannuletthi choodumu; gorrelanu daatuchunna pottellanniyu chaaralainanu podalainanu macchalainanu galavi; yelayanagaa laabaanu neeku cheyuchunnadhi yaavatthunu chuchithini
13. నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.
13. nee vekkada sthambhamumeeda noone posithivo, yekkada naaku mrokkubadi chesithivo aa bethelu dhevudanu nene. Ippudu neevu lechi yee dheshamulonundi bayaludheri neevu puttina dheshamunaku thirigi vellumani naathoo cheppenanenu.
14. అందుకు రాహేలును లేయాయు యింక మా తండ్రి యింట మాకు పాలు పంపు లెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా?
14. anduku raahelunu leyaayuyinka maa thandri yinta maaku paalu pampu lekkadivi? Athadu mammunu anyulugaa choochutaledaa?
15. అతడు మమ్మును అమ్మివేసి, మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను.
15. athadu mammunu ammivesi, maaku raavalasina dravyamunu botthugaa thinivesenu.
16. దేవుడు మా తండ్రి యొద్దనుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునైయున్నది గదా? కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్ల చేయుమని అతనికుత్తర మియ్యగా
16. dhevudu maa thandri yoddhanundi theesivesina dhanamanthayu maadhiyu maa pillaladhiyunaiyunnadhi gadaa? Kaabatti dhevudu neethoo cheppinatlella cheyumani athanikutthara miyyagaa
17. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెలమీద నెక్కించి
17. yaakobu lechi thana kumaarulanu thana bhaaryalanu ontelameeda nekkinchi
18. కనాను దేశమునకు తన తండ్రియైన ఇస్సాకు నొద్దకు వెళ్లుటకు తన పశువులన్నిటిని, తాను సంపాదించిన సంపద యావత్తును, పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని పోయెను.
18. kanaanudheshamunaku thana thandriyaina issaaku noddhaku vellutaku thana pashuvu lannitini, thaanu sampaadhinchina sampada yaavatthunu, paddhanaraamulo thaanu sampaadhinchina aasthi yaavatthunu theesikoni poyenu.
19. లాబాను తన గొఱ్ఱెలబొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి యింటనున్న గృహ దేవతలను దొంగిలెను.
19. laabaanu thana gorrelabochu katthirinchutaku velliyundagaa raahelu thana thandri yintanunna gruha dhevathalanu dongilenu.
20. యాకోబు తాను పారిపోవు చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవుట వలన అతని మోసపుచ్చినవాడాయెను.
20. yaakobu thaanu paaripovu chunnaanani siriyaavaadaina laabaanuku teliyacheyaka povuta valana athani mosapuchinavaadaayenu.
21. అతడు తనకు కలిగిన దంతయు తీసికొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్లెను.
21. athadu thanaku kaligina danthayu theesikoni paaripoyenu. Athadu lechi nadhi daati gilaadanu kondathattu abhimukhudai vellenu.
22. yaakobu paaripoyenani moodava dinamuna laabaanuku telupabadenu.
23. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యేడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి, గిలాదు కొండమీద అతని కలిసికొనెను.
23. athadu thana bandhuvulanu ventabettukoni, yedu dinamula prayaanamantha dooramu athani tharumukoni poyi, gilaadukonda meeda athani kalisikonenu.
24. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చినీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెను.
24. aa raatri svapnamandu dhevudu siriyaavaadaina laabaanu noddhaku vachineevu yaakobuthoo manchigaani cheddagaani palukakumu jaagrattha sumee ani athanithoo cheppenu.
25. laabaanu yaakobunu kalisikonenu. Yaakobu thana gudaaramu aa kondameeda vesikoniyundenu; laabaanunu thana bandhuvulathoo gilaadu kondameeda gudaaramu vesi konenu.
26. అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేల?
26. appudu laabaanu yaakobuthoo neevemi chesithivi? Nannu mosapuchi, katthithoo cherapattabadina vaarini vale naa kumaarthelanu konipovanela?
27. నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే.
27. neevu naaku cheppaka rahasyamugaa paaripoyi nannu mosapuchithivela? Sambhramamuthoonu paatalathoonu maddelathoonu sithaaraalathoonu ninnu saaganampudune.
28. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టు కొననియ్యక పిచ్చిపట్టి యిట్లు చేసితివి.
28. ayithe neevu naa kumaarulanu naa kumaarthelanu nannu muddu pettu konaniyyaka pichipatti yitlu chesithivi.
29. మీకు హాని చేయుటకు నా చేతనవును; అయితే పోయిన రాత్రి మీ తండ్రియొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని నాతో చెప్పెను.
