Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్లెను.
1. About that time, Judah left his brothers and went to stay with a man named Hirah in the town of Adullam.
2. అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసికొని ఆమెతో పోయెను.
2. There Judah met a Canaanite girl, the daughter of a man named Shua, and married her. Judah had sexual relations with her,
3. ఆమె గర్భవతియై కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను.
3. and she became pregnant and gave birth to a son, whom Judah named Er.
4. ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను.
4. Later she gave birth to another son and named him Onan.
5. ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులోనుండెను.
5. Still later she had another son and named him Shelah. She was at Kezib when this third son was born.
6. యూదా తన జ్యేష్ఠకుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను.
6. Judah chose a girl named Tamar to be the wife of his first son Er.
7. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను.
7. But Er, Judah's oldest son, did what the Lord said was evil, so the Lord killed him.
8. అప్పుడు యూదా ఓనానుతో - నీ అన్న భార్య యొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయుమని చెప్పెను.మత్తయి 22:24, మార్కు 12:19, లూకా 20:28
8. Then Judah said to Er's brother Onan, 'Go and have sexual relations with your dead brother's wife. It is your duty to provide children for your brother in this way.'
9. ఓనాను ఆ సంతానము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను.
9. But Onan knew that the children would not belong to him, so when he was supposed to have sexual relations with Tamar he did not complete the sex act. This made it impossible for Tamar to become pregnant and for Er to have descendants.
10. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడ చంపెను.
10. The Lord was displeased by this wicked thing Onan had done, so the Lord killed Onan also.
11. అప్పుడు యూదా ఇతడు కూడ ఇతని అన్నలవలె చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి యింట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి యింట నివసించెను.
11. Then Judah said to his daughter-in-law Tamar, 'Go back to live in your father's house, and don't marry until my young son Shelah grows up.' Judah was afraid that Shelah also would die like his brothers. So Tamar returned to her father's home.
12. చాలా దినములైన తరువాత షూయ కుమార్తెయైన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొఱ్ఱెల బొచ్చుకత్తిరించు వారియొద్దకు వెళ్లెను
12. After a long time Judah's wife, the daughter of Shua, died. After Judah had gotten over his sorrow, he went to Timnah to his men who were cutting the wool from his sheep. His friend Hirah from Adullam went with him.
13. దాని మామ తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్లుచున్నాడని తామారునకు తెలుపబడెను.
13. Tamar learned that Judah, her father-in-law, was going to Timnah to cut the wool from his sheep.
14. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికిని తాను అతని కియ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి, ముసుకు వేసికొని శరీరమంతయు కప్పుకొని, తిమ్నాతునకు పోవు మార్గములోన
14. So she took off the clothes that showed she was a widow and covered her face with a veil to hide who she was. Then she sat down by the gate of Enaim on the road to Timnah. She did this because Judah's younger son Shelah had grown up, but Judah had not made plans for her to marry him.
15. యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని
15. When Judah saw her, he thought she was a prostitute, because she had covered her face with a veil.
16. ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక - నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందుకామె - నీవు నాతో వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను.
16. So Judah went to her and said, 'Let me have sexual relations with you.' He did not know that she was Tamar, his daughter-in-law. She asked, 'What will you give me if I let you have sexual relations with me?'
17. అందుకతడు - నేను మందలోనుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె అది పంపువరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను.
17. Judah answered, 'I will send you a young goat from my flock.' She answered, 'First give me something to keep as a deposit until you send the goat.'
18. అతడు - నేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె - నీ ముద్రయు దాని దారమును నీ చేతి కఱ్ఱయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను; ఆమె అతనివలన గర్భవతి
18. Judah asked, 'What do you want me to give you as a deposit?' Tamar answered, 'Give me your seal and its cord, and give me your walking stick.' So Judah gave these things to her. Then Judah and Tamar had sexual relations, and Tamar became pregnant.
19. అప్పుడామె లేచి పోయి తన ముసుకు తీసివేసి తన వైధవ్యవస్త్రములను వేసికొనెను.
19. When Tamar went home, she took off the veil that covered her face and put on the clothes that showed she was a widow.
20. తరువాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లా మీయుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు.
20. Judah sent his friend Hirah with the young goat to find the woman and get back his seal and the walking stick he had given her, but Hirah could not find her.
21. కాబట్టి అతడు - మార్గమందు ఏనాయిము నొద్ద నుండిన ఆ వేశ్య యెక్కడనున్నదని ఆ చోటి మనుష్యులను అడుగగా వారు - ఇక్కడ వేశ్య యెవతెయు లేదని చెప్పిరి.
21. He asked some of the people at the town of Enaim, 'Where is the prostitute who was here by the road?' They answered, 'There has never been a prostitute here.'
22. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్లి ఆమె నాకు కనబడలేదు; మరియు ఆ చోటి మనుష్యులు ఇక్కడికి వేశ్య యెవతెయు రాలేదని చెప్పిరని అనినప్పుడు
22. So he went back to Judah and said, 'I could not find the woman, and the people who lived there said, 'There has never been a prostitute here.''
23. యూదా - మనలను అపహాస్యము చేసెదరేమో; ఆమె వాటిని ఉంచుకొననిమ్ము; ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను.
23. Judah said, 'Let her keep the things. I don't want people to laugh at us. I sent her the goat as I promised, but you could not find her.'
24. రమారమి మూడు నెలలైన తరువాత నీ కోడలగు తామారు జారత్వము చేసెను; అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతియైనదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా - ఆమెను బయటికి తీసికొనిరండి, ఆమెను కాల్చి వేయవలెనని చెప్పెను.
24. About three months later someone told Judah, 'Tamar, your daughter-in-law, is guilty of acting like a prostitute, and now she is pregnant.' Then Judah said, 'Bring her out and let her be burned to death.'
25. ఆమెను బయటికి తీసికొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి - ఇవి యెవరివో ఆ మనుష్యుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర యీ దారము ఈ కఱ్ఱ యెవరివో దయచేసి గురుతు పట్టుమని చెప్పించెను.
25. When the people went to bring Tamar out, she sent a message to her father-in-law that said, 'The man who owns these things has made me pregnant. Look at this seal and its cord and this walking stick, and tell me whose they are.'
26. యూదా వాటిని గురుతుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరి యెప్పుడును ఆమెను కూడలేదు.
26. Judah recognized them and said, 'She is more in the right than I. She did this because I did not give her to my son Shelah as I promised.' And Judah did not have sexual relations with her again.
27. ఆమె ప్రసవకాలమందు కవల వారు ఆమె గర్భమందుండిరి.
27. When the time came for Tamar to give birth, there were twins in her body.
28. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎఱ్ఱ నూలు తీసి వాని చేతికి కట్టి - ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పెను.
28. While she was giving birth, one baby put his hand out. The nurse tied a red string on his hand and said, 'This baby came out first.'
29. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామె నీ వేల భేదించుకొని వచ్చితి వనెను. అందుచేత అతనికి పెరెసు అను పేరు పెట్టబడెను.మత్తయి 1:3
29. But he pulled his hand back in, so the other baby was born first. The nurse said, 'So you are able to break out first,' and they named him Perez.
30. తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికివచ్చెను. అతనికి జెరహు అను పేరు పెట్టబడెను.
30. After this, the baby with the red string on his hand was born, and they named him Zerah.