Samuel II - 2 సమూయేలు 18 | View All

1. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి

2. జనులను మూడు భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును సెరూయా కుమారుడగు అబీషై అను యోవాబు సహోదరుని చేతిక్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతిక్రింద ఒక భాగమును ఉంచెను. దావీదునేను మీతోకూడ బయలుదేరుదునని జనులతో చెప్పగా

3. జనులునీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మాలో సగము మంది చనిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మావంటి పదివేల మందితో నీవు సాటి; కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలెనని అతనితో చెప్పిరి.

4. అందుకు రాజుమీ దృష్టికేది మంచిదో దాని చేసెదనని చెప్పి గుమ్మపు ప్రక్కను నిలిచి యుండగా జనులందరును గుంపులై వందల కొలదిగాను వేల కొలదిగాను బయలుదేరిరి.

5. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచినా నిమిత్తమై ¸యౌవనుడైన అబ్షాలోమునకు దయ జూపుడని ఆజ్ఞాపించెను. జనులందరు వినుచుండగా రాజు అబ్షాలోమునుగూర్చి అధిపతులకందరికి ఆజ్ఞ ఇచ్చెను.

6. జనులు ఇశ్రాయేలువారిని ఎదిరించుటకై పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరుగగా

7. ఇశ్రాయేలువారు దావీదు సేవకుల యెదుట నిలువలేక ఓడిపోయిరి; ఆ దినమున ఇరువది వేల మంది అక్కడ హతులైరి.

8. యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించెను; మరియు నాటి దినమున కత్తిచేత కూలినవారి కంటె ఎక్కువమంది అడవిలో చిక్కుబడి నాశనమైరి.

9. అబ్షాలోము కంచర గాడిదమీద ఎక్కి పోవుచు దావీదు సేవకులకు ఎదురాయెను; ఆ కంచరగాడిద యొక గొప్పమస్తకి వృక్షముయొక్క చిక్కుకొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వ్రేలాడు చుండగా అతని క్రిందనున్న కంచరగాడిద సాగిపోయెను.

10. ఒకడు దానిని చూచి వచ్చి అబ్షాలోము మస్తకివృక్షమున వ్రేలాడుచుండుట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు

11. యోవాబునీవు చూచి యుంటివే, నేల కూలునట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపినయెడల పది తులముల వెండియు ఒక నడికట్టును నీకిచ్చియుందునని తనకు సమాచారము చెప్పినవానితో అనెను.

12. అందుకు వాడు¸యౌవనుడైన అబ్షాలోమును ఎవడును ముట్టకుండజాగ్రత్తపడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞ నిచ్చుచుండగా నేను వింటిని; వెయ్యి తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజు కుమారుని నేను చంపను.

13. మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన యెడల అది రాజునకు తెలియకపోదు, రాజు సన్నిధిని నీవే నాకు విరోధివగుదువు గదా అని యోవాబుతో అనగా

14. యోవాబునీవు చేయువరకు నేను కాచుకొని యుందునా? అని చెప్పి మూడు బాణములు చేత పట్టుకొని పోయి మస్తకివృక్షమున వ్రేలాడుచు ఇంకను ప్రాణముతో నున్న అబ్షాలోముయొక్క గుండెకు గురిపెట్టి

15. తన ఆయుధములను మోయువారు పదిమంది చుట్టు చుట్టుకొని యుండగా అబ్షాలోమును కొట్టి చంపెను.

16. అప్పుడు జనులను ఇక హతము చేయక విడువవలసినదని యోవాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలీయులను తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి.

17. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్దగోతిలో పడవేసి పెద్దరాళ్లకుప్ప దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీయులందరును తమ తమ యిండ్లకు పోయిరి.

18. తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని, అబ్షా లోము తాను బ్రదికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి, అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను. నేటివరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు.