29. meeku haani cheyutaku naa chethanavunu; ayithe poyina raatri mee thandriyokka dhevudu neevu yaakobuthoo manchi gaani cheddagaani palukakumu jaagrattha sumee ani naathoo cheppenu.
30. నీ తండ్రి యింటిమీద బహు వాంఛగల వాడవై వెళ్లగోరిన యెడల వెళ్లుము, నా దేవతల నేల దొంగిలితివనగా
30. nee thandri yintimeeda bahu vaanchagala vaadavai vellagorina yedala vellumu, naa dhevathala nela dongilithivanagaa
31. యాకోబు నీవు బలవంతముగా నా యొద్దనుండి నీ కుమార్తెలను తీసికొందువేమో అనుకొని భయపడితిని
31. yaakobu neevu balavanthamugaa naa yoddhanundi nee kumaarthelanu theesikonduvemo anukoni bhayapadithini
32. ఎవరియొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రదుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల యెదుట వెదకి నీ దానిని తీసికొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలెనని యాకోబునకు తెలియలేదు.
32. evariyoddha nee dhevathalu kanabaduno vaaru bradukakoodadu. neevu naa yoddhanunna vaatini mana bandhuvula yeduta vedaki nee daanini theesikonumani laabaanuthoo cheppenu. Raahelu vaatini dongilenani yaakobunaku teliyaledu.
33. లాబాను యాకోబు గుడారములోనికి లేయా గుడారము లోనికి ఇద్దరి దాసీల గుడారములలోనికి వెళ్లెను గాని అతని కేమియు దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములోనుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్లెను.
33. laabaanu yaakobu gudaaramuloniki leyaa gudaaramu loniki iddari daaseela gudaaramulaloniki vellenu gaani athani kemiyu dorakaledu. tharuvaatha athadu leyaa gudaaramulonundi bayaludheri raahelu gudaaramuloniki vellenu.
34. రాహేలు ఆ విగ్రహములను తీసికొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవి చూచి నప్పటికిని అవి దొరకలేదు.
34. raahelu aa vigrahamulanu theesikoni onte saamagrilo petti vaatimeeda koorchundenu. Kaagaa laabaanu aa gudaaramandanthatanu thadavi chuchi nappatikini avi dorakaledu.
35. ఆమె తన తండ్రితో తమ యదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు; నేను కడగానున్నానని చెప్పెను. అతడెంత వెదకినను ఆ విగ్రహములు దొరకలేదు.
35. aame thana thandrithoo thama yaduta nenu levalenanduna thaamu kopapadakoodadu; nenu kadagaa nunnaanani cheppenu. Atha dentha vedakinanu aa vigrahamulu dorakaledu.
36. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరుమ నేల? నేను చేసిన ద్రోహమేమి? పాపమేమి?
36. yaakobu kopapadi laabaanuthoo vaadhinchi athanithoo neevitlu mandipadi nannu tharuma nela? Nenu chesina drohamemi? Paapamemi?
37. నీవు నా సమస్త సామగ్రి తడివి చూచిన తరువాత నీ యింటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి యెదుటను నీ వారియెదుటను అది యిట్లు తెచ్చిపెట్టుము; వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు.
37. neevu naa samastha saamagri thadivi chuchina tharuvaatha nee yinti vasthuvulannitilo edi dorikenu? Naa vaari yedutanu nee vaariyedu tanu adhi yitlu techipettumu; vaaru mana ubhayula madhya theerpu theerchuduru.
38. ఈ యిరువది యేండ్లు నేను నీయొద్దనుంటిని. నీ గొఱ్ఱెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు.
38. ee yiruvadhi yendlu nenu neeyoddhanuntini. nee gorrelainanu meka lainanu eechu koni poledu, nee manda pottellanu nenu thinaledu.
39. దుష్ట మృగములచేత చీల్చబడినదానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దాని నేమి రాత్రియందు దొంగి లింపబడినదాని నేమి నాయొద్ద పుచ్చుకొంటివి; నేను ఈలాగుంటిని.
39. dushta mrugamulachetha chilchabadinadaanini nee yoddhaku theka aa nashtamu nene pettukontini. Pagatiyandu dongilimpabadina daani nemi raatriyandu dongi limpabadinadaani nemi naayoddha puchukontivi; nenu eelaaguntini.
40. పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూరమాయెను.
40. pagati yendakunu raatri manchukunu nenu ksheeninchipothini; nidra naa kannulaku doora maayenu.
41. ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి.
41. idivaraku nee yintilo iruvadhi yendlu untini. nee yiddari kumaarthela nimitthamu padunaalu gendlunu, nee manda nimitthamu aarendlunu neeku koluvu chesithini. Ayinanu neevu naa jeethamu padhimaarulu maarchithivi.
42. నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.
42. naa thandri dhevudu, abraahaamu dhevudu, issaaku bhayapadina dhevudu naaku thoodaiyundaniyedala nishchayamugaa neevu nannu vatti chethulathoone pampivesi yunduvu. dhevudu naa prayaasamunu naa chethula kashtamunu chuchi, poyina raatri ninnu gaddinchenani laabaanuthoo cheppenu.
43. అందుకు లాబాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది, ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారుల నైనను నేనేమి చేయగలను.
43. anduku laabaanu ee kumaarthelu naa kumaarthelu, ee kumaarulu naa kumaarulu, ee manda naa manda, neeku kanabaduchunnadhi anthayu naadhi, ee naa kumaarthelanainanu veeru kanina kumaarula nainanu nenemi cheyagalanu.
44. కావున నేనును నీవును నిబంధన చేసికొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా
44. kaavuna nenunu neevunu nibandhana chesikondamu rammu, adhi naakunu neekunu madhya saakshigaa undunani yaakobuthoo uttharamiyyagaa
45. యాకోబు ఒక రాయి తీసికొని దానిని స్తంభముగా నిలువబెట్టెను.
45. yaakobu oka raayi theesikoni daanini sthambhamugaa niluvabettenu.
46. మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి; అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి.
46. mariyu yaakobu raallu koorchudani thana bandhuvulathoo cheppenu. Vaaru raallu techi kuppa vesiri; akkada vaaru aa kuppa yoddha bhojanamu chesiri.
47. laabaanu daaniki yagar shaahadoothaa anu peru pettenu. Ayithe yaakobu daaniki galedu anu peru pettenu.
48. లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరుపెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను.
48. laabaanu nedu ee kuppa naakunu neekunu madhya saakshigaa undunani cheppenu. Kaabatti daaniki galedanu perupettenu. Mariyu manamu okarikokaramu dooramugaa nundagaa yehovaa naakunu neekunu madhya jarugunadhi kanipettunani cheppenu ganuka daaniki mispaa anu peru pettabadenu.
49. అంతట లాబాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక యితర స్త్రీలను పెండ్లి చేసికొనినను, చూడుము,
49. anthata laabaanuneevu naa kumaarthelanu baadha pettinanu, naa kumaarthelanu gaaka yithara streelanupendli chesikoninanu, choodumu,
50. మనయొద్ద ఎవరును లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను.
50. manayoddha evarunu leru gadaa, naakunu neekunu dhevude saakshi ani cheppenu.
51. మరియు లాబాను నాకును నీకును మధ్య నేను నిలిపిన యీ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము.
51. mariyu laabaanu naakunu neekunu madhya nenu nilipina yee sthambhamunu choodumu ee kuppa choodumu.
52. హానిచేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి యీ స్తంభమును సాక్షి.
52. haanicheyavalenani nenu ee kuppa daati nee yoddhaku raakanu, neevu ee kuppanu ee sthambhamunu daati naa yoddhaku raakanu undutaku ee kuppa saakshi yee sthambhamunu saakshi.
53. abraahaamu dhevudu naahoru dhevudu vaari thandri dhevudu mana madhya nyaayamu theerchunani cheppenu. Appudu yaakobu thana thandriyaina issaaku bhayapadina dhevunithoodani pramaanamu chesenu.
54. యాకోబు ఆ కొండమీద బలియర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనముచేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి.
54. yaakobu aa kondameeda bali yarpinchi bhojanamu cheyutaku thana bandhuvulanu piluvagaa vaaru bhojanamuchesi kondameeda aa raatri vellabuchiri.
55. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్లి పోయెను.
55. tellavaarinappudu laabaanu lechi thana kumaarulanu thana kumaarthelanu muddu pettukoni vaarini deevinchi bayaludheri thana ooriki velli poyenu.
Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 31 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
యాకోబు రహస్యంగా బయలుదేరాడు. (1-21)
బైబిల్ కుటుంబాల గురించి మరియు వారి జీవితాలను ఎలా గడుపుతుంది అనే దాని గురించి చాలా మాట్లాడుతుంది, అయితే ఇది చాలా కాలం క్రితం ప్రపంచంలో జరిగిన పెద్ద సంఘటనల గురించి ఎక్కువగా మాట్లాడదు. మంచిగా ఉండాలో, దేవుణ్ణి ప్రేమించాలో, ఇతరులకు ఎలా సహాయం చేయాలో బైబిలు ప్రజలకు బోధిస్తోంది. కొందరు వ్యక్తులు నిజంగా స్వార్థపరులు మరియు ఇతరులను బాధపెట్టినప్పటికీ, తమ గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తారు. ఇది మంచిది కాదు మరియు అసూయ మరియు ఇతర చెడు విషయాలకు దారి తీస్తుంది. కొంతమంది డబ్బు మరియు వస్తువుల గురించి చాలా శ్రద్ధ వహిస్తారు, ఇది చెడు విషయాలకు కూడా దారి తీస్తుంది. ఒకరికొకరు దయగా ఉండటం ముఖ్యం మరియు ఎల్లప్పుడూ మన గురించి ఆలోచించకూడదు. కొన్నిసార్లు మనం సంతోషంగా లేనప్పుడు, మనం అసూయపడవచ్చు లేదా ఇతరులతో వాదించవచ్చు. కానీ మనల్ని సంతోషపరిచే అంశాలు ఉన్నాయి, మనం మొదటి స్థానంలో ఉండటానికి ప్రయత్నించాలి. మనం కదిలినప్పుడల్లా, దేవుడు మనతో ఏమి చేయమని చెప్పాడో గుర్తుంచుకోవాలి మరియు అతను మనతో ఉంటాడని నమ్మాలి. మనం భయానక పరిస్థితులను ఎదుర్కోవచ్చు, కానీ మనం దేవునికి సన్నిహితంగా ఉన్నట్లు భావించిన సమయాల గురించి ఆలోచిస్తే మనకు మంచి అనుభూతి కలుగుతుంది. మరియు మనం దేవునికి చేసిన వాగ్దానాలను గుర్తుంచుకోవాలి మరియు వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి.
లాబాను యాకోబును వెంబడించాడు. (23-35)
చెడ్డ వ్యక్తుల ప్రవర్తనను దేవుడు నియంత్రించగలడు, వారు తనను నిజంగా ప్రేమించకపోయినా. కొన్నిసార్లు, చెడ్డ వ్యక్తులు మంచిగా నటిస్తారు కాబట్టి వారు బాగా కనిపిస్తారు. లాబాను తన వస్తువులను "దేవతలు" అని పిలవడానికి వెర్రివాడు ఎందుకంటే అవి దొంగిలించబడతాయి. శత్రువులు మన వస్తువులను దొంగిలించవచ్చు, కానీ వారు దేవునిపై మనకున్న నమ్మకాన్ని తీసివేయలేరు. తాను చేయని పనులకు లాబాను యాకోబును నిందించాడు. సహాయం కోసం దేవుడిని అడగడం ఫర్వాలేదు, కానీ మనం ఇంకా గౌరవంగా ఉండాలి. రాచెల్ తన తండ్రి వస్తువులను దొంగిలించినప్పుడు, అది చాలా తప్పు. నాహోర్ కుటుంబం విగ్రహాలను ఆరాధించే స్థలాన్ని విడిచిపెట్టినప్పటికీ, వారు ఇప్పటికీ విగ్రహాలను ఆరాధించడం ప్రారంభించారు. ఇది తాము దేవుణ్ణి నమ్ముతామని చెప్పుకునే వ్యక్తులు వంటిది, కానీ మంచి లేని ఇతర విషయాలను కూడా నమ్ముతారు.
జెఫన్యా 1:5 కొందరు వ్యక్తులు దేవుణ్ణి ప్రేమిస్తున్నారని చెబుతారు, కానీ వారు నిజంగా డబ్బు మరియు వస్తువులపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. వారు దేవునికి బదులుగా పూజించే విగ్రహాలు లేదా వస్తువులను కలిగి ఉండవచ్చు. ఎవరైనా ఎక్కువ డబ్బు సంపాదించాలని నిమగ్నమైనప్పుడు, వారు దేవుడికి బదులుగా ప్రపంచాన్ని ఆరాధించినట్లే. వారు దేవునికి బదులుగా వస్తువులను ఆరాధించే వ్యక్తులతో సమయాన్ని వెచ్చిస్తే, వారు కూడా అలా చేయడం ప్రారంభించవచ్చు.
లాబాన్ ప్రవర్తనపై యాకోబు ఫిర్యాదు. (36-42)
యాకోబు తన భార్య కుటుంబంలో భాగం కావడానికి చాలా కష్టమైన విషయాలను ఎదుర్కొన్నాడు. అతను వాటన్నిటినీ భరించడానికి ఇష్టపడితే, దేవుని కుటుంబంలో భాగం కావడానికి మనం ఏమి అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి? యాకోబు తన తండ్రి మరియు తాత గౌరవించే దేవుణ్ణి అదే దేవుడిగా గౌరవించాడు, అయినప్పటికీ అతను దేవుడు గుర్తించబడేంత ముఖ్యమైనవాడు అని అతను భావించలేదు. అబ్రాహాము చనిపోయినప్పటికీ అతడు దేవుణ్ణి అబ్రాహాము మరియు ఇస్సాకు దేవుడు అని పిలిచాడు, ఎందుకంటే ఇస్సాకు ఇప్పటికీ దేవుణ్ణి చాలా గౌరవించాడు.
గలీద్‌లో వారి ఒడంబడిక. (43-55)
లాబాను యాకోబు సరైనవా లేదా తప్పు అని చెప్పలేకపోయాడు, కాబట్టి అతను దాని గురించి ఇక మాట్లాడదలుచుకోలేదు. కానీ లాబాన్ వారు స్నేహితులు కావాలని సూచించాడు మరియు యాకోబు అంగీకరించాడు. అప్పట్లో పేపర్, పెన్నులు లేని కారణంగా ఈ క్షణాన్ని గుర్తు చేసుకునేందుకు రాళ్ల కుప్పను తయారు చేశారు. వారు ఒకరికొకరు శాంతియుతంగా ఉన్నారని చూపించడానికి వారు దేవునికి బహుమతి కూడా సమర్పించారు. మనం దేవునితో శాంతిని నెలకొల్పినప్పుడు, మన స్నేహంలో మనకు నిజమైన ఓదార్పు ఉంటుంది. పూర్వకాలంలో అందరూ కలిసి భోజనం చేయడం ద్వారా స్నేహితులుగా మారేవారు. సమూహం ప్రత్యేక విందు నుండి రొట్టెలు తిన్నారు. కలిసి తిని, తాగుతూ స్నేహితులుగా ఉంటామని వాగ్దానం చేశారు. దేవుడు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాడు మరియు ఎవరు తప్పు చేసినా పర్యవసానాలను ఎదుర్కొంటారు. వారు తమ వాగ్దానం చేసిన ప్రదేశానికి "సాక్షుల కుప్ప" అని పేరు పెట్టారు. వారు వాదించినప్పటికీ, వారు మంచి నిబంధనలతో విషయాలు ముగించారు. కొన్నిసార్లు, దేవుడు మనం అనుకున్నదానికంటే దయగా ఉంటాడు మరియు మనం ఊహించని విధంగా మనకు సహాయం చేస్తాడు. దేవుణ్ణి నమ్మడం ముఖ్యం.
Shortcut Links
Explore Parallel Bibles
21st Century KJV |
A Conservative Version |
American King James Version (1999) |
American Standard Version (1901) |
Amplified Bible (1965) |
Apostles' Bible Complete (2004) |
Bengali Bible |
Bible in Basic English (1964) |
Bishop's Bible |
Complementary English Version (1995) |
Coverdale Bible (1535) |
Easy to Read Revised Version (2005) |
English Jubilee 2000 Bible (2000) |
English Lo Parishuddha Grandham |
English Standard Version (2001) |
Geneva Bible (1599) |
Hebrew Names Version |
Hindi Bible |
Holman Christian Standard Bible (2004) |
Holy Bible Revised Version (1885) |
Kannada Bible |
King James Version (1769) |
Literal Translation of Holy Bible (2000) |
Malayalam Bible |
Modern King James Version (1962) |
New American Bible |
New American Standard Bible (1995) |
New Century Version (1991) |
New English Translation (2005) |
New International Reader's Version (1998) |
New International Version (1984) (US) |
New International Version (UK) |
New King James Version (1982) |
New Life Version (1969) |
New Living Translation (1996) |
New Revised Standard Version (1989) |
Restored Name KJV |
Revised Standard Version (1952) |
Revised Version (1881-1885) |
Revised Webster Update (1995) |
Rotherhams Emphasized Bible (1902) |
Tamil Bible |
Telugu Bible (BSI) |
Telugu Bible (WBTC) |
The Complete Jewish Bible (1998) |
The Darby Bible (1890) |
The Douay-Rheims American Bible (1899) |
The Message Bible (2002) |
The New Jerusalem Bible |
The Webster Bible (1833) |
Third Millennium Bible (1998) |
Today's English Version (Good News Bible) (1992) |
Today's New International Version (2005) |
Tyndale Bible (1534) |
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) |
Updated Bible (2006) |
Voice In Wilderness (2006) |
World English Bible |
Wycliffe Bible (1395) |
Young's Literal Translation (1898) |
Telugu Bible Verse by Verse Explanation |
పరిశుద్ధ గ్రంథ వివరణ |
Telugu Bible Commentary |
Telugu Reference Bible |