19. సాదోకు కుమారుడైన అహిమయస్సునేను పరుగెత్తి కొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదననగా

20. యోవాబు ఈ దినమున ఈ వర్తమానము చెప్ప తగదు, మరియొక దినమున చెప్పవచ్చును; రాజు కుమారుడు మరణమాయెను గనుక ఈ దినమున వర్తమానము తీసికొని పోతగదని అతనితో చెప్పెను.

21. తరువాత కూషీని పిలిచినీవు పోయి నీవు చూచిన దానిని రాజునకు తెలియ జేయుమనగా కూషీ యోవాబునకు నమస్కారము చేసి పరుగెత్తికొని పోయెను.

22. అయితే సాదోకు కుమారుడైన అహి మయస్సుకూషీతోకూడ నేనును పరుగెత్తికొనిపోవు టకు సెలవిమ్మని యోవాబుతో మనవిచేయగా యోవాబునాయనా నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచార మేదియు లేదు గదా అని అతనితో అనగా

23. అతడుఏమైనను సరే నేను పరుగెత్తికొని పోవుదు ననెను. అందుకు యోవాబుపొమ్మని సెలవియ్యగా అహిమయస్సు మైదానపు మార్గ మున పరుగెత్తికొని కూషీకంటె ముందుగా చేరెను.

24. దావీదు రెండు గుమ్మముల మధ్యను నడవలో కూర్చొని యుండెను; కావలికాడు గుమ్మముపైనున్న గోడమీదికి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరుగెత్తికొని వచ్చుచున్న యొకడు కనబడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా

25. రాజువాడు ఒంటరిగా ఉండినయెడల ఏదో వర్తమానము తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు పరుగుమీద వచ్చుచుండగా

26. కావలికాడు పరుగెత్తికొని వచ్చు మరియొకని కనుగొని అదిగో మరియొకడు ఒంటరి గానే పరుగెత్తికొని వచ్చుచున్నాడని ద్వారపుతట్టు తిరిగి చెప్పగా రాజువాడును వర్తమానము తెచ్చుచున్నాడనెను.

27. కావలికాడు మొదటివాడు పరుగెత్తుట చూడగావాడు సాదోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజువాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. అంతలొ

28. అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసినా యేలినవాడవును రాజవునగు నిన్ను చంప చూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పెను.

29. రాజుబాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడుగగా అహిమయస్సుయోవాబు రాజసేవకుడ నైన నీ దాసుడనగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పెను.

30. అప్పుడు రాజునీవు ప్రక్కకు తొలగి నిలిచియుండు మని వానికాజ్ఞనియ్యగా వాడు తొలగి నిలిచెను.

31. అంతలో కూషీ వచ్చినా యేలిన వాడా రాజా, నేను నీకు శుభసమాచారము తెచ్చితిని; యీ దినమున యెహోవా నీ మీదికి వచ్చినవారినందరిని ఓడించి నీకు న్యాయము తీర్చెనని చెప్పినప్పుడు

32. రాజుబాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడిగెను. అందుకు కూషీ చెప్పినదేమనగానా యేలినవాడవును రాజవునగు నీ శత్రువులును నీకు హాని చేయవలెనని నీ మీదికి వచ్చినవారందరును ఆ బాలుడున్నట్టుగానే యుందురు గాక.

33. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మ మునకు పైగా నున్న గదికి ఎక్కి పోయి యేడ్చుచు, సంచరించుచునా కుమారుడా అబ్షా లోమా, నా కుమా రుడా అబ్షాలోమా, అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును; నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా, అని యేడ్చుచు వచ్చెను.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Samuel II - 2 సమూయేలు 18 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అబ్షాలోము సైన్యం ఓడిపోయింది. (1-8) 
దావీదు చెడుకు మంచితనంతో ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు! అబ్షాలోము దావీదుకు మాత్రమే హాని చేయాలని చూస్తున్నప్పుడు, దావీదు అబ్షాలోము భద్రతను మాత్రమే కోరుకుంటాడు. ఇది దేవుని పట్ల మానవత్వం యొక్క దుష్టత్వాన్ని మరియు మానవాళి పట్ల దేవుడు చూపే అపురూపమైన దయను ప్రతిబింబిస్తుంది - ఇది అర్థం చేసుకోవడం కష్టం. ఇశ్రాయేలీయులు ఇప్పుడు ప్రభువుకు మరియు ఆయన ఎన్నుకున్న వ్యక్తికి వ్యతిరేకంగా కుట్ర పన్నడం వల్ల కలిగే పరిణామాలను చూస్తున్నారు.

అతను చంపబడ్డాడు. (9-18) 
యువకులు అబ్షాలోమ్‌ను చెట్టుపై వేలాడదీయడం, స్వర్గం మరియు భూమి రెండింటిచే ఖండించబడటం మరియు విడిచిపెట్టడం గమనించినప్పుడు, తల్లిదండ్రులపై తిరుగుబాటు పట్ల దేవుని అసహ్యకరమైన దృఢమైన సందేశాన్ని వారు గ్రహించనివ్వండి. దుఃఖం మరియు అవమానాల నుండి నిజమైన రక్షణలు స్వర్గపు జ్ఞానం మరియు దేవుని దయలో ఉన్నాయి.

దావీదు యొక్క అతి దుఃఖం. (19-33)
ఆహిమయస్సు తన కుమారుడి మరణ వార్త కోసం దావీదు‌ను సిద్ధం చేశాడు, అతని విజయానికి దేవునికి కృతజ్ఞతలు చెప్పమని కోరాడు. మన హృదయాలు దృఢంగా మరియు మన ఆశీర్వాదాల పట్ల కృతజ్ఞతతో నిండినప్పుడు, మనకు ఎదురయ్యే ప్రతికూలతలను ఓపికగా భరించేందుకు మనం మెరుగ్గా సన్నద్ధమవుతాము. దావీదు కోరిక అబ్షాలోము యొక్క శాశ్వతమైన విధి గురించి ఆందోళన నుండి ఉద్భవించిందని కొందరు నమ్ముతారు, అయితే అతను తగినంత పరిశీలన లేకుండా మాట్లాడినట్లు కనిపిస్తుంది. దయ చూపని కొడుకు పట్ల మితిమీరిన వాత్సల్యాన్ని ప్రదర్శించినందుకు అతను నిందకు అర్హుడు. ఇంకా, అతను దైవిక న్యాయంతో కలహించడం మరియు దేశం యొక్క న్యాయాన్ని వ్యతిరేకించడంలో తప్పుగా ఉన్నాడు, రాజుగా, అతను నిర్వహణకు బాధ్యత వహిస్తాడు మరియు సహజమైన ప్రేమ కంటే ప్రాధాన్యత ఇవ్వాలి.
ఉత్తమ వ్యక్తులు కూడా బలహీనత యొక్క క్షణాలను అనుభవించవచ్చని ఈ సంఘటన చూపిస్తుంది. మనం అతిగా ప్రేమించిన దాని కోసం మనం ఎక్కువగా దుఃఖించే అవకాశం ఉంది. ఈ ఉదాహరణ నుండి మనం అప్రమత్తంగా ఉండాలని మరియు మన పిల్లల పట్ల పాపభరితమైన భోగము లేదా నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రార్థించడాన్ని నేర్చుకుంటున్నప్పుడు, దావీదులో రక్షకుని ప్రేమ యొక్క ముందస్తు సూచనను కూడా మనం గ్రహించవచ్చు. తిరుగుబాటు మరియు శత్రు స్వభావం ఉన్నప్పటికీ మానవజాతి కోసం ఏడ్చిన, ప్రార్థించిన మరియు మరణాన్ని అనుభవించిన రక్షకుని వలె, దావీదు యొక్క భావోద్వేగాలు ఈ ప్రగాఢమైన ప్రేమ మరియు కరుణ యొక్క సంగ్రహావలోకనాన్ని ప్రతిబింబిస్తాయి.



Shortcut Links
2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |